Maruti Suzuki E-Vitara: మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
Maruti Suzuki New Car: మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు అయిన ఈ-విటారాను మార్కెట్లో పరిచయం చేసింది. త్వరలో ఈ కారు మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.
Maruti First Electric Car: మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ప్రపంచ మార్కెట్లో తన మొదటి ఈవీ ఈ-విటారాకు సంబంధించిన గ్లింప్స్‌ను చూపింది. ఇటలీలోని మిలాన్‌లో జరిగిన మోటార్ షోలో మారుతి ఈ వాహనాన్ని వెల్లడించారు. మారుతి ఇప్పటికే భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దాని ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ ఈవీఎక్స్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ-విటారాను వేరే పేరుతో భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కారు ప్రాథమిక కాన్సెప్ట్ లుక్ 4-మీటర్ ఎస్‌యూవీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ వాహనం 4,275 మిల్లీమీటర్ల పొడవుతో రాబోతోంది.
మారుతి ఈ-విటారా డిజైన్
మారుతి ఈ-విటారా లుక్ గ్రాండ్ విటారా కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు హార్ట్‌టెక్ ఈ-ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో షార్ప్ డీఆర్ఎల్స్, ఖాళీగా ఉన్న గ్రిల్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ ఎండ్ వెర్షన్‌లో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు. అయితే దీని స్టాండర్డ్ ప్లస్ వేరియంట్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మునుపటి స్విఫ్ట్‌లో ఉపయోగించిన డోర్ హ్యాండిల్స్‌ను మారుతి ఈ-విటారాలో అమర్చారు.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
మారుతి ఎలక్ట్రిక్ కారు లోపలి భాగం
గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టిన మారుతి ఈవీ లోపలి భాగం చాలా విశాలమైనది. మారుతి ఈ-విటారాలోని డ్యాష్‌బోర్డ్ డిజైన్ భిన్నంగా ఉంది. ఈ కారులో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ అందించారు. ట్విన్ స్క్రీన్ లేఅవుట్, కొత్త డ్రైవ్ సెలెక్టర్ కూడా ఇందులో చూడవచ్చు. మారుతి ఎలక్ట్రిక్ కారుకు కూడా 2700 మిల్లీమీటర్ల వీల్ బేస్ అందించారు.
ఈ-విటారా పవర్, రేంజ్ ఎంత?
మారుతి ఈ-విటారా స్టాండర్డ్ వెర్షన్‌లో ఒకే ఫ్రంట్ మోటార్ ఉంది. ఇందులో 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 142 బీహెచ్‌పీ శక్తిని, 189 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది 180 బీహెచ్‌పీ శక్తిని, 300 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
మారుతి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుంది?
ఈ ఎలక్ట్రిక్ కారును 2025 సంవత్సరంలో భారతదేశంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారు నెక్సా విక్రయ కేంద్రాలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మారుతికి అత్యంత ప్రీమియమ్ కారు. మారుతి తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ, హ్యుందాయ్ క్రెటా ఈవీలకు గట్టి పోటీనిస్తుంది.
ప్రస్తుతం మనదేశంలో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించడంతో వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. సేఫ్టీ ఫీచర్ల విషయంలో కాస్త కంప్లయింట్లు ఉన్నాయి. వాటిని కూడా సరి చేసుకుంటే ఇంక వీటికి తిరుగులేదని అనుకోవచ్చు.
Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!