అన్వేషించండి

MG Comet, Windsor, ZS EV కొనేవాళ్లకు అద్భుతమైన బెనిఫిట్‌ - ఆఫర్‌ గడువు 5 ఏళ్ల వరకు పెంపు

MG Motor India తన Comet EV, Windsor EV, ZS EVలకు 3, 4, 5 ఏళ్ల అస్యూర్డ్‌ బైబ్యాక్‌ స్కీమ్‌ను పొడిగించింది. ఎలక్ట్రిక్‌ కారు రీసేల్‌ విలువపై ఆందోళన తగ్గించే కీలక నిర్ణయం ఇది.

MG Assured Buyback Program: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుపై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, చాలామంది వినియోగదారుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది. అదే.. 'రీసేల్‌' విలువ. “కొన్ని ఏళ్ల తర్వాత ఈవీ అమ్మితే ఎంత వస్తుంది?” అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే లక్ష్యంగా JSW MG Motor India కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇప్పటికే అమలులో ఉన్న "అస్యూర్డ్‌ బైబ్యాక్‌ ప్రోగ్రామ్‌"ను ఇప్పుడు 5 ఏళ్ల వరకు పెంచింది. MG Value Promise పేరుతో కొనసాగుతున్న ఈ స్కీమ్‌ ఇప్పటివరకు 3 ఏళ్ల వరకే ఉండేది. గరిష్టంగా 60 శాతం వరకు రీసేల్‌ విలువకు గ్యారంటీ ఇస్తూ వచ్చింది. తాజా అప్‌డేట్‌తో, ఇప్పుడు కస్టమర్లు 3, 4 లేదా 5 ఏళ్ల టెన్యూర్‌ను కార్‌ కొనుగోలు సమయంలోనే ఎంపిక చేసుకోవచ్చు.

ఈ స్కీమ్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.... ఇది ఏ బ్యాంక్‌ లోన్‌ లేదా ఫైనాన్స్‌ ప్యాకేజీకి లింక్‌ అయి ఉండదు. కస్టమర్‌ కావాలంటే ఫైనాన్స్‌తో, లేకపోతే క్యాష్‌ పేమెంట్‌తోనూ ఈ బైబ్యాక్‌ ఆప్షన్‌ను సొంతంగా ఎంచుకోవచ్చు.

ఎంచుకున్న కాల పరిమితి పూర్తయ్యాక, వాహన యజమానికి మూడు ఆప్షన్లు ఉంటాయి. అవి:

1, వాహనాన్ని తన వద్దే ఉంచుకోవచ్చు

2. MGకి తిరిగి ఇచ్చి అస్యూర్డ్‌ రీసేల్‌ విలువ పొందవచ్చు

3. కొత్త MG మోడల్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వచ్చు

ఈ అస్యూర్డ్‌ బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకాల్లో ఉన్న MG Comet EV, MG Windsor EV, MG ZS EV కు వర్తిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, MG ZS EV కమర్షియల్‌ యూజర్లకూ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. అయితే, కమర్షియల్‌ యూజర్లకు ఇది 3 ఏళ్ల వరకు లేదా 60,000 కిలోమీటర్లు (ఏది ముందైతే అది) వరకే పరిమితం.

ఈ ప్రోగ్రామ్‌ను Lockton India Insurance Broking and Advisory Ltd, Zuno General Insurance భాగస్వామ్యంతో MG మోటార్‌ నిర్వహిస్తోంది. దీనివల్ల ప్రాసెస్‌ మరింత పారదర్శకంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ధరల విషయానికి వస్తే...

MG Windsor EV ధర ₹13.99 లక్షల నుంచి ₹18.39 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉంటుంది. ఇది Battery-as-a-Service (BaaS) మోడల్‌లో ₹9.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. బ్యాటరీ వినియోగానికి కిలోమీటర్‌కు ₹3.9 చార్జ్‌ ఉంటుంది.

MG Comet EV ధర ₹7.49 లక్షల నుంచి ₹9.99 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉంటుంది. BaaS ఆప్షన్‌లో ఇది కేవలం ₹4.99 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది. బ్యాటరీ రెంటల్‌ కిలోమీటర్‌కు ₹3.1.

MG ZS EV ధర ₹17.99 లక్షల నుంచి ₹20.49 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). BaaS వేరియంట్‌లో ఇది సుమారు ₹13 లక్షల దగ్గర మొదలవుతుంది. బ్యాటరీ రెంటల్‌ కిలోమీటర్‌కు ₹4.5.

మొత్తానికి, ఎలక్ట్రిక్‌ కారు కొనాలనుకునే తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ఇది నిజంగా ఒక మనశ్శాంతిని పెంచే విషయం. భవిష్యత్తులో రీసేల్‌ టెన్షన్‌ లేకుండా ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి MG తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget