అన్వేషించండి

కొత్త ఇంజిన్, కొత్త గేర్‌బాక్స్‌తో వచ్చిన ఆల్‌-న్యూ పల్సర్ 150.. ట్రాఫిక్‌లో రైడ్ మరింత ఈజీ!

కొత్త బజాజ్ పల్సర్ 150 మార్కెట్లోకి వచ్చింది. అందుబాటులో ధరతో మూడు వేరియంట్లలో లభించే ఈ బైక్‌లో కొత్త ఇంజిన్, ఫ్రేమ్, గేర్‌బాక్స్ ఉన్నాయి.

2026 Bajaj Pulsar 150 Price And Features Telugu: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బజాజ్ పల్సర్ 150 కొత్త అవతార్‌లో మార్కెట్లోకి వచ్చింది. బజాజ్ ఈసారి బైక్‌లో చాలా మార్పులు చేసింది. ఇంజిన్, ఫ్రేమ్, గేర్‌బాక్స్, సస్పెన్షన్‌తో పాటు ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది. అయితే, పల్సర్‌కు గుర్తింపుగా ఉన్న ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్‌ను మాత్రం అలాగే కొనసాగించింది. కొత్త పల్సర్ 150 మూడు వేరియంట్లలో లభిస్తుంది, అవి - SD సింగిల్ సీట్, TD సింగిల్ సీట్ & TD స్ప్లిట్ సీట్.

ధర రూ.1.15 లక్షల నుంచి..

కొత్త పల్సర్ 150 బేస్ SD సింగిల్ సీట్ ధర రూ.1.15 లక్షలు. TD సింగిల్ సీట్ ధర రూ.1.18 లక్షలు. టాప్ TD స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ.1.23 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

కొత్త ఇంజిన్‌తో మరింత టార్క్

పల్సర్ 150లో 149.5cc సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. దీని గరిష్ట శక్తి 14hp. పాత మోడల్‌తో పోలిస్తే పవర్‌లో మార్పు లేదు. అయితే ఇప్పుడు గరిష్ట శక్తి 8,000rpm వద్దే వస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే 500rpm ముందుగానే ఈ పవర్‌ జనరేట్‌ అవుతుంది.

కొత్త పల్సర్‌లో టార్క్ పెరిగింది. కొత్త బైక్ 14.1Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ కంటే ఇది 0.9Nm ఎక్కువ. గరిష్ట టార్క్ 6,500rpm వద్ద లభిస్తుంది. తక్కువ వేగంతో బైక్ నడిపేటప్పుడు హ్యాండ్లింగ్‌ మరింత ఈజీగా ఉండేలా కొత్త గేర్‌బాక్స్‌ను కూడా అందించారు.

ఇది కూడా చదవండి: RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!

కొత్త ఫ్రేమ్, మోనోషాక్

కొత్త పల్సర్ 150లో డ్యూయల్ క్రేడిల్ ఫ్రేమ్ స్థానంలో సింగిల్ క్రేడిల్ ఫ్రేమ్‌ను తీసుకొచ్చారు. ఇంజిన్‌ను ఫ్రేమ్‌లో భాగంగా ఉపయోగించారు. దీంతో రైడ్ క్వాలిటీ & స్థిరత్వం మెరుగుపడతాయని బజాజ్ చెబుతోంది.

వెనుక భాగంలో మరో కీలక మార్పు జరిగింది. పాత మోడల్‌లో ఉన్న ట్విన్ షాక్ అబ్జార్బర్లకు బదులుగా కొత్త బైక్‌లో మోనోషాక్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. ముందు భాగంలో 33mm RSU టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంటుంది. ఇది 125mm ట్రావెల్‌ను అందిస్తుంది. వెనుక సస్పెన్షన్ ట్రావెల్ 110mmగా ఉంది.

బ్రేకింగ్ కోసం ముందు 260mm డిస్క్, వెనుక 230mm డిస్క్‌ను అందించారు. బేస్ వేరియంట్‌లో మాత్రం వెనుక 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. మూడు వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లను కూడా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?

ఫీచర్లకు పెద్దపీట

కొత్త పల్సర్ 150లో 5 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. TD సింగిల్ సీట్ & TD స్ప్లిట్ సీట్ వేరియంట్లలో 5 అంగుళాల TFT క్లస్టర్ బిగించారు. ఇందులో కాల్, SMS అలర్ట్‌లతో పాటు వాహన డాక్యుమెంట్లను సేవ్ చేసుకునే అవకాశం ఉంది.

టాప్ వేరియంట్‌లో WiFi సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా Google Mapsను ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై మిర్రర్ చేసుకోవచ్చు. మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు క్రాల్ మోడ్‌ను కూడా అందించారు. ట్రాఫిక్‌లో చాలా తక్కువ వేగంతో బైక్‌ నడిపేటప్పుడు క్రాల్ మోడ్ ఉపయోగపడుతుంది.

మూడు వేరియంట్లలోనూ USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. పాత USB Type-A పోర్ట్‌ను తొలగించారు.

టాప్ వేరియంట్లలో ISG

TD సింగిల్ సీట్ & TD స్ప్లిట్ సీట్ వేరియంట్లలో ISG ఇచ్చారు. దీనివల్ల, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. అవసరమైనప్పుడు ఇంజిన్ సైలెంట్‌గా స్టార్ట్ అవుతుంది.

లైటింగ్ విభాగంలోనూ స్వల్ప మార్పులు చేశారు. రెండు టాప్ వేరియంట్లలో పూర్తి LED లైటింగ్ స్టాండర్డ్‌గా ఉంటుంది. ఫెయిరింగ్‌ను కూడా రీడిజైన్ చేసి బైక్‌కు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చారు.

మొత్తంగా చూస్తే.. కొత్త బజాజ్ పల్సర్ 150లో డిజైన్‌ను పెద్దగా మార్చకుండానే ఇంజిన్, ఫ్రేమ్, గేర్‌బాక్స్, సస్పెన్షన్ & టెక్నాలజీ ఫీచర్లను గణనీయంగా అప్‌డేట్ చేశారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
Embed widget