అన్వేషించండి

మనాలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మంచులో 4x4 వాహనం ఎందుకు అవసరమో ఈ స్టోరీ చదవండి

మనాలీలో భారీ మంచు కురుస్తుండటంతో 4x2 కార్లకు ప్రమాదం పెరిగింది. వైరల్ వీడియోలు భయానక పరిస్థితులను చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 4x4 వాహనం, సేఫ్టీ టిప్స్ ఎంత అవసరమో తెలుసుకోండి.

Driving Tips For Winter Snowfall: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సీజన్‌లో మొదటిసారిగా భారీగా మంచు కురవడంతో మనాలీ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఒక్కసారిగా అందరినీ భయపెడుతున్నాయి. కొండదారుల్లో వాహనాలు అదుపు తప్పి జారిపోవడం, మంచుపై స్కిడ్‌ అవుతూ ప్రమాదకరంగా కిందకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు ప్రస్తుతం విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి - మంచు ప్రాంతాల్లో 4x2 కార్లతో ప్రయాణం తీవ్ర ప్రమాదకరం.

685 రహదారులు మూసివేత

భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, హిమాచల్‌ ప్రదేశ్‌ అంతటా విస్తృతంగా మంచు, వర్షాలు కురిసే అవకాశముంది. మంచు ప్రభావంతో, ఇప్పటికే ఆ రాష్ట్రవ్యాప్తంగా 685 రహదారులు మూసివేశారు. వీటిలో లాహౌల్‌ స్పితి జిల్లాలో అత్యధికంగా 292 రోడ్లు బ్లాక్ అయ్యాయి. చంబా, మండీ, కులు జిల్లాల్లో కూడా భారీగా రవాణా అంతరాయం ఏర్పడింది.

మనాలీ, పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దట్టమైన మంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా స్థానిక యంత్రాంగం కఠిన ఆంక్షలు విధించింది. ఎమర్జెన్సీ అయితే మాత్రమే ప్రయాణం చేయాలని సూచించింది. ముఖ్యంగా 4x4 వాహనాలకే అనుమతి ఇస్తున్నారు. కులు నుంచి మనాలీకి వెళ్లే వాహనాలను పాట్లికుహల్‌ వద్దే నిలిపివేస్తున్నారు. ముందున్న రహదారి డ్రైవింగ్‌కు సురక్షితం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వైరల్ వీడియోల్లో కనిపిస్తున్న ప్రమాదాలకు ప్రధాన కారణం - 4x2 కార్లకు మంచులో సరైన గ్రిప్‌ లేకపోవడమే. సాధారణ రోడ్లపై సాఫీగా నడిచే ఈ కార్లు, మంచు కప్పిన కొండ దారుల్లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాయి. ఇదే సమయంలో 4x4 వాహనాలు అన్ని చక్రాలకు పవర్‌ పంపడం వల్ల మంచుపై కూడా మెరుగైన నియంత్రణ ఇస్తాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు

మంచు సీజన్‌లో మనాలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారు కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మొదటిగా స్నో చైన్స్‌ వినియోగం చాలా అవసరం. ఇవి టైర్లకు అదనపు గ్రిప్‌ ఇచ్చి స్కిడింగ్‌ను తగ్గిస్తాయి. 

టైర్ ప్రెషర్‌ను సాధారణం కంటే కొద్దిగా తగ్గించడం వల్ల రోడ్డు మీద టైర్‌ పట్టు పెరుగుతుంది.

డ్రైవింగ్ సమయంలో నెమ్మదిగా, స్థిరంగా వాహనం నడపడం అత్యంత కీలకం. అకస్మాత్తుగా బ్రేక్ వేయడం లేదా వేగం పెంచడం ప్రమాదానికి దారితీస్తుంది. 

హెడ్‌ల్యాంప్స్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌ ఆన్‌లో ఉంచడం ద్వారా తక్కువ విజిబిలిటీలో కూడా ముందున్న దారిని స్పష్టంగా చూడవచ్చు. అలాగే ఇతర వాహనాలకు మన ఉనికిని తెలియజేయవచ్చు.

మంచు రోడ్లపై బ్రేకింగ్‌ దూరం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందు వాహనానికి సరిపడా దూరంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఇలా చేస్తే అకస్మాత్తుగా వాహనం జారినా, ఆగినా ప్రమాదాన్ని నివారించవచ్చు.

మనాలీ అందమైన మంచు దృశ్యాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, సురక్షిత ప్రయాణమే ప్రథమ ప్రాధాన్యం కావాలి. సరైన వాహనం, సరైన జాగ్రత్తలు లేకుండా మంచు ప్రాంతాల్లోకి వెళ్లడం ప్రాణాలకే ముప్పుగా మారొచ్చు. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!
మీ కారు ఇంజిన్‌ ముందు వైపు ఉందా, మధ్యలో ఉందా.. డ్రైవింగ్‌లో వచ్చే తేడా ఏంటి?
Car Tyre Pressure: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!
టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా? మైలేజీ, బ్రేకింగ్, టైర్ లైఫ్‌ మీద ఎంత ప్రభావమో తెలుసా?
Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget