Maruti Victoris 2025: లగ్జరీ ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్, 5-స్టార్ సేఫ్టీ - యూత్ కోసం స్టైల్, కుటుంబం కోసం భద్రత!
Maruti Victoris Features:స్టైలిష్ కాంపాక్ట్ SUV, హైబ్రిడ్ & CNG ఇంజిన్‌లు ఆప్షన్లు, 5-స్టార్ BNCAP సేఫ్టీ, Level-2 ADAS, లగ్జరీ ఫీచర్లున్న కారు ఇది. బుకింగ్స్ Arena షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి.

Maruti Victoris Price, Mileage And Features In Telugu: ఇండియన్ ఆటో మార్కెట్‌లో ఇప్పుడు మారుతి విక్టోరిస్ ఒక హాట్ టాపిక్ అయింది. గ్రాండ్ విటారా తర్వాత మారుతి సుజుకి తీసుకొచ్చిన రెండో కాంపాక్ట్ SUV ఇది. Arena షోరూమ్‌ల ద్వారా మాత్రమే ఈ కార్లను అమ్ముతున్నారు. Maruti Victoris కోసం హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు నగరాల్లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
డిజైన్ & ఇంటీరియర్స్
Victoris డిజైన్, చూసిన మొదటి క్షణంలోనే SUV కేటగిరీలో కొత్తదనాన్ని చూపిస్తుంది. బోల్డ్ గ్రిల్, షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ DRLs ఈ ఫోర్‌వీలర్‌కు అగ్రెసివ్ లుక్ ఇస్తాయి. ఇంటీరియర్‌లోకి చూస్తే, లగ్జరీ SUV అనిపించేలా ప్రీమియం మెటీరియల్స్, 64-కలర్ ఆంబియంట్ లైటింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ SmartPlay Pro ఇన్ఫోటైన్‌మెంట్, Dolby Atmos సౌండ్ సిస్టమ్‌తో కంఫర్ట్ & క్లాస్ రెండూ కలిసి కనిపిస్తాయి.
పవర్‌ట్రెయిన్ & మైలేజ్
Maruti Victoris ను పెట్రోల్, CNG, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్స్‌తో అందిస్తున్నారు.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ - స్మూత్ డ్రైవింగ్ అనుభవం.
S-CNG (ట్విన్ ట్యాంక్) - మోర్ మైలేజ్, బూట్ స్పేస్‌లో తగ్గింపు లేకుండా.
స్ట్రాంగ్ హైబ్రిడ్ - శక్తిమంతమైన పనితీరు, అద్భుత ఫ్యూయల్ ఎఫీషియెన్సీ.
మారుతి అంటేనే మైలేజ్. Victoris కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తోంది.
సేఫ్టీ - 5 స్టార్ రేటింగ్
Victoris, Bharat NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇదే కాకుండా, మారుతి నుంచి మొట్టమొదటిసారి Level-2 ADAS (Advanced Driver Assistance System) టెక్నాలజీ వచ్చింది. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. అంటే, Victoris లో ప్రయాణం స్టైలిష్ మాత్రమే కాదు, భద్రత కూడా ఫుల్.
బుకింగ్ & ధర వివరాలు
Victoris బుకింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా Arena షోరూమ్‌లలో, అలాగే ఆన్‌లైన్‌లో కూడా ప్రారంభమైంది. టోకెన్ అమౌంట్ కేవలం రూ.11,000. ధరలను ఇకాం అధికారికంగా ప్రకటించకపోయినా, ఎక్స్-షోరూమ్ ధర ₹9.75 లక్షల నుంచి ₹20 లక్షల మధ్య ఉండొచ్చని ఆటో రంగం అంచనా వేస్తోంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో లోకల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల ఆధారంగా ఫైనల్ ధరలో మార్పులు ఉండొచ్చు.
వేరియంట్లు & కలర్స్
Victoris ని వేరే వేరే ట్రిమ్స్‌లో అందిస్తున్నారు. బేస్ వేరియంట్‌లో కూడా ఫీల్-గుడ్ ఫీచర్లు ఇవ్వడం మారుతి ప్రత్యేకత. టాప్ వేరియంట్‌లో Level-2 ADAS, లగ్జరీ టచ్‌లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి వస్తాయి. కలర్స్ కూడా విభిన్నంగా లభిస్తాయి, కొన్ని కలర్స్ స్పెసిఫిక్ వేరియంట్లలో మాత్రమే లభించవచ్చు.
స్టైలిష్ లుక్, లగ్జరీ ఫీచర్లు, శక్తిమంతమైన హైబ్రిడ్, సురక్షితమైన డ్రైవ్ & నమ్మకమైన మైలేజ్ అన్నీ ఒకే ప్యాకేజ్‌లో అందిస్తోంది మారుతి విక్టోరిస్. మీరు కొత్త SUV కోసం వెతుకుతుంటే, Victoris ఖచ్చితంగా మీ షార్ట్‌లిస్ట్‌లో ఉండాల్సిందే.





















