Maruti Suzuki Wagon R CNG: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు!
Maruti Suzuki Wagon R CNG Downpayment: మారుతి సుజుకి వ్యాగర్ ఆర్ సీఎన్‌జీని రూ.లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి తీసుకెళ్లిపోవచ్చు. నెల నెలా ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
Maruti Suzuki Wagon R CNG on EMI and Down Payment: మారుతి సుజుకి కార్లు తక్కువ ధరలో మంచి ఆఫర్లను అందిస్తాయి. ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కంపెనీ కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ కార్లలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒకటి. కంపెనీ ఈ కారుకు సంబంధించిన సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా విక్రయిస్తుంది. మీరు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కొంత మొత్తం డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
ముందుగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీ ధర గురించి తెలుసుకుందాం. దీని బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర సుమారు రూ. 6.45 లక్షలుగా ఉంది. ఇది వివిధ నగరాలను బట్టి మారుతుంది. మీరు ఢిల్లీలో వ్యాగన్ఆర్‌కు సంబంధించిన సీఎన్‌జీ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే దాని బేస్ మోడల్‌ను రూ. లక్ష డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ని ఎంత డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు?
దీని కోసం మీరు ఐదు సంవత్సరాల పాటు 9.8 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. ఇది రూ. 5.45 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ప్రతి నెలా రూ. 11 వేలు ఈఎంఐ చెల్లించాలి. అంటే మొత్తం ఐదు సంవత్సరాల్లో రూ.6.91 లక్షలు బ్యాంకుకు చెల్లిస్తారు. ఇందులో వడ్డీ రేటు కూడా ఉంటుంది. కారు ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది భారతీయ మార్కెట్లో అత్యంత చవకైన సీఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్.
ఇంజిన్ ఫీచర్లు ఇలా...
ఈ మారుతి కారులో 1.0 లీటర్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 57 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీని మైలేజీ కిలోకు 32.52 కిలోమీటర్ల నుంచి మొదలై 34.05 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వ్యాగన్ఆర్ సీఎన్‌జిలో ఎల్‌ఎక్స్‌ఐ (రూ. 6.42 లక్షలు), వీఎక్స్‌ఐ (రూ. 7.23 లక్షలు) అనే రెండు వేరియంట్‌లు ఉన్నాయి.
Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
India’s No.1 PV exporter #MarutiSuzuki attains 3Mn cumulative exports and is accelerating. 1st Million in 24yr 8months, 2nd Million in 8yr 10months & 3rd Million in 3yr 9months. Thanks to progressive policies @makeinindia #ViksitBharat @PMOIndia @MHI_GoI @DoC_GoI @PiyushGoyal pic.twitter.com/Yrs5e0ZmE1
— Maruti Suzuki (@Maruti_Corp) November 25, 2024
Hon'ble Transport Minister UP, Shri @dayashankar4bjp & @uptransportdept dignitaries appreciate #MarutiSuzuki CSR efforts in the state in road safety and skill development including Automated Driving Test Track (ADTT) at @UPIntrTradeShow.
— Maruti Suzuki (@Maruti_Corp) September 27, 2024
Details of ADTT - https://t.co/qqj2CL8oGa pic.twitter.com/I5e5g9NDta