అన్వేషించండి

SUV Cars Under 15 Lakh: 15 లక్షల బడ్జెట్‌లో మార్కెట్‌లో ఉన్న టాప్ ఎస్‌యూవీలు ఇవే!

SUV Cars Under 15 Lakh: భారత్‌లో ఎస్‌యూవీ కార్లకే క్రేజ్ ఎక్కువ. ముఖ్యంగా 15 లక్షల బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు, అత్యుత్తమ భద్రత, వైవిధ్యమైన ఇంధన ఆప్షన్‌లో 50కిపైగా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలో SUVల ప్రజాదరణ పెరుగుతోంది, రూ. 15 లక్షల లోపు 56 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
  • బడ్జెట్-ఫ్రెండ్లీ మైక్రో SUVలు, కాంపాక్ట్, మిడ్-సైజ్ SUVలు విస్తృతంగా ఆదరణ పొందుతున్నాయి.
  • ఎలక్ట్రిక్, హైబ్రిడ్ SUVలు ఇంధన ఖర్చు, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి.
  • కొనుగోలుదారులు భద్రతా ఫీచర్లు, ప్రయాణ అవసరాలకు తగిన వేరియంట్లను ఎంచుకోవాలి.
SUV Cars Under 15 Lakh: భారతీయ రహదారులపై ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల హవా నడిచేది. కానీ నేడు సీన్ మారింది. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం కారుకు ఉండే గంభీరమైన రూపం, మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌, అత్యాధునిక భద్రతా ఫీచర్లు. ప్రస్తుతం మన దేశంలో 15 లక్షల లోపు ధరలో దాదాపు 56 రకాల ఎస్‌యూవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

ఎందుకు ఈ సెగ్మెంట్‌ ఇంత పాపులర్‌?

వినియోగదారులు ఇప్పుడు కేవలం మైలేజీ మాత్రమే కాకుండా స్టెల్‌ , సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. 15 లక్షల బడ్జెట్‌ అనేది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధర. ఇందులో సెగ్మెంట్‌-లీడింగ్‌ ఫీచర్లు అంటే 36 డిగ్రీ కెమెరాలు, సన్‌రూఫ్‌లు, వెంటిలేటెడ్‌ సీట్లు వంటివి లభిస్తుండటంతో ఈ విభాగం అత్యంత పోటీగా మారింది. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్తమ ఎంపికలు ఇవే!

బడ్జెట్‌ ఫ్రెండ్లీ మైక్రో ఎస్‌యూవీలు

తక్కువ ధరలో ఎస్‌యూవీ అనుభూతిని పొందాలనుకునే వారికి టాటా పంచ్, హ్యాందాయ్‌ ఎక్స్టర్‌ అద్భుతమైన ఎంపికలు. టాటా పంచ్ ధర 5.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యూందాయ్ ఎక్స్టర్‌ 5.80 లక్షల ప్రారంభ ధరతో లభిస్తోంది. ఇవి ఇరుకైన నగర రహదారులపై నడపడానికి సులభంగా ఉంటాయి. 

కాంపాక్ట్, మిడ్‌సైజ్ ఎస్‌యూవీలు:

ఈ విభాగంలో టాటా నెక్సాన్‌, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యూందాయ్‌ వెన్యూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ప్రయాణికులకు భరోసానిస్తోంది. ఇక హ్యూందాయ్‌ క్రెటా, కియా స్టెలోస్ వంటి మోడల్స్ 10.79 లక్షల నుంచి 11 లక్షల ప్రారంభ ధరతో లగ్జరీ ఫీచర్లను అందిస్తున్నాయి. 

ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ విప్లవం

కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన ఖర్చును ఆదా చేయాలనుకునే వారి కోసం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్‌ ఈవీ సుమారు 315-468కిలోమటీర్ల రేంజ్‌ను అందిస్తుందని చెబుతున్నారు. దీని ధర 9.69 లక్షల నుంచి మొదలవుతుంది. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్‌, గ్రాండ్ విటారా హైబ్రిడ్ టెక్నాలజీతో 28 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తున్నాయి. 

ఆఫ్‌ రోడింగ్‌ ప్రియుల కోసం 

హార్డ్ రోడ్లలో ప్రయాణించాలనుకునే వారికి మహీంద్రా థార్, మారుతి సుజుకి జిమ్మీ సరైన జోడీ. మహీంద్రా థార్ 9.99 లక్షలు ప్రారంభ ధరతో అడ్వెంచర్ ప్రియులను ఆకట్టుకుంటోంది. 

కొనుగోలుదారుల కోసం సూచనలు 

కారు కొనేముందు దాని గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్ చూడండి. ప్రస్తుతం ఈ విభాగంలో 15 మోడల్స్ ఫైవ్ స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. మీ ప్రయాణం ఎక్కువ నగరంలో ఉంటే పెట్రోల్‌ లేదా ఎలక్ట్రిక్‌, లాంగ్ డ్రైవ్స్‌ అయితే డీజిల్‌ , హైబ్రిడ్‌ వేరియంట్లను ఎంచుకోండి. కేవలం విలాసాల కోసం కాకుండా ఏబీఎస్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నాయో లేదో చూడాలి. 
 
భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా మారుతోంది. గతంలో ఇంజిన్ సామర్థ్యంపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు వినియోగదారులు కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్‌, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్సమ్స్‌ వంటి వాటిని కోరుకుంటున్నారు. క్లాసిక్ బ్రాండ్లయిన మహీంద్రా స్కార్పియో వంటివి కూడా సరికొత్త హంగులతో స్కార్పియో ఎన్‌ రూపంలో అందుబాటులోకి వచ్చి మధ్యతరగతి వినియోగదారులకు చేరువయ్యాయి. 

Frequently Asked Questions

భారతదేశంలో SUVల ప్రజాదరణకు కారణాలు ఏమిటి?

SUVలకు ఉండే ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, అత్యాధునిక భద్రతా ఫీచర్లు దీనికి ప్రధాన కారణాలు. వినియోగదారులు స్టైల్, భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

15 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బడ్జెట్-ఫ్రెండ్లీ SUVలు ఏవి?

టాటా పంచ్ (5.59 లక్షల నుండి) మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ (5.80 లక్షల నుండి) బడ్జెట్-ఫ్రెండ్లీ మైక్రో-SUVలుగా ఉన్నాయి. ఇవి నగరాల్లో నడపడానికి అనువుగా ఉంటాయి.

ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ SUVల గురించి చెప్పండి.

కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన ఖర్చును ఆదా చేయడానికి ఎలక్ట్రిక్ SUVలు అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్ EV సుమారు 315-468 కిమీల రేంజ్ అందిస్తుంది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ 28 కిమీల మైలేజీ ఇస్తుంది.

SUV కొనుగోలు చేసేటప్పుడు ఏయే అంశాలను పరిగణించాలి?

కారు గ్లోబల్ NCAP రేటింగ్, మీ ప్రయాణ అవసరాలకు తగిన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్), మరియు ABS, ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget