₹10.99 లక్షలకే New-gen Kia Seltos లాంచ్ - న్యూ డిజైన్, ADASతో పవర్‌ఫుల్ ప్యాకేజీ
న్యూ జనరేషన్ Kia Seltos భారత్‌లో ₹10.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయ్యింది. కొత్త డిజైన్, ADAS, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది.

New Kia Seltos 2026 Price Specifications: భారత మిడ్-సైజ్ SUV మార్కెట్‌లో పోటీని మరింత పెంచుతూ న్యూ జనరేషన్ Kia Seltos అధికారికంగా లాంచ్ అయ్యింది. కియా ఇండియా ఈ కొత్త Seltosను ₹10.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుంచి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్ ఎంపికలు అన్నింటిలోనూ ఇది పూర్తిస్థాయి అప్‌డేట్‌గా నిలవనుంది.
కొత్త Seltos ఏ కార్లతో పోటీ పడనుంది?
ఇప్పటికే హాట్ సెగ్మెంట్‌గా మారిన మిడ్-సైజ్ SUV విభాగంలో New Kia Seltos పోటీ పడుతుంది. ఈ సెగ్మెంట్‌లో... Hyundai Creta, Maruti Suzuki Grand Vitara, Victoris, Skoda Kushaq, Volkswagen Taigun, త్వరలో రానున్న Renault Duster ఉన్నాయి. ఈ పోటీ మధ్యలో నిలబడేందుకు కియా కొత్త Seltosను మరింత ప్రీమియం, పవర్‌ఫుల్ ప్యాకేజీగా రూపొందించింది.
సైజ్‌లో పెరిగిన Seltos
న్యూ జనరేషన్ Seltos పాత మోడల్‌తో పోలిస్తే పొడవు, వెడల్పు పెరిగింది. దీనివల్ల, రోడ్డుపై ఇది మరింత అగ్రెసివ్‌గా కనిపించడమే కాదు, లోపల కంఫర్ట్ కూడా మెరుగైంది. ముఖ్యంగా వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికులకు లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఎక్కువగా లభిస్తోంది. కియా ఈసారి స్పష్టంగా ఇంటీరియర్ స్పేస్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది.
షార్ప్ డిజైన్, కొత్త లుక్
డిజైన్ విషయంలో కొత్త Seltos మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో కొత్త స్టైలింగ్, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ SUVకి ఫ్రెష్ ఐడెంటిటీ ఇచ్చాయి. సైడ్ ప్రొఫైల్‌లో పరిచయమైన ఆకృతి కొనసాగించినప్పటికీ, కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ లాంటి చిన్న వివరాలు కారును మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు
కేబిన్‌లోకి అడుగుపెట్టగానే మార్పులు వెంటనే కనిపిస్తాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిపిన పెద్ద పానోరమిక్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మెటీరియల్ క్వాలిటీ మెరుగుపడింది, లేఅవుట్ మరింత క్లీన్‌గా అనిపిస్తుంది. పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు నగర డ్రైవింగ్‌కే కాదు, లాంగ్ జర్నీల్లోనూ మంచి కంఫర్ట్‌ను అందిస్తాయి.
సేఫ్టీకి పెద్ద పీట
ఈ జనరేషన్‌లో సేఫ్టీకి కియా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. గ్లోబల్ K3 ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన కొత్త Seltos మెరుగైన నిర్మాణ బలాన్ని అందిస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్లలో లెవల్ 2 ADAS ఫీచర్లు లభిస్తాయి. హైవే డ్రైవింగ్‌లో, ట్రాఫిక్‌లో ఇది డ్రైవర్‌కు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.
ఇంజిన్ ఆప్షన్లు, ధరలు
న్యూ జనరేషన్ Kia Seltosలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. నేచురల్‌గా ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
పెట్రోల్ వెర్షన్‌లో టాప్ ఎండ్ 1.5 Turbo Petrol DCT GTX (ADAS) వేరియంట్‌కు ₹19.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించారు.
డీజిల్ వెర్షన్‌లో టాప్ ఎండ్ 1.5 Diesel AT GTX (ADAS) వేరియంట్ ధరను కూడా ₹19.99 లక్షల ఎక్స్-షోరూమ్‌గానే నిర్ణయించారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















