Tata Safari Facelift: కొత్త టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు షురూ - ఎలా బుక్ చేసుకోవాలి?
టాటా సఫారీ కొత్త ఫేస్ లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి.
Tata Safari Facelift: దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇటీవల భారతదేశంలో తన కొత్త, అప్‌డేటెడ్ టాటా సఫారీ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 16.29 లక్షల నుంచి రూ. 27.34 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. దీని బుకింగ్ ఇప్పటికే ఓపెన్ అయింది. కొనుగోలు చేయాలనుకునే ఏ కస్టమర్ అయినా సమీపంలోని డీలర్‌షిప్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దీని కోసం రూ. 25,000 బుకింగ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే టాటా ఇప్పటికే బుక్ చేసిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ డెలివరీని కూడా ప్రారంభించింది.
కొత్త టాటా సఫారీ... స్మార్ట్ (ఓ), ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ ఎ, అకాంప్లిష్డ్+ అనే 10 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.
డిజైన్ ఎలా ఉంది? (Tata Safari Facelift Design)
హారియర్‌కు సంబంధించిన స్ప్లిట్ సెటప్‌తో పోలిస్తే కొత్త సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లో సింగిల్ పీస్ యూనిట్ 'పారామెట్రిక్' గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ కేసింగ్‌లో ఉంచిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉన్నాయి. దీని వెనుక వైపు గురించి చెప్పాలంటే ఇది దాని మునుపటి వేరియంట్‌ను పోలి ఉంటుంది. ఇది కనెక్టెడ్ డీఆర్ఎల్‌తో రీడిజైన్ అయిన టెయిల్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. హారియర్ లాగా రివర్స్, రేర్ ఫాగ్ ల్యాంప్స్ కింద భాగంలో ఉన్నాయిత.
కేబిన్ ఇలా... (Tata Safari Facelift Cabin)
కొత్త సఫారి క్యాబిన్ గురించి మాట్లాడితే ఇది కొత్త యూఐ ఫ్రీ స్టాండింగ్ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ డిస్‌ప్లేతో డ్రైవ్ సెలెక్టర్‌గా రోటరీ నాబ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. మొదటి, రెండో వరుస, 10 స్పీకర్ జేబీఎల్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్, వెనుక విండో షేడ్స్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా సఫారీ హెచ్‌వీఏసీ నియంత్రణల కోసం కొత్త లేఅవుట్‌ను కూడా కలిగి ఉంది. టాటా నెక్సాన్ లాగా టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
ఇంజిన్ ఎలా ఉందంటే? (Tata Safari Facelift Engine)
కొత్త టాటా సఫారీ కారులో 2.0 లీటర్ మల్టీ జెట్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 170 హెచ్‌పీ శక్తిని, 350 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక గేర్ బాక్స్ గురించి మాట్లాడినట్లయితే 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను ఇది కలిగి ఉంటుంది. సెక్యూరిటీ రేటింగ్ గురించి మాట్లాడినట్లయితే కొత్త టాటా సఫారీ పెద్దలు, పిల్లల కోసం 5-స్టార్ స్కోర్‌ను అందుకుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!