అన్వేషించండి

Mahindra XUV 3XO: ఈ మహీంద్రా కారు వెయిటింగ్ పీరియడ్ సంవత్సరం - ధర పెరిగినా ఆగని క్రేజ్!

Mahindra XUV 3XO Waiting Period: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగింది. దీని ఎంట్రీ లెవల్ కారు బుక్ చేసుకుంటే డెలివరీ అవ్వడానికి సంవత్సరం పట్టనుంది.

Mahindra XUV 3XO Price: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో 2024 ఏప్రిల్లో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు లాంచ్ అయినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 7.49 లక్షలుగా ఉంది. మహీంద్రా ఇటీవలే ఈ కారు ప్రారంభ ధరను ఏకంగా రూ.30 వేలు పెంచింది. అయితే ఈ కారు ధర పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారుకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరానికి చేరుకుంది. అంటే మీరు ఈ దీపావళి పండుగకి కారుని బుక్ చేసుకుంటే, వచ్చే దీపావళికి ఈ కారు తాళాలు మీ చేతుల్లోకి వస్తాయి.

ఎక్స్‌యూవీ 300ను దాటేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో విడుదలై కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది. ఈ ఆరు నెలల్లో, ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 300ని కూడా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో దాటేసింది. మహీంద్రా లాంచ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్‌యూవీ 300 ప్రతి నెలా 5000 యూనిట్లను విక్రయించిన రికార్డును కలిగి ఉంది. అదే సమయంలో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో అమ్మకాల పరంగా కూడా ఈ రికార్డును అధిగమించింది. గత కొన్ని నెలల్లో, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ప్రతి నెలా సగటున 8,400 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. అయితే ధర పెరిగిన తర్వాత కూడా ఈ కారుకు డిమాండ్ తగ్గడం లేదు. ఈరోజు బుక్ చేసుకుంటే సంవత్సరం తర్వాత కారు మీ చేతుల్లోకి రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వెయిటింగ్ పీరియడ్
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మహీంద్రా కారులో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ దాని ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ కోసం ఉంది. ఈ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ ఏకంగా ఒక సంవత్సరానికి చేరుకుంది. అయితే దాని ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ లేదు. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఏఎక్స్7, ఏఎక్స్7 ఎల్ వేరియంట్‌ల కోసం ఉంది. దాని పెట్రోల్ వేరియంట్ కోసం కారును బుక్ చేసిన తర్వాత మీరు కేవలం రెండు నెలలు మాత్రమే వేచి ఉండాలి. ఇదే మోడల్ డీజిల్ వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ కేవలం ఒక నెల మాత్రమే కావడం విశేషం.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ధర
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 111 హెచ్‌పీ పవర్‌ని డెలివర్ చేస్తుంది. 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ వేరియంట్ కూడా ఉంది. ఇది 131 హెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. అదే సమయంలో ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఈ కారుకు 117 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ధర పెరిగిన తర్వాత ఈ కారు ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.79 లక్షలుగా మారింది. అదే సమయంలో దాని టాప్ మోడల్ ధర రూ. 15.49 లక్షలకు పెరిగింది.

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Mahindra XUV 3XO: ఈ మహీంద్రా కారు వెయిటింగ్ పీరియడ్ సంవత్సరం - ధర పెరిగినా ఆగని క్రేజ్!
ఈ మహీంద్రా కారు వెయిటింగ్ పీరియడ్ సంవత్సరం - ధర పెరిగినా ఆగని క్రేజ్!
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Mahindra XUV 3XO: ఈ మహీంద్రా కారు వెయిటింగ్ పీరియడ్ సంవత్సరం - ధర పెరిగినా ఆగని క్రేజ్!
ఈ మహీంద్రా కారు వెయిటింగ్ పీరియడ్ సంవత్సరం - ధర పెరిగినా ఆగని క్రేజ్!
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
Game Changer: తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?
తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?
Best 55 inch TV Under Rs 30k: రూ.30 వేలలోపు బెస్ట్ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీలు - ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్లు!
రూ.30 వేలలోపు బెస్ట్ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీలు - ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్లు!
Ongole News: తల్లితో సహజీవనం - కూతురుతో జంప్‌- ఒంగోలులో దారుణం
తల్లితో సహజీవనం - కూతురుతో జంప్‌- ఒంగోలులో దారుణం
Embed widget