Kia Sales: నాలుగు లక్షలు దాటిన కియా కనెక్టెడ్ కారు సేల్స్ - ఎక్కువ అమ్ముడుపోయింది ఇదే!
Kia Connected Car Sales: కియా కనెక్టెడ్ కారు అమ్మకాలు నాలుగు లక్షల యూనిట్లు దాటాయి.
Kia Connected Cars: కియా ఇండియా నాలుగు లక్షలకు పైగా కనెక్టెడ్ కార్లను విక్రయించిన మైలురాయిని సాధించింది. కనెక్టెడ్ కార్ వేరియంట్‌లు కియా ఇండియా మొత్తం దేశీయ డిస్పాచ్‌ల్లో 40 శాతానికి పైగా ఉండటం విశేషం. కియా కనెక్టెడ్ కార్ వేరియంట్‌ల విక్రయాలు ప్రతి యేటా 30.9 శాతం మేర పెరుగుతున్నాయని కంపెనీ పేర్కొంది.
సెల్టోస్‌కు అత్యధిక వాటా
మొత్తం అమ్మకాల్లో 65 శాతం వాటాతో సెల్టోస్ ఎస్‌యూవీ కియా మొత్తం కనెక్టెడ్ కార్ల విక్రయాలలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. సెల్టోస్ మోడళ్లలో కస్టమర్ ప్రాధాన్యత కూడా కనెక్టెడ్ వేరియంట్ వైపే ఉంది. ఇప్పటివరకు అమ్ముడుపోయిన అన్ని సెల్టోస్ యూనిట్లలో 57 శాతం వరకు కనెక్టెడ్ కార్లే ఉన్నాయి. సెల్టోస్ తర్వాత 31 శాతంతో కియా కారెన్స్ రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం కియా సోనెట్‌లో కనెక్టెడ్ కార్ ఆప్షన్ ఏడు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ మోడల్స్ మొత్తం సోనెట్ అమ్మకాల్లో గణనీయమైన 21 శాతం వరకు ఉన్నాయి. కియా కనెక్ట్ టెలిమాటిక్స్‌లో హింగ్లీష్ కమాండ్‌లు, రిమోట్ విండో కంట్రోల్, రిమోట్ ఇంజన్, ఏసీ స్టార్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయని కియా పేర్కొంది.