అన్వేషించండి

Lambretta Elettra: 1960ల నాటి వింటేజ్ బైక్ మళ్లీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో - డిజైన్ మాత్రం సూపర్!

Lambretta Elettra Electric: లాంబ్రెట్టా ఎలెట్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్‌ను కంపెనీ పరిచయం చేసింది.

Lambretta Elettra Electric Concept Scooter: 1960, 1970ల దశకంలో లాంబ్రెట్టా భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్. అయితే ఆధునిక, దేశీయ స్కూటర్ బ్రాండ్లు వచ్చిన తర్వాత ఈ ఇటాలియన్ బ్రాండ్ భారతదేశం నుంచి కనుమరుగు అయిపోయింది. యూరోపియన్ మార్కెట్లలో మాత్రం టూ వీలర్ విభాగంలో లాంబ్రెట్టా (Lambretta) బలమైన బ్రాండ్‌గా మిగిలిపోయింది.

లాంబ్రెట్టా ఎలెట్రా (Lambretta Elettra)
ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచం పెరుగుతోంది. లాంబ్రెట్టా కూడా ఈ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ తన మొదటి బ్యాటరీ ఆపరేటెడ్ మోడల్‌ను కూడా పరిచయం చేసింది. ఈఐసీఎంఏ 2023లో లాంబ్రెట్టా తన మొదటి ప్రొటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎలెట్రా అనే ఈ ప్రోటోటైప్ క్లాసిక్ లాంబ్రెట్టా స్కూటర్‌కి అధునాతన వెర్షన్‌గా రానుంది.

లాంబ్రెట్టా ఎలెట్రా స్టైలింగ్ ఎలా ఉంది? (Lambretta Elettra Styling)
ప్రస్తుతం ఈ స్కూటర్ కాన్సెప్ట్ మోడల్‌ని కంపెనీ డిస్‌ప్లే చేసింది. దీన్నే ప్రొడక్షన్ మోడల్‌గా తీసుకువస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. కొత్త లాంబ్రెట్టా దాని డిజైన్ వివరాలను లాంబ్రెట్టా 1, దాని సక్సెసర్ ఎల్ఐ-150 సిరీస్ 2తో సహా పాత మోడళ్ల నుండి తీసుకుంటుంది. అయినప్పటికీ ఇందులో చాలా కొత్తదనం ఉంది. అదనంగా లాంబ్రెట్టా హెక్సాగోనల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల వంటి అధునాతన టచ్‌లను కూడా కలిగి ఉంది. ఈ హెడ్‌ల్యాంప్‌ల కారణంగా 21వ శతాబ్దపు స్కూటర్‌గా మారింది.

ఉడెన్ 'రిట్రాక్టబుల్' బ్రేక్ లీవర్, 'హుక్డ్' హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను దాచి ఉంచే హ్యాండిల్‌బార్‌లను కూడా ఇందులో చూడవచ్చు. రిమోట్ బటన్‌ను టచ్ చేసినప్పుడు మెయింటెనెన్స్‌తో, బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌కి సులభంగా యాక్సెస్‌ని ఇస్తూ, మొత్తం వెనుక భాగం ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. స్కూటర్ బాడీలో హెల్మెట్ కంపార్ట్‌మెంట్‌ను కూడా కలిగి ఉంటుంది.

లాంబ్రెట్టా ఎలెట్రా స్పెసిఫికేషన్స్ (Lambretta Elettra Electric)
4.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో పెయిర్ అయిన 11 కేడబ్ల్యూ (15 హెచ్‌పీ) ఎలక్ట్రిక్ మోటార్ ఈ స్కూటర్‌కు శక్తిని ఇస్తుంది. ఇందులో ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఎలెట్రా ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 127 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదని లాంబ్రెట్టా పేర్కొంది. పనితీరు గురించి చెప్పాలంటే ఎలెట్రా గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

220వీ హోమ్ ఛార్జర్‌తో దీని బ్యాటరీని ఐదు గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 35 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించిన ఎలెట్రా (Elettra) సిగ్నేచర్ ట్రైలింగ్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్ వెనుక వైపున మోనో- షాక్‌తో వస్తుంది. బ్రేకింగ్ కోసం రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్ సెటప్ అందించారు. దీని సీటు ఎత్తు 780 మిల్లీమీటర్లుగా ఉంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget