అన్వేషించండి

KTM, Triumph, Bajaj, Harley, Aprilia - సబ్‌-650cc బైకులపై GST భారం, యూత్‌కు పెద్ద షాక్‌!

Sub 650cc bikes GST: కొత్త GST రేట్లతో 350cc దాటిన బైకులకు 40% పన్ను షాక్‌ తగిలింది. Royal Enfield 450/650 సహా KTM, Triumph, Bajaj, Harley-Davidson, Aprilia మోడళ్ల ధరలు 10-12% పెరగనున్నాయి.

New GST Rates Impact On Bikes: భారతీయ బైక్ మార్కెట్‌కి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్‌!. ఫైనాన్స్ మినిస్ట్రీ తాజాగా ప్రకటించిన కొత్త GST రేట్లతో, టూ వీలర్ ప్రేమికులకు ఒకవైపు రిలీఫ్ - మరోవైపు పెద్ద షాక్ దక్కింది.

350cc లోపల లాభం

ఇప్పటివరకు 28% GST పరిధిలో ఉన్న 350cc లేదా అంతకన్నా తక్కువ ఇంజిన్ బైక్‌లు, ఇకపై కేవలం 18% GST మాత్రమే చెల్లించాలి. అంటే Hero, Honda, TVS, Bajaj లాంటి పాపులర్ మోడళ్ల ధరలు కాస్త తగ్గుతాయి. చిన్న బైక్‌లు, స్కూటర్లకు ఇది సూపర్ న్యూస్‌.

350cc పైన - 650cc లోపు బైకులపై ఆర్థిక భారం

కానీ, 350cc దాటిన బైక్‌ కొనేవాళ్లకు అసలు షాక్‌ తగులుతుంది. ఇప్పటి వరకు 31% (28% GST + 3% సెస్‌) పన్ను ఉన్న 350cc పైబడిన బైక్‌లు ఇకపై నేరుగా 40% GST చెల్లించాలి. అంటే ధరలు భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా యువతకు ఇష్టమైన Royal Enfield మోడళ్లు - 450cc Himalayan, 650cc Interceptor, Continental GT వంటివన్నీ సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లతో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.

ఏ బ్రాండ్లు ప్రభావితమవుతాయి?

Royal Enfield మాత్రమే కాదు. KTM, Triumph, Bajaj, Harley-Davidson, Aprilia లాంటి బ్రాండ్లు కూడా ఇండియాలో సబ్‌-650cc బైకులు తయారు చేస్తున్నాయి. ఇవన్నీ మధ్య తరగతి రైడర్లు భరించగలిగే రేట్లలో ప్రీమియం బైకులను అందిస్తున్నాయి. ఇకపై, ఆ బైకుల ధరలు 10-12% పెరుగుతాయి. ఎందుకంటే GST పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి.

CBU & CKD దిగుమతుల పరిస్థితి

దిగుమతి బైకులు కొనేవారికి ఇంకో పెద్ద షాక్‌. CBU (Completely Built Units), CKD (Completely Knocked Down) రూపంలో వచ్చే Ducati, Kawasaki, Triumph, Harley-Davidson, Aprilia కంపెనీల హై-ఎండ్ మోడళ్లు మరింత ఖరీదవుతాయి. ఈ పెరుగుదల ల‌క్షల్లో ఉండవచ్చు.

అధిక పన్ను వేడిని తట్టుకునే 500cc కంటే తక్కువ బైక్‌ల లిస్ట్‌ ఇది:

బైక్‌ తయారీ కంపెనీ మోడల్‌ పేరు

Royal Enfield

Himalayan 450

Royal Enfield

Guerrilla 450

Royal Enfield

Interceptor 650

Royal Enfield

Classic 650

Royal Enfield

Continental GT 650

Royal Enfield

Shotgun 650

Royal Enfield

Bear 650

KTM

390 Adventure/X

KTM

390 Enduro/R

KTM

390 Duke

KTM

RC 390

Triumph

Thruxton 400

Triumph

Speed 400

Triumph

Speed T4

Triumph

Scrambler 400 X/XC

Bajaj

Pulsar NS400Z

Bajaj

Dominar 400

Aprilia

RS 457

Aprilia

Tuono 457

Harley-Davidson

X440

Husqvarna

Svartpilen 401

BSA

Gold Star 650

యువత ఏం చేయాలి?

బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు అయితే కాస్త జాగ్రత్త పడాలి. 350cc లోపల మోడళ్లను ఇప్పుడే బుక్‌ చేయకుండా, తగ్గిన GST అమల్లోకి వచ్చే వరకు (సెప్టెంబర్ 22, 2025) ఆగాలి. 450cc లేదా 650cc RE, KTM Duke, Triumph Speed, Harley X440 లాంటి మోడళ్లు చూడదలచినవారు కొత్త ధరలు అమల్లోకి రాకముందే నిర్ణయం తీసుకోవాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget