కొత్త Nissan Gravite MPV, జనవరిలో మార్కెట్‌కు పరిచయం – ఫుల్ లాంచ్ టైమ్‌లైన్ ఇదే
భారత్‌లో కొత్త Nissan Gravite MPV పేరు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. 2026 జనవరిలో ఆవిష్కరణ, మార్చిలో ధరల ప్రకటన ఉంటుంది. డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

Nissan Gravite Launch 2026: భారత ఆటో మార్కెట్‌లో తన ఉనికిని చాటుకునేందుకు Nissan మరో కీలక అడుగు వేయబోతోంది. చాలా రోజులుగా చర్చలో ఉన్న నిస్సాన్ కొత్త కాంపాక్ట్ MPVకి సంబంధించి ఇప్పుడు అధికారిక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ కొత్త మూడు-వరుసల MPV పేరు Nissan Gravite అని కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్‌ను 2026 జనవరిలో అధికారికంగా ఆవిష్కరించనుండగా, ధరలను మాత్రం మార్చి 2026లో ప్రకటిస్తుంది.
Renault Triber ఆధారంగా Nissan Gravite
Nissan Gravite, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Renault Triber ఆధారంగా రూపొందింది. అంటే ఇందులో CMF-A+ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణంగా ఇంజిన్, మెకానికల్ సెటప్ కూడా ట్రైబర్‌కు చాలా దగ్గరగా ఉంటాయని అంచనా. నిస్సాన్ లైనప్‌లో Magnite కంటే దిగువ స్థాయిలో Gravite ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో 7 సీట్ల కారు కొనాలనుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ MPVని నిస్సాన్ సిద్ధం చేస్తోంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్ – నిస్సాన్ టచ్ స్పష్టంగా
ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్ చిత్రాలను గమనిస్తే, Gravite మొత్తం ఆకృతి ట్రైబర్‌లానే ఉంటుంది. అయితే ఫ్రంట్ బంపర్, గ్రిల్, అల్లాయ్ వీల్స్ విషయంలో నిస్సాన్ ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్ ఇచ్చింది. హెడ్‌ల్యాంప్ ఆకారం ట్రైబర్‌ను గుర్తు చేసినా, లోపల లైటింగ్ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి.
వెనుక భాగంలో రీడిజైన్ చేసిన బంపర్, కొత్త టెయిల్ ల్యాంప్ సిగ్నేచర్‌తో పాటు, టెయిల్ గేట్‌పై పెద్ద అక్షరాల్లో Gravite నేమ్‌ప్లేట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ MPV కూడా సబ్-4 మీటర్ పరిమితిలోనే ఉంటుంది.
ఇంటీరియర్, ఫీచర్లు
గ్రావైట్‌లోని ఇంటీరియర్‌ను ఇంకా పూర్తిగా బయటపెట్టలేదు. అయితే డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ లేఅవుట్ ట్రైబర్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. కలర్ థీమ్, ఫీచర్ల ప్యాకేజింగ్‌లో మాత్రం నిస్సాన్ ప్రత్యేకత చూపించే అవకాశం ఉంది.
అంచనా ప్రకారం, ఈ కారులో...
- 7 అంగుళాల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- 8 అంగుళాల టచ్‌స్క్రీన్
- వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్
- పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
- రెండో, మూడో వరుసలకు ఏసీ వెంట్స్
వంటి ఫీచర్లు ఇవ్వొచ్చు. భద్రత విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, TPMS, ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సర్లు, రియర్ వ్యూ కెమెరా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇంజిన్, గేర్‌బాక్స్
Nissan Graviteలో 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వనున్నారు. ఇది 76hp పవర్, 95Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం Triber, Magnite, Kigerలో కూడా ఉంది.
గేర్‌బాక్స్ ఎంపికల్లో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT ఉంటాయి. భవిష్యత్తులో CNG వేరియంట్‌ను డీలర్ స్థాయిలో అందించే అవకాశం కూడా ఉంది.
లాంచ్ టైమ్‌లైన్
జనవరి 2026: ఆవిష్కరణ
ఫిబ్రవరి 2026: నిస్సాన్ ఇండియా ప్రొడక్ట్ ప్లాన్స్‌పై పెద్ద ఈవెంట్
మార్చి 2026: ధరల ప్రకటన, అధికారిక లాంచ్
Nissan Gravite, భారత మార్కెట్‌లో అందుబాటు ధరల్లోని 7 సీట్ల MPV సెగ్మెంట్‌లో నిస్సాన్‌కు కీలక మోడల్‌గా మారే అవకాశం ఉంది. Triberకి ప్రత్యక్ష పోటీగా, నిస్సాన్ బ్యాడ్జ్‌తో వచ్చే ఈ MPVపై ఇప్పటికే మంచి ఆసక్తి కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















