Kia Syros: రూ.25 వేలు కట్టి ఈ కియా కారు బుక్ చేసేయచ్చు - వచ్చే నెలలో మార్కెట్లోకి!
Kia Syros Bookings: కియా సైరోస్ బుకింగ్స్ మనదేశంలో ప్రారంభం అయ్యాయి. దీన్ని బుక్ చేసుకోవడానికి రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ కారు మార్కెట్లోకి రానుంది.
Kia Syros Price: దక్షిణ కొరియా కార్ కంపెనీ కియా భారత మార్కెట్లోకి కొత్త కారును విడుదల చేయనుంది. కియా కొత్త కారు సైరోస్ ఫిబ్రవరి 1వ తేదీన మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు బుకింగ్ ఈరోజు (జనవరి 3వ తేదీన) ప్రారంభం అయింది. ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు బుకింగ్ అమౌంట్‌గా రూ. 25,000 డిపాజిట్ చేయాలి. ఈ కారు నేటి నుంచి కియా డీలర్‌షిప్‌లకు కూడా చేరుకోనుంది.
ధర ఎప్పుడు వెల్లడి అవుతుంది?
కియా సైరోస్ లాంచ్‌తో పాటు ఈ కొత్త కారు ధర కూడా వెల్లడి కానుంది. దీని గురించి వాహన తయారీ కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ కియా కారును రూ. 10 లక్షల రేంజ్‌లో తీసుకురావచ్చు. ఈ కారు కియా సోనెట్ కంటే దాదాపు రూ. లక్ష వరకు ఖరీదైనది. ఫిబ్రవరి రెండో వారం నుంచి కంపెనీ ఈ కారు డెలివరీని ప్రారంభించవచ్చు. జనవరి 17వ తేదీన జరిగే ఇండియా మొబిలిటీ షోలో కియా సైరోస్‌ను కూడా పరిచయం చేయవచ్చు.
కియా సైరోస్ ఇంజిన్ పవర్ ఎంత?
కియా సైరోస్ రెండు ఇంజన్ ఆప్షన్‌లు, ఆరు ట్రిమ్‌లతో మార్కెట్లోకి రాబోతోంది. ఈ కారులో 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది ఈ కారుకు 120 హెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కియా కారు కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో రాబోతోంది. ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండనుంది. ఇది 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
ఈ కియా కారు రెండు ఇంజన్ ఆప్షన్లు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో 7 స్పీడ్ డీసీటీ ఆప్షన్ కూడా ఉంది. డీజిల్ వేరియంట్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటో ఆప్షన్ కూడా ఉంది. సెక్యూరిటీ కోస, ఈ కారులో లెవెల్ 2 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
కియా కొత్త కారు ఫీచర్లు
కియా సైరోస్ టాప్ వేరియంట్ గురించి చెప్పాలంటే ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీంతో పాటు డ్యూయల్ టోన్ ఇంటీరియర్, లెథెరెట్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్ కూడా ఉన్నాయి. ఈ కారు 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీన్ని ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం అందించారు. ఈ కారులో 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంది. అలాగే ముందు, వెనుక భాగంలో వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
The wait is almost over.
— Kia India (@KiaInd) January 2, 2025
The bookings for Kia Syros opens tonight at 12 am.
Don’t wait to join the evolution and be the firsts to bring home the new species of SUV - Evolved by the future.
To know more, visit: https://t.co/swIYmtAG9p#Kia #KiaIndia #TheKiaSyros #Syros pic.twitter.com/iDWlm9fk0C