Lectrix LXS 3.0 Electric Scooter: 130 కి.మీ రేంజ్‌తో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్
Electric Scooter: లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ సరికొత్త స్కూటర్‌ని ఆవిష్కరించింది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 130 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. నేటి నుంచే డెలివరీలు ప్రారంభంకానున్నాయి.
Lectrix LXS 3.0 Electric Scooter Unveiled: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో తొలి స్థానంలో ఉంది. ఇతర ప్రముఖ కంపెనీలతో పాటు, స్టార్టప్ కంపెనీలు కూడా హై రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తున్నాయి. ఇటీవల, లెక్ట్రిక్స్ EV (Lectrix EV) భారతీయ అవసరాలకు అనుగుణంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది.
లెక్ట్రిక్స్ EV భారతదేశంలోని టాప్ 10 EV కంపెనీలలో ఒకటిగా ఉంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో విపరీతమైన పోటీ ఉన్నందున మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి క్రమం తప్పకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. Lectrix lxs 2.0 విజయం తర్వాత కంపెనీ ఇప్పుడు Lectrix 3.0ని ఆవిష్కరించింది.
మంచి రేంజ్ & స్పీడ్
ఈ Lectrix 3.0 lxs EV 3-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌పై 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ మోడల్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నేటి నుంచి (ఆగస్టు 1) డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా లెక్ట్రిక్స్ EV అవుట్‌లెట్‌లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.
ఈ స్కూటర్ 1200-వాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. గంటకు 54 వేగంతో ప్రయాణిస్తుంది. అంతే కాకుండా కేవలం 10.5 సెకన్లలో 0- 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మెరుగైన వేగం, మృదువైన ప్రయాణ అనుభవం కోసం, ఇది ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుంది.
ధర
కొత్త లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎల్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అన్ని రకాల భారతీయ భూభాగాలకు సరిపోయేలా ఈ స్కూటర్‌ని లెక్ట్రిక్స్ తయారు చేసింది. ఇంకా దాని ధర ఇతర వివరాలను వెల్లడించలేదు. నేడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించే అవకాశం ఉంది.
ఇతర ఉత్పత్తులు
ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో lxs G2.0 హై-స్పీడ్, lxs 2.0 హై-స్పీడ్, lxs సబ్‌స్క్రిప్షన్, lxs హై-స్పీడ్ మరియు SX 25 స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇటీవల, లెక్ట్రిక్స్ lxs 2.0 మోడల్‌ను విడుదల చేసింది.
Lectrix lxs 2.0 స్పెసిఫికేషన్‌లు
lxs 2.0 2.3-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 98 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 2.9bhp (2.2 కిలోవాట్స్) గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ని అందించే BLDC హబ్ మోటారును ఈ స్కూటర్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 60 వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఇ-స్కూటర్‌లో ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్‌తో పాటు 25-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, 90/110 పరిమాణంలో ముందు వెనక 110/90 టైర్లు ఉన్నాయి.
పురుషులు మరియు మహిళలు సౌకర్యవంతంగా రైడ్ చేసే విధంగా దీనిని రూపొందించారు. Lectrix lxs 2.0 విక్రయాలు ఇటీవల ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ ఈ స్కూటర్ కొనుగోలుపై రూ.5000 తగ్గింపును అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పాటు మొత్తం 14 రాష్ట్రాలలో 60 డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ని కలిగి ఉంది.
Also Read: కార్గిల్ హీరోలకు గుర్తుగా బైక్ లాంచ్ చేసిన టీవీఎస్, ఆకట్టుకుంటున్న డిజైన్
Also Read: ఆగస్టు 1 నుంచి మారనున్న ఫాస్టాగ్ రూల్స్ - ఈ తప్పు చేస్తే బ్లాక్‌లిస్టే!