By: ABP Desam | Updated at : 20 Apr 2023 07:01 PM (IST)
MG Comet EV (ABP Live)
MG మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగంలో మరో కారును ఆవిష్కరించింది. MG కామెట్ EV పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా MG మోటార్ ఇండియా కామెట్ EVని లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే MG మోటార్ ఇండియా భారత్ లో ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. MG ZS EV పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా రెండో మోడల్ కారును వినియోగదారుల ముందుకు తెచ్చింది.
Calling all gamers! 🎮👀 #MGMotorIndia & #Mortal a.k.a. @Mortal04907880 are collaborating to redefine your driving experience with the gamer edition of #CometEV.
— Morris Garages India (@MGMotorIn) April 10, 2023
Elevate your adventures with cutting-edge technology, futuristic design & unbeatable performance. Stay tuned!🤘 pic.twitter.com/yxV81BHr6M
MG కామెట్ EV ధర
భారతదేశంలో MG కామెట్ EV ధర రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని MG పదే పదే చెబుతోంది.
MG కామెట్ EV రేంజ్
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు SAIC-GM-వులింగ్ గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇటీవల లీక్ నివేదికల ప్రకారం, MG కామెట్ EV ఒక్క ఫుల్ ఛార్జింగ్‌తో 230 కిలో మీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 7 గంటల వ్యవధిలో 0-100% ఛార్జింగ్ అవుతుంది. 3.3kW ఛార్జర్‌ని ఉపయోగించి 10-80% ఛార్జింగ్ ను కేవలం 5 గంటల్లో నింపే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం (EV) 42PS/110Nm ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది.
MG కామెట్ EV కొలతలు
MG కామెట్ EV కాంపాక్ట్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. రెండు-డోర్ల లే అవుట్, నలుగురు ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. మూడు-డోర్ల కామెట్ EV పొడవు 2,974mm, ఎత్తు 1,631mm, వెడల్పు 1,505mm ఉంటుంది. ఇది 2,010mm వీల్ బేస్ కలిగి ఉంటుంది.
MG కామెట్ EV ఫీచర్లు
ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కామెట్ EV LED హెడ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దాదాపు ఫ్లాట్ వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్ లు ఉంటాయి. క్యాబిన్ లోపల, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.
MG కామెట్ EV ఏ కార్లకు పోటీగా ఉంటుందంటే?
సరికొత్త MG కామెట్ EV కారు భారత మార్కెట్‌లో టాటా టియాగో EV, టిగోర్ EV, అలాగే సిట్రోయెన్ eC3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. ధర రేంజిని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
Read Also: టాటా ఆల్ట్రోజ్ CNG బుకింగ్స్ షురూ, అదిరిపోయే మైలేజ్, సూపర్ డూపర్ ఫీచర్లు, వచ్చే నెలలో డెలివరీ!
Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!
Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!