Top SUVs : మహీంద్రా స్కార్పియో నుంచి విక్టోరిస్ వరకు సేల్స్‌లో అదరగొట్టిన ఎస్‌యూవీలు! డిసెంబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన జాబితా ఇదే!
Top SUVs : డిసెంబర్ 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVల జాబితా విడుదలైంది. మహీంద్ర స్కార్పియో నుంచి మారుతి సుజుకి విక్టోరిస్ వరకు అమ్మకాలు జోరుగా సాగించాయి.

Top SUVs : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో SUV కార్లకు ప్రత్యకే స్థానం ఉంది. వీటిపై ప్రజు నిరంతరం మక్కువ పెంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ అవుతున్న టెక్నాలజీతో వస్తున్న వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు డిసెంబర్‌లో జరిగిన విక్రయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎస్‌యూవీలపై ప్రజలు ఏ స్థాయిలో ఇష్టం పెంచుకుంటున్నరో డిసెంబర్ 2025 జరిగి అమ్మకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెలలో మిడ్-సైజ్ SUV విభాగంలో అనేక మోడల్స్ అద్భుతంగా అమ్ముడయ్యాయి. కస్టమర్లు ఇప్పుడు ఎక్కువ స్థలం, శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన భద్రతా లక్షణాలు కలిగిన కార్లను ఇష్టపడుతున్నారు. దీని కారణంగానే మహీంద్ర, హ్యూందాయ్, మారుతి సుజుకి వంటి కంపెనీల SUVలకు అద్భుతమైన స్పందన లభించింది.
మహీంద్ర స్కార్పియో నంబర్-1 స్థానంలో నిలిచింది
డిసెంబర్ 2025లో మహీంద్ర స్కార్పియో, స్కార్పియో-N ఈ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన SUVలుగా నిలిచాయి. గత నెలలో వీటికి మొత్తం 15,885 మంది కొత్త కస్టమర్లు లభించారు. గత సంవత్సరం డిసెంబర్ 2024తో పోలిస్తే, దాదాపు 30 శాతం అద్భుతమైన వృద్ధిని చూడవచ్చు. రెండో స్థానంలో హ్యూందాయ్ క్రెటా ఉంది, ఇది 13,154 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని అమ్మకాలు సంవత్సరానికి 4 శాతం స్వల్పంగా పెరిగాయి. మూడో స్థానంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఉంది, దీనిని డిసెంబర్ 2025లో 8,597 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఈ SUV దాని హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ప్రత్యేకంగా ప్రజలను ఆకర్షిస్తోంది.
హైరైడర్, విక్టోరిస్ ఎంట్రీ
టయోటా హైరైడర్ అమ్మకాల పరంగా నాల్గో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2025లో దీని 7,022 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గత సంవత్సరం కంటే దాదాపు 47 శాతం ఎక్కువ. అదే సమయంలో, ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ కూడా అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చింది. దేశంలోనే అత్యంత చవకైన హైబ్రిడ్ కారుగా ప్రచారంలో ఉన్న విక్టోరిస్‌ను మొదటి నెలలోనే 6,210 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఈ దెబ్బకు ఈ కారు నేరుగా టాప్-5 SUVల జాబితాలో చేరింది.
మిగిలిన SUVల పనితీరు
టాప్-5 కాకుండా, కియా సెల్టాస్ 4,369 యూనిట్లు, టాటా హారియర్ 2,378 యూనిట్లు, హోందా ఎలివేట్ 2,289 యూనిట్లు, ఫోక్స్‌వేగన్ టైగన్ 1,778 యూనిట్లు, టాటా సఫారీ 1,446 యూనిట్లు అమ్ముడయ్యాయి. SUV విభాగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతోందని ఇది స్పష్టం చేస్తుంది.





















