Mahindra Scorpio-N: మహీంద్రా స్కార్పియో-Nలో సన్‌రూఫ్ లీకైపోతుందట, ఇదిగో ఈ వీడియోనే ప్రూఫ్!
మహీంద్రా కంపెనీ తాజాగా తీసుకొచ్చిన వాహనం స్కార్పియో-ఎన్. సన్ రూఫ్ తో వచ్చిన ఈ వాహనం పనితీరును పరిశీలించగా షాకింగ్ విషయం బయటపడింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది మహీంద్రా సరికొత్త వాహనం స్కార్పియో-ఎన్ పరిస్థితి. భారత మార్కెట్లో బాగా పాచుర్యం పొందిన ఈ వాహనం, ప్రస్తుతం ఓరేంజిలో అమ్మకాలను కొనసాగిస్తోంది. ఈ కొత్త SUV కోసం కస్టమర్లు చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ కారును అందుకున్న అరుణ్ పవార్ అనే వినియోగదారుడు సన్‌రూఫ్‌ను పరీక్షించి షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
స్కార్పియో-ఎన్ సన్ రూఫ్ ఫెయిల్!
పర్వతాల నడుమ ప్రయాణం చేస్తున్న అరుణ్ కు ఓ జలపాతం కనిపించింది. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. తన వాహనంలోని సన్ ఫ్రూప్ ఎలా ఉందో పరీక్షించాలి అనుకున్నాడు. ఓ జలపాతం కిందికి తన కారును తీసుకెళ్లి నిలిపాడు. అంతే, కొన్ని సెకన్లలో క్యాబిన్ లోపలికి నీరు రావడం మొదలయ్యింది. స్పీకర్ గ్రిల్స్ నుంచి కూడా నీరు లోపలికి వచ్చింది. కొద్ది సేపట్లో క్యాబిన్ నీటితో నిండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే తన కారును జలపాతం నుంచి బయటకు తీసుకొచ్చేశాడు.
కారులోకి నీళ్లు ఎందుకు వెళ్లాయంటే?
జలపాతానికి సంబంధించి అధిక పీడనం వల్ల సన్ రూఫ్ సీల్స్ విరిగిపోయాయి. నీరు పూర్తి శక్తితో ప్రవహించడం ప్రారంభించింది. కారు వైరింగ్ ఛానెల్‌లలోకి కూడా వచ్చింది. అందుకే రూఫ్ స్పీకర్ గ్రిల్స్ ద్వారా నీరు లోపలికి ప్రవహించింది. దాని కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మంటలు కూడా సంభవించవచ్చు. కానీ, మహీంద్రా నీటి ఒత్తిళ్లను తట్టుకునేలా సన్ రూఫ్ ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి జలపాతాల నుంచి వచ్చే నీటి ఒత్తిడి గతంలో పలు కార్లు తట్టుకున్నాయి. హ్యుందాయ్ క్రెటాతో సహా అనేక వాహనాలు సన్ రూఫ్ మీద జల పాతాల నుంచి నీరు పడినా ఎలాంటి లీకులు రాలేదు. మహీంద్రా స్కార్పియో-ఎన్ మాత్రం తట్టుకోలేకపోయింది.
సన్‌రూఫ్ తో లాభం కంటే నష్టమే ఎక్కువ!
కొన్నేళ్ల క్రితం లగ్జరీ కార్లలో మాత్రమే సన్‌రూఫ్‌లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు, భారతదేశంలో చాలా కార్లు సన్‌రూఫ్‌లను అందిస్తున్నాయి. వాస్తవానికి సన్‌రూఫ్ చాలా బాగుంది. వాహనానికి సంబంధించిన అందం పెంచుతుంది. స్వచ్ఛమైన గాలిని లోపలికి వచ్చేలా చేస్తుంది. కానీ, చాలా మంది వాహనం పైన నిలబడటానికి మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లలకు. అకస్మాత్తుగా బ్రేక్‌ని ఉపయోగించడం వలన సన్ రూఫ్ నుంచి బయటకు విసిరేసే అవకాశం ఉంటుంది. గాలిలో వచ్చే చెత్త చెదారం లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కారులో నిలబడినప్పుడు కిందికి వేలాడే విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంటుంది. సన్‌రూఫ్ అనేది భారతీయ మార్కెట్లో అత్యంత దుర్వినియోగమైన ఫీచర్లలో ఒకటి. సన్‌రూఫ్‌లను తప్పుగా ఉపయోగించడం వల్ల చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సన్‌రూఫ్‌లు సాలిడ్ రూఫ్‌లలా ఉండవు. ప్రత్యేక శ్రద్ధ, నిర్వహణ అవసరం.
Read Also: అరెరే, డెలివరీకి మరీ అంత తొందరా - కొత్త లగ్జరీ కారును ఇలా పార్క్ చేశారంటూ మీమ్స్!