అన్వేషించండి

Mahindra Scorpio N 2026: ఆకట్టుకునే బోల్డ్ లుక్, సరికొత్త ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో N.. లాంచింగ్, ధర వివరాలు

మహీంద్రా 2026లో Scorpio N ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఇది సరికొత్త డిజైన్, పెద్దదైన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తుందని అంతా భావిస్తున్నారు. ఫీచర్లు, ధర అంచనాలు ఇలా ఉన్నాయి.

మహీంద్రా కంపెనీకి చెందిన Mahindra Scorpio N 2026 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కంపెనీ వాహనాన్ని కొత్త లుక్‌లో పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో స్కోర్పియో తన స్ట్రాంగ్ బాడీ, రఫ్-టఫ్ లుక్ కారణంగా చిన్న, పెద్ద నగరాల్లో బాగా ఫేమస్ అయింది. అయితే ఒక్కో కంపెనీ నుంచి మార్కెట్లోకి కొత్త SUVలు రావడంతో దీనికి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పుడు కంపెనీ దీనిని అప్‌డేట్ చేసి మళ్లీ కం బ్యాక్ చేయాలని భావిస్తోంది. కొత్త Scorpio N 2026లో మీకు అదే స్ట్రాంగ్ బాడీ, పవర్‌ఫుల్ రోడ్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు, మెరుగైన డిజైన్‌ను యాడ్ చేయనున్నారు. స్టైల్, పవర్ రెండూ కోరుకునే వారి కోసం ఈ SUV ప్రత్యేకంగా నిలుస్తుంది.

డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?
కొత్త Scorpio N 2026 లుక్ మునుపటిలాగే ధీటుగా ఉంటుంది. అయితే కొత్త స్కార్పియోలో కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. కంపెనీ ఇందులో కొత్త డిజైన్ హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇది SUVని మరింత మోడ్రన్‌గా మార్చేస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్, రియర్ బంపర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త డిజైన్ అలాయ్ వీల్స్,  కొన్ని కొత్త ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్ దీన్ని ఇప్పటివరకూ ఉన్న స్కార్పియో కంటే ఆకర్షణీయంగా మారుస్తాయి. మొత్తానికి మహీంద్రా స్కార్పియో దీని లుక్ పూర్తిగా మార్చకుండా, మరింత స్టైలిష్‌గా డిజైన్ చేస్తున్నారు. 

కేబిన్, ఫీచర్లలో కొత్తగా ఏముంటుంది?
Scorpio N 2026 లోపల మీకు ప్రీమియం అనుభూతి కలుగుతుంది. ఇందులో పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వనున్నారు. ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను బెటర్ చేస్తుంది. దీంతో పాటు కేబిన్ డిజైన్ కూడా కొంచెం కొత్తగా, సౌకర్యవంతంగా ఉండవచ్చు. కొత్త టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లు దీనిని నేటి కాలానికి తగ్గట్టుగా మరింత స్మార్ట్‌గా చూపిస్తాయి.  ఇందులో సీట్లు, ఇంటీరియర్ క్వాలిటీలో కూడా కొంచెం మార్పులు చూడవచ్చు.

స్కార్పియో ఎన్ ఇంజిన్, పనితీరు
ఇంజిన్ విషయంలో కంపెనీ పెద్దగా మార్పులు చేర్పులు లాంటివి చేయదు. ఇందులో మునుపటిలాగే 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. ఈ ఇంజిన్లు ఇప్పటికే మంచి పనితీరుకు పేరుగాంచాయి. దీనితో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని వేరియంట్లలో 4X4 సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇది గతుకుల రోడ్లు, కఠినమైన దారుల్లో మీ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది.

కొత్త స్కార్పియో ధర, లాంచ్ తేదీ
మహీంద్రా కొత్తగా తెస్తున్న Mahindra Scorpio N 2026 ధర స్వల్పంగా  పెరగవచ్చు. దీని ధర వేరియంట్ బట్టి రూ. 14 లక్షల నుండి రూ. 26 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్కార్పియో ఎన్ లాంచ్ విషయానికి వస్తే, ఈ SUV ఆగస్టు 2026 నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే  మహీంద్రా కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి తేదీని ప్రకటించలేదు.

Also Read: Hyundai Price Hike: మే 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు.. ఎంత మేర పెరుగుతాయంటే !

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget