అన్వేషించండి

MG Windsor EV: ఎట్టకేలకు ఎంజీ విండ్సర్‌ విడుదల- 331 కి.మీ రేంజ్‌, పూర్తి ఫీచర్లు, ధర వివరాలివీ

ఎంజీ విండ్సర్‌ భారత్‌లో విడుదల అయ్యింది. దీనిని రూ. 9.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ప్రారంభ ధరతో ఈ కారుని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈ కారులోని బ్యాటరీ కోసం అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

MG Windsor EV Launched: ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్‌ కారు నేడు అధికారికంగా లాంచ్ అయ్యింది. ఎంజీ మోటార్స్‌ నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉన్న జెడ్ఎస్, ఎంజీ కామెట్ ఈవీ తర్వాత భారత్‌లో అడుగుపెడుతున్న 3 వ ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం. ఈ విండ్సర్‌ని ప్రస్తుతం కంపెనీ చైనాలో విక్రయిస్తున్న రీబ్యాడ్జ్డ్ వులింగ్ క్లౌడ్ ఈవీ (Wuling Cloud EV) ఆధారంగా  రూపొందించారు. భారత్‌లో దీనిని జిందాల్ స్టీల్ వర్క్స్ (JSW)తో కలిసి ఎంజీ మోటార్ లాంచ్ చేసింది. ఎంజీ మోటార్స్‌ దీనిని సీయూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్)గా పిలుస్తుంది. ఈ కొత్త విండ్సర్‌ ఈవీ కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీలకు మధ్య ధరలో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కారు లాంచ్‌తో భారతీయ మార్కెట్‌లో తన మార్కెట్‌ని మరింత విస్తరించుకోవాలని ఎంజీ మోటార్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఈ కారు లాంచ్‌ ఇతర ప్రత్యేకతలపై ఆ కంపెనీ భారీ ఏర్పాట్లను చేసింది.

ఈ సీయూవీని రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ కారు బ్యాటరీని సపరేట్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని బ్యాటరీని రెంటల్ మాడ్యూల్‌లో కిలోమీటరుకు రూ.3.50లు చెల్లించాలి. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)లో భాగంగా మార్కెట్‌లో అడుగుపెట్టిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు టూవీలర్స్‌లో మాత్రమే ఈ ఆప్షన్‌ ఉంది. కావున బ్యాటరీ కోసం కస్టమర్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

అంతే కాకుండా కారుని బై బ్యాక్‌ పాలసీలో 3 సంవత్సరాల తర్వాత మళ్లీ కంపెనీకి అప్పగిస్తే మీరు 60 శాతం సొమ్ముని తిరిగి పొందవచ్చు. ఈ సరికొత్త విండ్సర్ ఈవీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్స్‌ 25 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 12 నుంచి ఈ కార్లను కస్టమర్లకు సంస్థ డెలివరీలు చేయనుంది. ఈ ఎంజీ విండ్సర్ సీయూవీ వెర్షన్‌ కావడంతో ఇది సెడాన్‌, ఎస్‌యూవీలకు మధ్య రకమైన డిజైన్‌లో ఉంటుంది. అందువల్ల దీని ఎక్స్‌టీరియర్‌ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. డైమెన్షన్స్‌ పరంగా ఈ విండ్సర్ ఈవీ జెడ్ఎస్ ఈవీ కంటే చిన్నగా ఉంటుంది. ఇంది 4,295 మిమీ పొడవు, 1,677 మిమీ ఎత్తు , 1,850 మిమీ వెడల్పు, 2,700 మిమీ వీల్‌బేస్‌తో వస్తుంది.

ఈ విండ్సర్ 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, LED DRLsని కలిగి ఉంటుంది.  ఫ్రంట్ ఛార్జింగ్ ఇన్‌లెట్, LED టెయిల్ లైట్ యూనిట్స్‌ని కూడా గమనించవచ్చు. ఈ కారు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌తో వస్తుంది. అంతర్జాతీయ విమానాల మాదిరింగా ఫస్ట్ క్లాస్‌ సీటింగ్ పోలి ఉంటుంది. వెనక సీట్లు 135 డిగ్రీల వరకు సర్దుబాటు చేయవచ్చు. దీని పై భాగంలో పనోరమిక్ సన్‌రూఫ్, కారు లోపల ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

ఫీచర్లు

దీనిలోని 8.8 ఇంచెస్‌ డ్రైవర్ డిస్ప్లే, 15.6 అంగుళాల బిగ్‌ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, 6 ఎయిర్ బ్యాగ్స్‌,  360 డిగ్రీల కెమెరా, పీఎం2.5 ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్, తదితర ఫీచర్లు ఉన్నాయి. విండ్సర్ ఈవీలో 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు కలవు. ఇంది 600 లీటర్లు బూట్‌ స్పేస్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిలో భారీగా లగేజీని తీసుకుళ్లవచ్చు. 

రేంజ్‌
ఈ కారు 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌లో 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందింస్తుంది. ఇందులోని సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 134 bhp, 200 nm టార్క్‌ని విడుదల చేస్తుంది.ఇక ఫైనల్‌గా ఈ విండ్సర్ ఈవీ టాటా కర్వ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వంటి ఎలక్ట్రిక్‌ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Andhra liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్MS Dhoni Heroics vs LSG | IPL 2025 లో లక్నోపై విరుచుకుపడిన మహేంద్ర సింగ్ ధోనీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Andhra liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
Ravi Teja - Chakri: చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?
చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Sunstroke: వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
Telangana News: 2030 నాటికి హైదరాబాద్‌లో 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్- మంత్రి శ్రీధర్ బాబు
2030 నాటికి హైదరాబాద్‌లో 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్- మంత్రి శ్రీధర్ బాబు
Embed widget