అన్వేషించండి

Kia Upcoming Cars: త్వరలో రెండు కొత్త కార్లు లాంచ్ చేయనున్న కియా - ఈసారి లగ్జరీ సెగ్మెంట్‌లో!

Upcomings Cars in India: కియా త్వరలో మనదేశంలో రెండు కొత్త కార్లు లాంచ్ చేయనుందని తెలుస్తోంది. కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, కియా కార్నివాల్.

Upcoming Kia Cars: ఈ నెల ప్రారంభంలో తన ఉత్పత్తులకు అనేక అప్‌డేట్లు ప్రకటించిన తర్వాత, కియా ఇప్పుడు అనేక ఇతర రాబోయే మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ ఈ ఏడాది చివర్లో రెండు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది.

రాబోయే రెండు కొత్త మోడళ్లలో కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, కొత్త తరం కియా కార్నివాల్ ఉండనున్నాయి. ఈ రెండు కార్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయనున్నారు. వీటిలో కియా కార్నివాల్ ముందు మార్కెట్లోకి రానుందని అంచనా. అయితే కియా ఈవీ9 ఆ తర్వాత లాంచ్ కావచ్చు.

టెస్టింగ్ షురూ
కియా రెండు కార్లను పరీక్షించడం ప్రారంభించింది. రెండు నెలల క్రితం ఈవీ9 రోడ్లపై కనిపించింది. భారతీయ మార్కెట్లో బ్రాండ్ కొత్త ఫ్లాగ్‌షిప్ కారుగా ఇది సెట్ కానుంది. ఇది 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ మోడల్స్‌లో లాంచ్ కానుందని అంచనా. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని అంచనా.

ఈవీ9 ఎలా ఉంటుంది?
ఇండియా స్పెక్ ఈవీ9 గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ కారు మొదట్లో సీబీయూ మోడల్‌గా వస్తుందని, డిమాండ్‌ను బట్టి సీకేడీ వెర్షన్‌లో తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రెండో వరుసలో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

వేటితో పోటీ పడతారు?
కియా ఈవీ9 భారతీయ మార్కెట్లో జీప్ గ్రాండ్ చెరోకీ, త్వరలో రాబోయే వోల్వో ఈఎక్స్90 వంటి కార్లతో పోటీపడుతుంది. వోల్వో ఈఎక్స్90 ఈ సంవత్సరం జూన్‌లో మార్కెట్లో లాంచ్ కానుందని అంచనా. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 1.50 కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

3 స్క్రీన్లతో రానున్న Tata Safari EV.. 600 KM రేంజ్ సహా ఈవీ ఫీచర్లు, అంచనా ధర పూర్తి వివరాలు
3 స్క్రీన్లతో రానున్న Tata Safari EV.. 600 KM రేంజ్ సహా ఈవీ ఫీచర్లు, అంచనా ధర పూర్తి వివరాలు
517 KM రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. MG Hector Tomahawk EV కోసం EMI ఎంత చెల్లించాలి
517 KM రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. MG Hector Tomahawk EV కోసం EMI ఎంత చెల్లించాలి
CNG కార్లకు వరుస అప్‌డేట్స్‌ వదిలిన మారుతి.. ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌లో కూడా AMT ఆప్షన్‌
ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌ CNG వెర్షన్ల డ్రైవింగ్‌ మరింత స్మూత్‌.. AMT గేర్‌బాక్స్‌ ఇచ్చిన మారుతి
రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
Embed widget