అన్వేషించండి

రూ.11,000 EMIకే MG Comet EV – బెస్ట్‌ డీల్‌ ఉన్నప్పుడు పెట్రోల్ కోసం డబ్బు వృథా చేయడం ఎందుకు?

MG Comet EV On EMI: ఎంజీ కామెట్ EV ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 7.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తానికి కార్‌ లోన్‌ వస్తుంది.

MG Comet EV Price, Down Payment, Loan and EMI Details: ఎంజీ కామెట్‌ EV బయటి భాగం బొమ్మలాగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డిజైనే దీనికి ప్లస్‌ పాయింట్‌, ఈ కాంపాక్ట్‌ డిజైన్‌ నగరాలలో నడిపేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. స్లీక్‌ హెడ్‌ల్యాంప్స్‌, గ్లాస్‌ స్ట్రిప్‌ ముందు భాగానికి ఫ్యూచరిస్టిక్‌ లుక్స్‌ ఇస్తాయి. షార్ప్‌ బాడీ లైన్స్‌ & మినిమలిస్ట్‌ స్టైల్‌ ఈ వాహనాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి. మన దేశంలో అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV, ఇప్పుడు గతంలో కంటే సురక్షితంగా మారింది & మరిన్ని ఎక్కువ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర ఉన్న MG Comet EV, తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్‌ కారు కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. మీ నెలవారీ జీతం రూ. 30,000 వరకు ఉన్నప్పటికీ, మీరు EMI ఆప్షన్‌లో MG కామెట్ EVని సులభంగా కొనుగోలు చేయవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో MG కామెట్ EV ఆన్‌-రోడ్‌ ధర ఎంత? 
హైదరాబాద్‌ & విజయవాడలో, కొత్త MG కామెట్ EV ఆన్-రోడ్ ధర (MG Comet EV on-road price, Hyderabad) దాదాపు 7.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. మీరు, షోరూమ్‌లో రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మీరు రూ. 6.90 లక్షల కార్‌ లోన్‌ తీసుకోవలసి ఉంటుంది. ఈ రుణంపై, బ్యాంక్‌ వడ్డీ రేటు సంవత్సరానికి 9% అనుకుందాం. ఇప్పుడు, EMI ఆప్షన్స్‌ చూద్దాం.

7 సంవత్సరాల్లో కార్‌ లోన్‌ పూర్తి చేయాలంటే, నెలకు రూ. 11,095 EMI చెల్లించాలి. ఈ 84 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 2,42,322 అవుతుంది.

6 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 12,431 EMI చెల్లించాలి. ఈ 72 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 2,05,374 అవుతుంది.

5 సంవత్సరాల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, నెలకు రూ. 14,316 EMI చెల్లించాలి. ఈ 60 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,69,302 అవుతుంది.

4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకోవాలనుకుంటే, నెలకు రూ. 17,162 EMI చెల్లించాలి. ఈ 48 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,34,118 అవుతుంది.

ఈ లెక్క ప్రకారం... మీరు నెలకు రూ. 11,095 చొప్పున చెల్లిస్తే 7 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ అవుతుంది. లేదా, నెలకు రూ. 12,431 చొప్పున కట్టుకుంటూ వెళ్లినా ఆరేళ్లలో రుణం తీరిపోతుంది. ఐదేళ్లలోనే లోన్‌ క్లోజ్‌ చేయాలనుకుంటే, నెలకు 14,316 EMI చెల్లించాలి. 

బ్యాంక్‌ ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యంక్ విధానంపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేయగలిగితే మీకు అంత మంచిది.

MG కామెట్ EV ఫీచర్లు & పనితీరు
MG కామెట్ EV ఫీచర్లు & పనితీరు పరంగా కూడా చాలా బాగుంది. ఇది ఒక కాంపాక్ట్ 4-సీటర్‌ ఎలక్ట్రిక్ కారు. ప్రత్యేకంగా నగరాల్లో డ్రైవింగ్ కోసం డిజైన్‌ చేశారు. ఈ ఎలక్ట్రిక్‌ కారులో 17.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ. వరకు నడుస్తుంది. ఈ కారు AC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

భద్రత & సాంకేతికత
ప్రయాణీకుల భద్రత కోసం MG కామెట్ EV లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. వెనుక పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇందులో పవర్-ఫోల్డింగ్ ORVMలు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ & డిస్క్ బ్రేక్‌లతో ABS + EBD వంటి లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి దీన్ని మరింత సురక్షితమైన కారుగా మార్చాయి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget