మహీంద్రా కార్లపై దసరా బంపర్ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందంటే?
మహీంద్రా అక్టోబర్ 2026 పండుగ ఆఫర్లలో స్కార్పియో ఎన్, థార్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, ఎక్స్‌యూవీ400 ఈవీపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపులు పొందవచ్చు.

Mahindra Dasara 2026 Discounts: ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు మహీంద్రా శుభవార్త చెప్పింది. ఈ నెలలో, ఎంపిక చేసిన ఎస్‌యూవీలు & ఎలక్ట్రిక్ కార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్లు, ఉచిత యాక్సెసరీలు అందిస్తోంది. ఈ ఆఫర్లతో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే అన్ని మహీంద్రా కార్లపై ఈ తగ్గింపులు లేవు. XUV 3XO, Scorpio Classic, Scorpio N, Thar, XUV400 EV వంటి ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి.
XUV 3XOపై రూ.60 వేల వరకు లాభం
Mahindra XUV 3XO పెట్రోల్ మోడళ్లలో ఎంపిక చేసిన MX2 Pro, MX3, MX3 Pro వేరియంట్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. వీటిపై రూ.40,000 నగదు తగ్గింపు & రూ.20,000 విలువైన యాక్సెసరీలు లభిస్తాయి. మొత్తం ప్రయోజనం రూ.60,000 వరకు ఉంటుంది.
డీజిల్ వేరియంట్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 విలువైన యాక్సెసరీలు అందిస్తున్నారు. ఈ మోడళ్లపై మొత్తం రూ.25,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.
స్కార్పియో క్లాసిక్‌పై కూడా ఆఫర్లు
స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్లపై పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. క్లాసిక్ S వేరియంట్‌పై రూ.15,000 నగదు తగ్గింపు, రూ.20,000 విలువైన యాక్సెసరీలు లభిస్తాయి. క్లాసిక్ ఎస్11 వేరియంట్‌పై రూ.25,000 నగదు తగ్గింపు, రూ.20,000 విలువైన యాక్సెసరీలు అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చెరుకుతో ఇథనాల్ తయారీకి కేంద్రం 'నో'.. పెట్రోల్ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
స్కార్పియో Nపై రూ.1.50 లక్షల వరకు ప్రయోజనం
ఈ నెలలో అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్న మోడళ్లలో స్కార్పియో ఎన్ ముందుంది. ముఖ్యంగా స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 7 సీటర్ 4డబ్ల్యూడీ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.1.25 లక్షల నగదు తగ్గింపు ఉంది. దీనికి రూ.25,000 విలువైన యాక్సెసరీలు కూడా లభిస్తాయి. దీంతో మొత్తం ప్రయోజనం రూ.1.5 లక్షల వరకు చేరుతుంది.
స్కార్పియో N 2WD AT వేరియంట్లపై రూ.50,000 నగదు ప్రయోజనం & రూ.25,000 విలువైన యాక్సెసరీలు అందిస్తున్నారు.
థార్‌పై రూ.80 వేల వరకు తగ్గింపు
ఆఫ్‌రోడింగ్ ప్రియులు ఇష్టపడే మహీంద్రా థార్‌పైనా పండుగ ఆఫర్లు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్‌కు ముందు వచ్చిన థార్ 4WD పెట్రోల్ & డీజిల్ వేరియంట్లపై రూ.50,000 నగదు తగ్గింపు, రూ.30,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. మొత్తం ప్రయోజనం రూ.80,000 వరకు ఉంటుంది.
థార్ 2WD LX వేరియంట్‌పై రూ.30,000 విలువైన ఉచిత యాక్సెసరీలు లభిస్తాయి. అయితే థార్ రాక్స్‌పై ఈ నెలలో ఎలాంటి పండుగ తగ్గింపులు ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: హోండా కార్లపై బిగ్ డీల్స్.. సిటీ, ఎలివేట్, అమేజ్ కొనేవాళ్లకు రూ.2.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
XUV400 EVపై రూ.లక్ష తగ్గింపు
ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి మహీంద్రా మరో ఆఫర్ అందిస్తోంది. XUV400 EV EL Pro వేరియంట్‌పై నేరుగా రూ.1 లక్ష నగదు తగ్గింపు ఇస్తోంది. దీంతో ఈ పండుగ సీజన్‌లో భారీ తగ్గింపు పొందుతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది.
మరోవైపు కొత్తగా వచ్చిన BE 6, XEV 9E మోడళ్లపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఆఫర్లు ప్రకటించలేదు. అయితే డీలర్ వద్ద ఉన్న వాహనాల నిల్వలు, ప్రాంతాన్ని బట్టి ప్రత్యేక ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కంపెనీ ప్రకటించిన తగ్గింపులు ప్రతి నగరంలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. డీలర్‌షిప్, వాహన నిల్వలు, వేరియంట్, వర్తించే నిబంధనలను బట్టి ఆఫర్లు మారతాయి. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు సమీప మహీంద్రా షోరూమ్‌ను సంప్రదించాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















