Renault Duster రీ ఎంట్రీ ఈ నెలలోనే: ఈ కొత్త SUV మిడిల్ క్లాస్‌కు హైక్లాస్ లుక్ ఇవ్వగలదా?
January 2026లో కొత్త SUV కొనాలనుకుంటే Renault Duster ఒక మంచి ఆప్షన్ కావచ్చా? డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, అంచనా ధర, ప్రత్యర్థులపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Renault Duster 2026 Specifications: కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా, మీరు ఈ నెల (January 2026)లో కొత్త SUV కొనాలనుకుంటున్నారా? అయితే రాబోయే Renault Duster మీ షార్ట్‌లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన మోడల్. ఒకప్పుడు భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు పునాది వేసిన డస్టర్, ఇప్పుడు కొత్త తరం అవతార్‌లో (New Generation Renault Duster 2026) మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
Renault Duster ఎప్పుడు లాంచ్ అవుతుంది?
Renault అధికారికంగా ప్రకటించిన ప్రకారం, కొత్త తరం రెనాల్ట్ డస్టర్ భారత మార్కెట్‌లో జనవరి 26, 2026న లాంచ్ అవుతుంది. డస్టర్ పేరు భారతదేశానికి కొత్త కాదు. 2012లో లాంచ్ అయిన ఈ SUV, రఫ్ అండ్ టఫ్ బిల్డ్, మంచి రైడ్ క్వాలిటీతో చాలా పేరు సంపాదించింది. 2022లో అమ్మకాలు నిలిచిపోయినప్పటికీ, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో సక్సెస్ అయిన కొత్త జనరేషన్ మోడల్‌ను భారత్‌కు తీసుకొస్తోంది.
ఇండియా స్పెక్ డస్టర్ లుక్ ఎలా ఉంటుంది?
డిజైన్ పరంగా ఇండియా స్పెక్ రెనాల్ట్ డస్టర్, ఇంటర్నేషనల్ మోడల్‌ను చాలా వరకు పోలి ఉంటుంది. అయితే, మన మార్కెట్ కోసం కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. అధికారిక టీజర్‌లో కనిపించినట్లుగా కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్ ఇండియా వెర్షన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ SUVలో ఇవి కనిపిస్తాయి, నిజమైన SUV లుక్ ఇస్తాయి:
- బల్కీ, అప్రైట్ స్టాన్స్
- షార్ప్ షోల్డర్ లైన్
- చంకీ ఫ్రంట్ ఫేసియా
- అన్ని వైపులా LED లైటింగ్
- ముందు, వెనుక ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్
- బాడీ క్లాడింగ్
- గ్రిల్ మీద బోల్డ్ “RENAULT” లెటరింగ్
క్యాబిన్‌లో ఏమేం ఫీచర్లు ఉండొచ్చు?
కొత్త Duster క్యాబిన్ డిజైన్ ఫంక్షనల్‌గా, యుటిలిటేరియన్‌గా ఉంటుంది. ఫీచర్ల విషయంలో మోడ్రన్ టచ్ ఇస్తుంది. అంచనా ఫీచర్లు ఇవి:
- 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
- 7 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్
- కొన్ని వేరియంట్లలో ADAS సూట్ అవకాశం
ఫైనల్ ఫీచర్ లిస్ట్ మాత్రం లాంచ్ సమయంలో స్పష్టత వస్తుంది.
ఇంజిన్ ఆప్షన్స్ ఏవి ఉండొచ్చు?
భారత మార్కెట్ కోసం Renault ఇంకా ఇంజిన్ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న Duster ఈ ఇంజిన్ ఆప్షన్లు అందిస్తోంది:
- 1.0 లీటర్ LPG – 100 PS, 170 Nm
- 1.3 లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ – 130 PS, 230 Nm
- 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ – 145 PS, 205 Nm
ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్, e-CVT ఉన్నాయి. విదేశాల్లో కొన్ని వేరియంట్లకు AWD కూడా ఇస్తున్నారు. భారత్‌లో అయితే ముందుగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD)కే ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.
ధర ఎంత ఉండొచ్చు?
New Renault Duster ధర ₹10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
పోటీ కార్లు ఏవి?
ఈ సెగ్మెంట్‌లో ఇది Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Volkswagen Taigun, Skoda Kushaq, Honda Elevate తో గట్టిగా పోటీ పడాల్సి ఉంటుంది.
Renault Duster ఎందుకు కొనాలి?
- రఫ్ అండ్ టఫ్ SUV లుక్
- సౌకర్యవంతమైన డ్రైవ్
- మోడర్న్ ఫీచర్లు
- విశ్వసనీయ బ్రాండ్
ఇవి కావాలంటే, ఈ నెలలో రాబోయే Renault Duster ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. లాంచ్ అయ్యాక టెస్ట్ డ్రైవ్ చేసి, ఫైనల్ ధరలు చూసి నిర్ణయం తీసుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.




















