అన్వేషించండి

Maruti Suzuki Price: మారుతీ సుజుకి కార్లు ఇక కాస్ట్లీ – ధరల పెంపునకు సిద్ధమవుతున్న ఆటో దిగ్గజం!

Maruti Suzuki Price: పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, గ్లోబల్ సప్లై చైన్ సమస్యల వల్ల మారుతీ సుజుకి తన పాపులర్ చిన్న కార్ల ధరలను పెంచే యోచనలో ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతీ సుజుకి 2026లో కార్ల ధరలను పెంచుతుంది.
  • పెరిగిన ఉత్పత్తి, సరఫరా ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం.
  • చిన్న కార్ల విభాగం కంపెనీ అమ్మకాలకు వెన్నెముక.
  • ఇతర కంపెనీల మాదిరిగానే మారుతీ కూడా ధరలు పెంచే అవకాశం.

 Maruti Suzuki Price: మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్ బ్రాండ్ మారుతీ సుజుకి (Maruti Suzuki) తమ కస్టమర్లకు చేదు వార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2026లో తమ చిన్న కార్ల విభాగంలోని మోడళ్ల ధరలను పెంచాలని కంపెనీ భావిస్తోంది. పెరిగిన ఇన్‌పుట్ కాస్ట్ (ఉత్పత్తి వ్యయం), ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ అంతరాయాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మారుతీ సుజుకి కాంపాక్ట్ మోడళ్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతో పాటు పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోవడం సేల్స్‌కు ప్లస్ పాయింట్ అయినప్పటికీ, లాభాల మార్జిన్‌పై పడుతున్న ఒత్తిడి కంపెనీని ధరల సవరణ దిశగా ఆలోచింపజేస్తోంది.

ధరల పెంపునకు గల కారణాలు

మారుతీ సుజుకి మార్కెటింగ్ - సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ సమాచారం ప్రకారం.. రవాణా ఖర్చులు, విడిభాగాల సేకరణ వ్యయం గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం) లో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. కరెన్సీ విలువలో మార్పులు కూడా కంపెనీపై అదనపు భారాన్ని మోపాయి. ఈ భారాన్ని పూర్తిగా కంపెనీయే భరించడం సాధ్యం కానందున, కొంత మొత్తాన్ని కస్టమర్లపై వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

మారుతీ సుజుకి సేల్స్ రికార్డులు

మారుతీ సుజుకి వ్యాపారంలో సెలేరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి చిన్న కార్లే వెన్నెముకగా ఉన్నాయి. 2026 మార్చి నెలలో ఒక్క ఈ విభాగం నుండే 83,530 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక 2025 ఏప్రిల్ నుండి 2026 మార్చి వరకు జరిగిన ఆర్థిక సంవత్సరంలో (FY2026) మొత్తం 9,20,393 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. ఇందులో మారుతీ డిజైర్ (Dzire) భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ బడ్జెట్ మోడళ్లే బ్రాండ్ ఎదుగుదలకు ఎంతటి కీలకమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మార్కెట్ విశ్లేషణ

టాటా మోటార్స్, ఎంజీ మోటార్, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఇతర కంపెనీలు ఇప్పటికే ఏప్రిల్ 2026 నుండి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకి మాత్రం మధ్యతరగతి కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ధరల పెంపును వాయిదా వేస్తూ వచ్చింది. సెప్టెంబర్ 2025లో అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ 2.0 (GST 2.0) వల్ల కొన్ని మోడళ్ల ధరలు తాత్కాలికంగా తగ్గి అమ్మకాలు పెరిగాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డిమాండ్‌ను, లాభాలను బ్యాలెన్స్ చేస్తూ 2026 చివరి నాటికి ధరల సవరణ పూర్తి చేసే అవకాశం ఉంది.

Frequently Asked Questions

మారుతి సుజుకి 2026లో ఏ మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తోంది?

మారుతి సుజుకి తమ చిన్న కార్ల విభాగంలోని మోడళ్ల ధరలను 2026లో పెంచాలని యోచిస్తోంది.

మారుతి సుజుకి తమ కార్ల ధరలను పెంచడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

పెరిగిన ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు, విడిభాగాల సేకరణ వ్యయం, మరియు అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో ఇబ్బందులు దీనికి ప్రధాన కారణాలు.

మారుతి సుజుకి చిన్న కార్ల అమ్మకాల గణాంకాలు ఏమిటి?

2026 మార్చి నెలలో సెలేరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి చిన్న కార్ల విభాగం నుండి 83,530 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి ధరల పెంపును ఎప్పటివరకు వాయిదా వేసింది?

మారుతి సుజుకి మధ్యతరగతి కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర కంపెనీలు ధరలు పెంచుతున్నప్పటికీ, ఇప్పటివరకు ధరల పెంపును వాయిదా వేసింది.

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget