Maruti Suzuki Victoris డ్రైవింగ్ అనుభవాన్ని బయటపెట్టిన సీక్రెట్స్ - స్టైల్, కంఫర్ట్, మైలేజ్‌లో ఈ కారు బెస్టేనా?
Maruti Suzuki Victoris SUV ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది. స్టైలిష్ డిజైన్, కంఫర్ట్ సీటింగ్, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో నిజంగా ఇది ఆల్‌రౌండర్ SUV అనిపించుకుందో, లేదో తెలుసుకోండి.

Maruti Suzuki Victoris First Drive Review: మారుతి సుజుకి నుంచి వచ్చిన తాజా SUV విక్టోరిస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ, కారు ప్రేమికులలో పెద్ద ఆసక్తిని రేపుతోంది. కొత్త డిజైన్, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్, కంఫర్ట్ & ఫీచర్లతో ఈ SUV నిజంగానే ఆల్‌రౌండరా అనే ప్రశ్న అందరిలో ఉంది. దీనికి సమాధానం ఈ కథనంలోనే తెసుకుందాం.
లుక్స్ & డిజైన్
విక్టోరిస్ ముందు భాగం పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. స్లిమ్ హెడ్‌ల్యాంప్స్, బాడీ కలర్ ఎలిమెంట్ కలిపి ఒక EV లాంటి స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. రోడ్డుపైకి వచ్చిన వెంటనే ఈ SUV ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు.
స్పేస్ & కంఫర్ట్
ఇంటీరియర్ విషయానికి వస్తే, లెదరెట్ సీట్స్ కంఫర్ట్‌గా ఉంటాయి. ఫ్రంట్ సీట్స్ బాగానే సపోర్ట్ ఇస్తాయి. రియర్ సీట్స్ కూడా సౌకర్యంగా ఉంటాయి, కానీ పొడవైన వాళ్లకు లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ కొంచెం టైట్‌గా అనిపించవచ్చు. కేబిన్ వెడల్పు కొద్దిగా తక్కువగా అనిపించినా, పెద్ద విండోలు & లైట్ కలర్ ఇంటీరియర్స్ వల్ల ఓపెన్ ఫీల్ వస్తుంది. బూట్ స్పేస్ మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) కంటే ఎక్కువగా ఉండడం మరో హైలైట్. కిక్ సెన్సర్ టెయిల్‌గేట్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది.
ఇంజిన్ & డ్రైవింగ్ అనుభవం
మేము డ్రైవ్ చేసిన వేరియంట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ (103bhp, 138Nm) & 6-స్పీడ్ ఆటోమేటిక్. సిటీ డ్రైవ్‌కి ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. లైట్ స్టీరింగ్, సైలెంట్ ఇంజిన్, స్మూత్ గేర్ షిఫ్ట్స్ - ఇవన్నీ ట్రాఫిక్‌లో డ్రైవ్‌ను ఈజీగా మార్చేస్తాయి. అయితే హై స్పీడ్‌లో ప్రెజర్ పెడితే ఇంజిన్ కొంచెం స్ట్రగుల్ అవుతోంది, కూల్‌గా డ్రైవ్ చేస్తే బెస్ట్ ఫీల్ ఇస్తుంది.
ఆల్‌గ్రిప్ AWD వెర్షన్
ఈ SUVలో 210mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఆల్‌గ్రిప్ AWD వేరియంట్ కఠినమైన రోడ్లు, వాలుగా ఉండే ప్రాంతాల్లో సూపర్‌గా పని చేస్తుంది. స్టాండర్డ్ గా ఇది టూ వీల్ డ్రైవ్, కానీ ఆన్-డిమాండ్ AWD ఉంది. మీరు దీనిని లాక్ చేయవచ్చు & ఇతర మోడ్స్ కూడా ఉన్నాయి. హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ కాకపోయినా, ప్రత్యర్థి కార్ల కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
మైలేజ్ & సేఫ్టీ
AWD వెర్షన్‌లో మాకు సగటున లీటరుకు 12 km వచ్చింది. మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లో లీటరుకు 14-15 km వరకు వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ రియల్ వరల్డ్‌లో లీటరుకు 20 km పైగా ఇస్తుందని అంచనా. సేఫ్టీ విషయానికి వస్తే, BNCAP & GNCAPలో 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ రావడం పెద్ద ప్లస్.
కొనవచ్చా, లేదా?
ఫీచర్లు, సేఫ్టీ, స్టైలింగ్, మైలేజ్ - అన్ని బాక్సులు టిక్ చేసిన SUV ఇది. అంటే, అన్ని విషయాల్లో సంతృప్తికరంగా ఉంది. చిన్న చిన్న మైనస్‌లు (చిన్న లెగ్‌రూమ్, బూస్టర్‌జెట్ ఇంజిన్ లేదు) ఉన్నా కూడా, మార్కెట్‌లో హాట్ సేలర్ అనిపించుకుటుంది.





















