Maruti Suzuki Grand Vitara: మారుతి గ్రాండ్ విటారా వచ్చేసింది - ఆ ఒక్క విషయంలో సస్పెన్స్!
మారుతి సుజుకి కొత్త గ్రాండ్ విటారా మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో కంపెనీ సూపర్ ఫీచర్లను అందించింది.
మారుతి సుజుకి తన కొత్త హైబ్రిడ్ కారును మార్కెట్లో లాంచ్ చేసింది. అదే గ్రాండ్ విటారా. దీని ధరను కంపెనీ త్వరలో రివీల్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఈ సంవత్సరమే సేల్‌కు వెళ్లనుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు దీన్ని రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కారు ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ కారు లాంచ్ అయింది. దీన్ని కూడా టొయోటా ప్లాంట్‌లోనే రూపొందించారు. ఇందులో 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ అందించారు. ఇది ఏసీ మోటార్‌కు పెయిర్ అయి ఉంది. అర్బన్ క్రూజర్ హైరైడర్‌లో కూడా ఇదే ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 91 హెచ్‌పీ, 122 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఈ-మోటార్ 79 హెచ్‌పీ, 141 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. రెండూ కలిపి మొత్తంగా 114 హెచ్‌పీ వరకు పవర్ అందించనున్నాయి.
ఈ హైబ్రిడ్ ఇంజిన్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని మారుతి సుజుకి అంటోంది. దీన్ని మనదేశం కోసం భారీగా లోకలైజ్ చేశారు. ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌ను కూడా ఇందులో అందించారు. ఆటో, శాండ్, స్నో, లాక్ మోడ్స్‌లో దీన్ని డ్రైవ్ చేయవచ్చు.
దీని ముందువైపు, వెనకవైపు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను అందించారు. ఈ కారు ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. లోపల కూడా పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, తొమ్మిది అంగుళాల ఫ్లోటింగ్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ స్క్రీన్ ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను ఇది సపోర్ట్ చేయనుంది. హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఈ కారులో ఉంది.
దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఎంజీ ఆస్టర్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వాగన్ టైగున్ వంటి కార్లతో ఇది పోటీ పడనుంది. వీటిలో ఎందులోనూ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ లేకపోవడం విటారాకు కలిసొచ్చే అంశం. ఈ కారు ఫీచర్లు, దీనికి ఉన్న కాంపిటీషన్ బట్టి చూస్తే రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్యలో దీని ధర ఉండే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?