(Source: ECI/ABP News/ABP Majha)
Mercedes : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు ఏకధాటిగా కొట్టేయొచ్చు- మెర్సిడెస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్.
Mercedes Maybach EQS 680 Electric SUV Launch మెర్సిడెస్ మేబాక్ ఈక్యూఎస్ 680 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆ సంస్థ విడుదల చేసింది. దీనిని రూ. 2.25 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.
Mercedes Maybach EQS 680 Electric SUV Launch: మెర్సిడెస్ మేబాక్ EQS 680 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్‌లో విడుదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ లగ్జరీ కారు ఇప్పుడు దేశంలో అందుబాటులోకి వచ్చిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ SUVగా నిలించింది. ఇది ఒకే ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది దాని (ICE) వెర్షన్‌లతో సమానంగా ఫీచర్లు, డిజైన్‌లను పోలి ఉంటుంది.
లగ్జరీ ఫీచర్లు & డిజైన్
ఈ హై-ఎండ్ ఎలక్ట్రిక్ SUV మంచి లగ్జరీయస్ ఫీచర్లను కోరుకునే సంపన్నుల కోసం రూపొందించారు. మెర్సిడెస్ మేబాక్ EQS 680లోని డిజైన్‌లోని మెయిన్ గ్రిల్, కనెక్ట్ చేసిన LED హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్స్ కొత్తగా ఉంటాయి. ఇంటీరియర్‌లో ఇది 15-స్పీకర్ 4D సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, నాప్పా లెదర్ సీట్లు, వెనుక కూర్చునే వారి కోసం ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్‌ని కలిగి ఉంటుంది. ఇది వారికి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించనుంది. ఇందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్ కూడా ఉంది. ఇక ఈ లగ్జరీ కారులోని రెండు వెనుక సీట్ల మధ్య ఆర్మ్‌రెస్ట్ వెనుక రిఫ్రిజిరేటర్ కంపార్ట్‌మెంట్‌ను కూడా కలిగి ఉంది. ఈ కంపార్ట్మెంట్ 10-లీటర్ సామర్థ్యంతో టెంపరేచర్ కంట్రోలర్ ఆప్షన్‌ని కలిగి ఉంది.
డైమెన్షన్స్ & సేఫ్టీ
మెర్సిడెస్ మేబాక్ EQS 680 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 1,721 mm ఎత్తు, 5,125 mm పొడవు, 3,210 mm వీల్‌బేస్‌తో వస్తుంది. ఇక సేఫ్టీ పరంగా ఇందులో 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కలవు. అదనపు లగ్జరీయస్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో కూడిన అరోమా డిఫ్యూజర్ సిస్టమ్, రెండు బ్యాక్ డోర్స్ కూడా ఎలక్ట్రిక్ సన్ బ్లైండ్స్‌ని కలిగి ఉంటుంది.
Also Read: సింగిల్ ఛార్జ్‌తో 900 కిలోమీటర్లు - సూపర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న హ్యుందాయ్!
ఫర్ఫామెన్స్
ఈ లగ్జరీ కారుని మొదటగా షాంఘై ఆటో షోలో ప్రదర్శించారు. అప్పుడే ఈ మెర్సిడెస్ మేబాక్ EQS 680 పవర్‌ట్రెయిన్‌ని కంపెనీ వెల్లడించింది. ఈ లగ్జరీ కారు ఆల్-వీల్-డ్రైవ్ సెటప్‌ని కలిగి ఉండటంతో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేసిన 107.8kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 649bhp పవర్‌ని, 950nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం కేవలం నాలుగు సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.
ఈ కొత్త మోడల్ ఎకో, స్పోర్ట్, ఆఫ్-రోడ్, ఇండివిజువల్ వంటి వివిధ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులోని భారీ సస్పెన్షన్ సెటప్ స్మూత్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. దీంతో మీరు ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని రోడ్డు ప్రయాణంలో పొందుతారు.
Also Read: 8 లక్షలకే హ్యుందాయ్ సీఎన్జీ వెహికల్- కారు కొనాలనే ఆలోచన ఉన్నవాళ్లకు కావాల్సింది ఇదే కదా!
ధర
ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 2.25 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ప్రకటించింది. భారీ ధర వద్ద విడుదల కావడంతో ఇది హై-ఎండ్ ఫీచర్లు, అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. ఇవి కారుకి అదనపు ఆకర్షణగా ఉంటాయి.