MG Motors: ఎంజీ మోటర్స్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీ - అగ్రెసివ్ లుక్స్, ఫీచర్స్‌తో వాటికి గట్టి పోటీ!
Automobile Latest news: ఎంజీ మోటర్స్ ఈ హెచ్ఎస్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెడితే.. ఇది ఆ శ్రేణిలోని హ్యుండయ్ టక్సన్, ష్కోడా కొడియాక్‌కు గట్టి పోటీగా నిలవనుంది.
MG HS premium SUV: షాంఘైకు చెందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన వాహన శ్రేణిలో ఓ కొత్త ఎస్‌యూవీని ప్రవేశపెడుతోంది. చైనా ప్రభుత్వ యాజమాన్యంతో నడుస్తున్న ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులర్ అయిన మోడల్స్ ఉన్నాయి. తాజాగా హైబ్రిడ్ మోడల్‌లో ఓ కొత్త ఎస్‌యూవీని ఎంజీ మోటర్స్ లాంఛ్ చేసింది. ఇదొక ప్రీమియం 5 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీ అని కంపెనీ చెబుతోంది. ఎంజీ హెచ్ఎస్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంపీ లాంఛ్ చేయగా.. భారత్‌లో కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ భారత్‌లోకి ఈ హెచ్ఎస్ మోడల్‌ని ప్రవేశపెడితే ఇది ఎంజీ గ్లాస్టర్ కన్నా కింది శ్రేణిలో ఉంటుందని అంటున్నారు.
ఈ ఎంజీ హెచ్ఎస్ మోడల్ ఇతర బ్రాండ్స్‌లోని 5 సీటర్ ఎస్‌యూవీలు అన్నింటికీ పోటీ ఇవ్వనుంది. ప్రధానంగా హ్యుండయ్ టక్సన్, ష్కోడా కొడియాక్ లాంటి వాటకి గట్టి పోటీగా నిలవనుంది. హెచ్‌ఎస్ మిగతా ఎస్‌యూవీలతో పోల్చితే పరిమాణం కాస్త పెద్దదే. ప్రస్తుతానికి హెచ్ఎస్‌ను యూకేలో విడుదల చేశారు. చూసేందుకు మాత్రం లార్జ్ ఎస్‌యూవీగా కనిపిస్తోంది. దీనికి లార్జ్ టూ పార్ట్ గ్రిల్ రూఫ్ లైన్ తో పాటు షార్ప్ హెడ్ ల్యాంప్స్‌తో ఒక అగ్రెసివ్ లుక్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్ కూడా మెరుగైన ఫీచర్లను జోడించారు.
12.3 అంగుళాల ట్విన్ స్క్రీన్స్‌తో పాటు 360 డిగ్రీస్ కెమెరా లాంటి ఫీచర్లను అందించారు. ఇంకా అత్యధిక బూట్ స్పే్స్ కూడా దీని సొంతం. ఇక డ్యుయల్ జోన్ ఎయిర్ కండిషన్, ADAS, హీటెడ్ ఫ్రెంట్ సీట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. 300 బీహెచ్‌పీ లార్జ్ ఎలక్ట్రిక్ మోటర్ ఉంది. ఎంజీ వద్ద ఉన్న అన్ని ఎస్‌యూవీ శ్రేణుల్లోకెల్లా ఇది చాలా పవర్ ఫుల్. ఒక్క ఈవీ ఫీచర్‌తోనే దాదాపు 120 కిలో మీటర్ల రేంజ్ ఉంటుందని అంటున్నారు.
ఇక ట్రాన్స్‌మిషన్ విషయంలో బేస్ టర్బో పెట్రోల్ వేరియంట్ లో 6 స్పీడ్ మ్యాన్యువల్ ప్లస్ 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఎంజీ హెచ్‌ఎస్ అనేది హైబ్రిడ్ విభాగంలో ప్రీమియం ఎస్‌యూవీగా కంపెనీ చెబుతోంది. మరో ప్రీమియం ఎస్‌యూవీ జడ్ఎస్ ఉన్నప్పటికీ 5 సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇది కూడా గ్లాస్టర్ కింది స్థానంలోనే ఉంది.
ప్రస్తుతానికి, ఎంజీ భారత్‌లో CUVని లాంచ్ చేస్తుంది. అయితే ఇది ఇటీవల సైబర్‌స్టర్ టూ-డోర్ స్పోర్ట్స్ కారును చూపింది. ఎంజీ హైబ్రిడ్‌లను లాంచ్ చేస్తూనే ఈవీలపై దృష్టి సారిస్తుందని.. ఇంకా భవిష్యత్తులో అనేక ఉత్పత్తులను విడుదల చేస్తామని సంస్ ఓ ప్రకటనలో తెలిపింది.