అన్వేషించండి

కొత్త డిజైన్, తక్కువ బరువు, మరింత పవర్ ఫీల్ - KTM 790 Dukeకు భారీ అప్‌డేట్

KTM 790 Duke భారీ అప్‌డేట్‌తో వచ్చింది. కొత్త డిజైన్, మెరుగైన ఎర్గోనామిక్స్, WP బ్రేకింగ్ సిస్టమ్, పిరెల్లీ టైర్లు & 105 hp ఇంజిన్‌తో ఈ బైక్ మరింత ఆకర్షణీయంగా మారింది.

Updated KTM 790 Duke Details In Telugu: మిడ్‌ రేంజ్‌ నేకెడ్ స్పోర్ట్స్ బైక్‌ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న KTM 790 Duke ఇప్పుడు మరింత అట్రాక్టివ్‌ లుక్‌లో ప్రపంచ మార్కెట్ ముందుకు వచ్చింది. ఆస్ట్రియన్ టూవీలర్‌ తయారీ సంస్థ KTM, తన 790 Duke మోడల్‌కు ఎన్నడూలేనంత అతి పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించింది. కొత్త డిజైన్, మెరుగైన రైడింగ్ పొజిషన్, అప్‌గ్రేడ్ చేసిన సస్పెన్షన్ & బ్రేకింగ్ వ్యవస్థలతో ఈ బైక్ పూర్తిగా కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది.

అగ్రెసివ్‌ లుక్‌

కొత్త KTM 790 Dukeను చూస్తే సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే భవిష్యత్ తరహా బైక్‌లను గుర్తు చేస్తుంది. KTM 990 Duke & 1390 Super Duke R మోడళ్ల నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌తో ఈ బైక్‌ను రూపొందించారు. పూర్తిగా రీడిజైన్ చేసిన LED హెడ్‌లైట్, స్లిమ్ బాడీ ప్యానెల్స్, పెద్ద ఫ్రంట్ కౌల్ & కొత్త ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ దీనికి మరింత దూకుడు రూపాన్ని తీసుకొచ్చాయి.

ఈ అప్‌డేట్‌లో అత్యంత కీలకమైన మార్పులు ఎర్గోనామిక్స్‌లో కనిపిస్తున్నాయి. కొత్త హ్యాండిల్‌బార్‌ను మరింత సహజమైన రైడింగ్ పొజిషన్ కోసం రూపొందించారు. రైడర్ & పిలియన్ ఫుట్‌పెగ్‌ల స్థానాలను మార్చడంతో పాటు సీటును కూడా కొత్తగా డిజైన్ చేశారు. దీంతో లాంగ్‌ రైడ్స్‌లో కూడా మెరుగైన సౌకర్యం లభిస్తుందని KTM చెబుతోంది.

అదనంగా కొత్త సబ్‌ఫ్రేమ్, సవరించిన ట్రిపుల్ క్లాంప్స్ & రీడిజైన్ చేసిన ఫ్యూయల్ ట్యాంక్ కారణంగా ముందు చక్రం నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ మరింత మెరుగుపడిందని కంపెనీ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా, బైక్ పరిమాణం పెద్దగా కనిపిస్తున్నప్పటికీ, పాత మోడల్‌తో పోలిస్తే 2 కిలోల బరువు తగ్గిందని KTM పేర్కొంది.

ఇంజిన్

ఇంజిన్ విషయానికి వస్తే, Euro 5+ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే 799 cc LC8c ప్యారలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 105 hp పవర్ & 87 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్ & అసిస్ట్ క్లచ్‌ను అందించారు. కొత్త ఎగ్జాస్ట్ & మఫ్లర్ డిజైన్‌తో ఇంజిన్ పనితీరు మరింత మెరుగుపడిందని కంపెనీ చెబుతోంది.

సస్పెన్షన్ బాధ్యతలను WP APEX యూనిట్లే నిర్వహిస్తున్నప్పటికీ, ఫోర్క్ & రియర్ మోనోషాక్‌లో కీలక మార్పులు చేశారు. 43 mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లో కంప్రెషన్ & రీబౌండ్ డ్యాంపింగ్ అడ్జస్ట్‌మెంట్ లభిస్తుంది. వెనుక భాగంలో ప్రీలోడ్ & రీబౌండ్ డ్యాంపింగ్‌ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త 5 క్లిక్ అడ్జస్టర్ ద్వారా సెట్టింగ్స్ మార్చడం మరింత సులభమైంది.

WP రేడియల్ బ్రేకింగ్ సిస్టమ్‌

బ్రేకింగ్ వ్యవస్థలో కూడా పెద్ద మార్పు జరిగింది. పాత మోడల్‌లో ఉన్న J.Juan బ్రేక్‌ల స్థానంలో KTM స్వయంగా అభివృద్ధి చేసిన WP రేడియల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించింది. ఇది మరింత బలమైన బ్రేకింగ్ శక్తి, మెరుగైన నియంత్రణ & మంచి లివర్ ఫీల్‌ను అందిస్తుందని KTM పేర్కొంది. అలాగే WP స్టీరింగ్ డ్యాంపర్‌ను ఇప్పుడు స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. పిరెల్లీ డయాబ్లో రోస్సో IV టైర్లతో రోడ్ గ్రిప్ కూడా మరింత మెరుగుపడింది.

ఇక, కస్టమర్లలో పెద్దగా ఆదరణ పొందని డెమో మోడ్ ఫీచర్‌ను భవిష్యత్ మోడళ్లలో నిలిపివేయనున్నట్లు KTM ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా.. కొన్ని ఎలక్ట్రానిక్ ఫంక్షన్లను తాత్కాలికంగా ఉపయోగించి, తర్వాత వాటిని కొనుగోలు చేయాల్సి ఉండేది. దీనిపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

సేల్స్‌ ఎప్పటి నుంచి?

కొత్త KTM 790 Duke అంతర్జాతీయ మార్కెట్లలో జులై చివరి నుంచి అమ్మకానికి రానుంది. అయితే భారత మార్కెట్లో ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను ఎప్పుడు తీసుకురానున్నారనే విషయంపై KTM ఇండియా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో పెర్ఫార్మెన్స్ బైక్‌ KTM 890 Duke R ను విక్రయిస్తోంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.14.50 లక్షలుగా ఉంది. కొత్త 790 Duke భారత్‌లోకి వస్తే ప్రీమియం నేకెడ్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget