Hyundai Creta Alternatives: హ్యుందాయ్ క్రెటా బదులుగా కొనదగిన 5 కొత్త మిడ్-సైజ్ SUVలు - త్వరలోనే లాంచ్
Upcoming Mid-size SUVs: త్వరలో రాబోయే 5 మిడ్-సైజ్ SUVలు హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడతాయి. అంటే, ధర & ఫీచర్లలో క్రెటా రేంజ్‌లో ఉండే కొత్త కార్లు ఇవి. వీటిని త్వరలో లాంచ్ చేయనున్నారు.

Hyundai Creta Competitive Mid-size SUVs: హ్యుందాయ్ క్రెటా, భారత మార్కెట్లో చాలా కాలంగా బలమైన పట్టు & ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు, ఆ ఆధిపత్యానికి గండి కొట్టడానికి 5 ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్, రెనాల్ట్, నిస్సాన్ & కియా వంటి కంపెనీలు హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడటానికి కొత్త SUV మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కొత్తగాఈరాబోయే మోడళ్లలో, వినియోగదారులు కొత్త డిజైన్, శక్తిమంతమైన ఇంజిన్ & అధునిక ఫీచర్లను పొందుతారు.
క్రెటాకు పోటీ ఇచ్చే 5 మిడ్-సైజ్ SUVలు
మారుతి సుజుకి ఎస్కుడో (Maruti Suzuki Escudo 2025)
మారుతి సుజుకి, తన కొత్త SUV ఎస్కుడోను భారతదేశంలో విడుదల చేయబోతోంది. దీనికి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో బలమైన హైబ్రిడ్ & CNG ఎంపిక లభిస్తుందని భావిస్తున్నారు. పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఫీచర్లు & ADAS టెక్నాలజీతో కూడిన ఈ SUV 2025 చివరి నాటికి లాంచ్ కావచ్చు.
టాటా సియెర్రా (2025 Tata Sierra)
టాటా మోటార్స్, తన ఐకానిక్ సియెర్రాను మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ మిడ్-సైజ్ SUV పెట్రోల్, డీజిల్ & ఎలక్ట్రిక్ వెర్షన్లలో వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ ఫీచర్లు & బలమైన భద్రతా ప్యాకేజీతో ఇది వస్తుంది. దీనిని కూడా 2025 చివరి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.
రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్ (Renault Duster Facelift 2025)
రెనాల్ట్, తన పాపులర్ SUV డస్టర్‌ను పూర్తిగా కొత్త అవతారంలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్‌లో ఆధునిక డిజైన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ ఉండవచ్చు. దీని లాంచ్ 2025 చివరి నెలల్లో జరిగే అవకాశం ఉంది.
నిస్సాన్ కొత్త ఎస్‌యూవీ (Nissan New SUV 2026)
నిస్సాన్, రాబోయే రెనాల్ట్ డస్టర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా తన కొత్త SUVని విడుదల చేయబోతోంది. డిజైన్ & బ్యాడ్జ్‌లలో తేడా ఉన్నప్పటికీ, ఫీచర్లు ఎక్కువగా డస్టర్‌ను పోలి ఉంటాయి, కానీ దీనికి ప్రత్యేకమైన ఇంటీరియర్ కలర్ & ప్రత్యేక టెక్నాలజీ ప్యాకేజీ ఇవ్వవచ్చు. ఈ SUV 2026 ప్రారంభంలో విడుదల కానుంది.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift 2026)
కియా ఇండియా, తన బెస్ట్ సెల్లింగ్ SUV సెల్టోస్‌లో కొత్త తరం మోడల్‌ను 2026 ప్రారంభంలో విడుదల చేయాలని యోచిస్తోంది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ADAS, హైబ్రిడ్ వెర్షన్ & మరింత ప్రీమియం క్యాబిన్ వంటివి ఈ కారులో ఉండవచ్చు. లాంచ్ తర్వాత, ఇది హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యక్ష పోటీదారుగా మారుతుంది.





















