2022 Maruti Suzuki Baleno: రూ.6 లక్షల్లో మారుతి సుజుకి కొత్త కారు.. బలెనో కొత్త వేరియంట్ వచ్చేస్తుంది!
మారుతి సుజుకి కొత్త బలెనో త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది.
మారుతి సుజుకి ఈ సంవత్సరం కొత్త వాహనాలు లాంచ్ చేయడానికి చూస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో బలెనో 2022 మోడల్ కూడా ఉంది. ఈ కారు మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ కారు మనదేశంలో మొదట 2015లో లాంచ్ అయింది. ఇప్పుడు ఇందులో రెండో ఫేస్ లిఫ్ట్ వేరియంట్ లాంచ్ కానుంది.
ఇప్పుడు తాజాగా లాంచ్ కానున్న బలెనో కొత్త మోడల్‌లో కంపెనీ పలు మార్పులు చేసే అవకాశం చేసే అవకాశం ఉంది. గతంలో వచ్చిన వేరియంట్లలో బలెనో ఎక్కువ మార్పులు చేయలేదు. ఈ కొత్త బలెనో మరి కొద్ది నెలల్లోనే మనదేశంలోకి వచ్చే అవకాశం ఉంది.
తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ కారు తయారీ కూడా మనదేశంలో ప్రారంభం అయింది. గుజరాత్‌లో ఈ కారును కంపెనీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకవ్వడం విశేషం. ఈ ఫొటోల్లో బలెనో కొత్త కారు ఎలా ఉందో చూడవచ్చు.
లీకైన ఫొటోతో పాటు కొన్ని స్పై షాట్లు కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో కొత్త డిజైన్ అందించారు. పెద్ద రేడియేటర్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త షేప్ ఉన్న హెడ్ లైట్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఇందులో డ్యూయల్ టోన్ అలోయ్ వీల్స్, స్వల్పంగా మార్పులు చేసిన వెనకవైపు బంపర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా ఉండనున్నాయి.
ఎయిర్ కాన్ వెంట్లు, కొత్త ఏసీ కంట్రోల్ ప్యానెల్, ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ కూడా ఇందులో ఉండనుంది. ఇందులో అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా అందించనున్నారు. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ను కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కొత్త బలెనో కారులో మెకానికల్ చేంజెస్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉండనుంది. 88 బీహెచ్‌పీ పీక్ టార్క్, 115 ఎన్ఎం పీక్ టార్క్ కూడా ఇందులో ఉండనుంది. ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సీవీటీ ఆటోమేటిక్ యూనిట్ కూడా ఉండనుంది.దీని ధర రూ.6 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
2022 Maruti Baleno is all set to hit the showrooms, production commenced at Suzuki Motor
— Team Ignition (@TeamIgnition2) January 27, 2022
Gujarat facility
Gets new exterior and revised interior . Will continue to use the 1.2-litre naturally aspirated
petrol engine#MarutiSuzuki #baleno #Balenofacelift #Baleno2022 #TeamIgnition pic.twitter.com/iylSd9s5DO