MS Dhoni New Hummer H2 SUV Latest Updates: అదరగొడుతున్న ధోనీ కొత్త కారు డిజైన్. ఆర్మీ థీమ్ తో సూపర్బ్ అంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఆ మోడల్ ఎంటంటే..?
క్రికెట్ తో పాటు మోటార్ వెహికిల్స్ తో ధోనీకి విడదీయరాని అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అతని వద్ద కళ్లు చెదిరే కార్ల కలెక్షన్ తోపాటు ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి. తను వాడిన హామ్మర్ వైరలైంది.

Hummer H2 SUV Latest News: భారత క్రికెట్ జట్టు , చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన తాజాగా తన కారులో ప్రయాణిస్తున్న వీడియో హల్చల్ చేస్తోంది. "కెప్టెన్ కూల్"గా ప్రసిద్ధుడైన ధోని, 2007, 2011 వరల్డ్ కప్‌లతోపాటు 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలిపించి, 3 ఐసీసీ టోర్నీలను నెగ్గిన ఏకైక భారత కెప్టెన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రికెట్ తోపాటు అనేక బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ప్రసిద్ధి గాంచాడు. మోటార్ వెహికిల్స్ పై ప్రత్యేకమైన అభిమానం ఉన్న ధోనికి అనేక విలాసవంతమైన కార్లు మరియు బైక్‌లు కలవు. తాజాగా, ఆయన తన హమ్మర్ H2 SUVలో వెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కారుకు అతను తాజాగా వేసిన ఆర్మీ-ఇన్‌స్పైర్డ్ కామొఫ్లాజ్ రాప్ దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. తాజాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ, కామెంట్లు, షేర్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
You just look at how he modified his car; I don’t see any player who loves the Indian Army more than MS Dhoni.🇮🇳🪖 pic.twitter.com/31LzI0uPci
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 22, 2025
సూపర్బ్ థీమ్..
ఈ వీడియాలో హమ్మర్ వెనుక భాగం ముందుగా కనిపిస్తుంది, ఇందులో ఆర్మీ థీమ్‌తో కూడిన డీకల్స్ ఉన్నాయి. నంబర్ ప్లేట్ వెనుక స్పేర్ వీల్‌పై అమర్చబడింది. ఆపై వీడియోలో అనేక ఆసక్తికర వివరాలు ఉన్నాయి. తుపాకీ పట్టిన సైనికుడు, హెలికాప్టర్, మిలిటరీ కార్గో విమానం వంటి డిజైన్లు కారు మీద కనిపిస్తాయి. అలాగే, కొన్ని పారాచూట్లు కారు శరీరం పైపైన కనిపిస్తాయి, ఇవి ధోనికి భారత సైన్యం మీద ఉన్న గౌరవాన్ని సూచిస్తాయని అభిమానులు పేర్కొంటున్నారు.. ధోనికి భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ హోదా కూడా ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ధోని ఈ హమ్మర్ H2ను 2009లోనే కొనుగోలు చేశాడు, కానీ ఆర్మీ-ఇన్‌స్పైర్డ్ కవరింగ్ మాత్రం ఇటీవలి కాలంలో వేసినట్లు తెలుస్తోంది.
ప్రత్యేకతలు..
హమ్మర్ H2కు రెండు ఇంజిన్ ఆప్షన్లు వచ్చాయి.. ఒకటి 3.7 లీటర్ల ఇన్‌లైన్-ఫైవ్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి అధికంగా వాడబడుతున్న 5.3 లీటర్ల V8 ఇంజిన్ కావడం విశేషం. 5.3 లీటర్ల ఇంజిన్ 300 హార్స్‌పవర్ , 430Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, కాగా 3.7 లీటర్ల వేరియంట్ 242 హార్స్‌పవర్ , 328Nm టార్క్ అందిస్తుంది. హమ్మర్ H2తో పాటు, ధోనికి జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ 4W73 వంటి ఇతర ప్రత్యేక కార్లు కూడా ఉన్నాయి. అలాగే ఆయనకు అనేక బైక్‌లు కూడా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని తన గ్యారేజ్‌లో సుమారు 100 బైకులు ఉన్నాయని వెల్లడించారు. అయితే, అందులో అన్ని బైక్‌లు పనిచేసే స్థితిలో లేవని కూడా తెలిపారు. ఏదేమైనా ధోనీ కలెక్షన్ సూపర్ అనడంతోపాటు ఆర్మీపై అతనికి ఉన్న భక్తికి అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సోషల్ మీడియాలో కనిపించిన ఈ మోడల్ హామ్మర్ తెగ వైరలైంది. నెటిజన్లు దానికి సంబంధించిన వివరాలను వెతుకుతున్నారు.






















