XUV 3XO vs XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వర్సెస్ ఎక్స్‌యూవీ300 - ఏం మార్పులు చేశారు?
Mahindra XUV 3XO vs Mahindra XUV300: రెండిటి మధ్య ఏం మారింది? ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో కొత్త ఫీచర్లు ఏం ఉన్నాయి?
Mahindra XUV 3XO vs XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ300కు (Mahindra XUV300) ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌గా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO) ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. లుక్, ఇంటీరియర్ కాకుండా దీని ఫీచర్లలో కూడా చాలా మార్పులు చేశారు. మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోల మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్టైలింగ్‌లో ఏం మారింది?
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కొలతల గురించి మాట్లాడినట్లయితే దాని పొడవు 3990 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1821 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1647 మిల్లీమీటర్లుగానూ ఉంది. అయితే ఎక్స్‌యూవీ300 పొడవు 3995 మిల్లీమీటర్లు, వెడల్పు 1821 మిల్లీమీటర్లు, ఎత్తు 1627 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కొత్త బంపర్ డిజైన్ కారణంగా కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. వీల్‌బేస్ కూడా 2600 మిల్లీమీటర్లుగా ఉంది. అయితే స్టైలింగ్ కొత్తగా ఉంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, కొత్త బంపర్, గ్లోస్ బ్లాక్ గ్రిల్‌తో మునుపటి కంటే మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఇది కొత్త 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. వెనుకవైపు స్టైలింగ్‌లో కొత్త కనెక్టెడ్ లైట్ బార్ ఉంది. దిగువన నంబర్ ప్లేట్ చూడవచ్చు.
Say hello to the #MahindraXUV3XO. It's #EverythingYouWantAndMore from an SUV.
— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) April 29, 2024
✅Standout design
✅Class-leading tech
✅Exclusive first-in-segment features
& more
Know more: https://t.co/MgsMjzn3Lk#The3XFactor #XUV3XO #EverythingandMore #ExploreTheImpossible pic.twitter.com/3KQwNc8qR9
ఇంటీరియర్, ఫీచర్లు
దీని ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు చేశారు. ఇంటీరియర్‌కు లెథెరెట్ సాఫ్ట్ టచ్ ఇన్‌సర్ట్‌లు, వైట్ అప్హోల్స్టరీతో కొత్త లుక్ ఇచ్చారు. కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్, 7 స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉన్నాయి. దీని బూట్ స్పేస్ కూడా కొద్దిగా పెరిగింది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
ఇంజిన్ ఎలా ఉంది?
మునుపటిలాగా ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో మరింత శక్తివంతమైన 130 హెచ్‌పీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. కానీ ఇప్పుడు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో డ్రైవ్ మోడ్, స్టీరింగ్ మోడ్ కూడా ఉన్నాయి. అయితే డీజిల్ ఇంజన్ మునుపటి ఎక్స్‌యూవీ300 లానే ఉంది.
ధర ఎంత మారింది?
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ధర ఎక్స్‌యూవీ300 కంటే తక్కువగా ఉంది. ఎక్స్‌యూవీ 300 ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షలు కాగా, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ధర రూ. 7.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో టాప్ ఎండ్ ట్రిమ్ ధర రూ. 15 లక్షల కంటే ఎక్కువ. మొత్తంమీద ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో దాదాపు అన్ని అంశాలలో ఎక్స్‌యూవీ300 కంటే మెరుగ్గా ఉంది.