అన్వేషించండి

Hyundai Price Hike: మే 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు.. ఎంత మేర పెరుగుతాయంటే !

Hyundai Price Hike: మే 1, 2026 నుంచి హ్యుందాయ్ కంపెనీ తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలాఖరులోగా కారు కొంటే పెరిగే ధరల నుంచి కాస్త ఊరట కలుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు.

మీరు ఒకవేళ Hyundai కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ తన అన్ని కార్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. మే 1, 2026 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ పెరుగుదల గరిష్టంగా 1 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే వేర్వేరు మోడళ్లు, వేరియంట్‌లను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీరు ఇప్పుడే కారును కొనుగోలు చేస్తే, పెరిగిన ధర అధిక ఛార్జీల నుంచి ఊరట పొందవచ్చు. ఏప్రిల్ నెలాఖరులోగా కారు కొనుగోలు చేస్తే మీకు కాస్త తక్కువ ధరకు లభిస్తుంది. 

కార్ల ధర పెరగడానికి కారణం ఏమిటి?
తమ కార్ల ధరల పెరుగుదలకు కారణం తయారీ ఖర్చులు పెరగడమే అని Hyundai కంపెనీ తెలిపింది. గత కొంతకాలం నుంచి వాహనాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులు, ఇతర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. వినియోగదారులపై ఎక్కువ భారం పడకూడదని తాము ఎప్పుడూ ప్రయత్నిస్తామని, అయితే ప్రస్తుతం ఖర్చులు భారీగా పెరగడంతో కార్ల ధరలను స్వల్పంగా పెంచక తప్పడం లేదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. 

అమ్మకాల్లోనూ దూకుడు
కార్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నప్పటికీ, Hyundai అమ్మకాల్లో స్థిరమైన వృద్ధి కనిపించడం విశేషం. ఆర్థిక సంవత్సరం 2026 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 2 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలతో తమ స్థానాన్ని నిలుపుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 8.7 శాతం ఎక్కువ అని గుర్తుంచుకోండి. భారత ఆటో మార్కెట్లో కూడా కంపెనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఇప్పటివరకు అత్యధిక త్రైమాసిక అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, Hyundai కంపెనీ ఈ విభాగంలోనూ తన పట్టును నిలబెట్టుకుంటూ సుమారు 9 శాతం వృద్ధిని సాధించింది. మార్చి 2026లో కూడా హ్యుందాయ్ కంపెనీ మంచి ఫలితాలు రాబట్టింది. వినియోగదారుల్లో Hyundai కార్లకు ఉన్న డిమాండ్ ఉందని, అందుకు కంపెనీ క్వాలిటీతో పాటు సర్వీసులు కారణమని అర్థమవుతోంది.

కారు ఇప్పుడే కొనడం మంచిది.. 
మీరు త్వరలో Hyundai కారును కొనే ప్లాన్‌ చేసుకుంటే కనుక ఏప్రిల్ నెలాఖరులోపే మీకు సరైన టైం కావచ్చు. ధరలు పెరగకముందే కొనడం ద్వారా మీరు కొంతమేర నగదు ఆదా చేసుకోవచ్చు. ఈ సమయంలో చాలా మంది డీలర్లు అదనపు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇచ్చి విక్రయాలు పెంచాలని ప్రయత్నిస్తారు. కనుక ఈ నెలాఖరులోగా కొనకపోతే మే 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget