అన్వేషించండి

Kia Carens Highlights: కియా కారెన్స్ కొనాలనుకుంటున్నారా? ఈ ఐదు విషయాలు తెలుసుకోవాల్సిందే!

కియా మనదేశంలో కొత్త కారు కారెన్స్‌ను లాంచ్ చేసింది. దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.

Kia Carens: కియా కారెన్స్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ కొత్త కారులో కొన్ని హైలెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఎంపీవీ కారు. ఒక్క వేరియంట్‌లో ఆరు సీట్లు ఉండగా... మిగతా అన్ని వేరియంట్లలో ఏడు సీట్లు అందించారు. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు, ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు.

1. కియా కారెన్స్ మనదేశంలో ప్రత్యేకమైన డిజైన్‌తో లాంచ్ అయింది. దీని ముందు కియా లాంచ్ చేసిన కార్ల కంటే ప్రత్యేకమైన డిజైన్ ఇందులో అందించారు. దీని ముందువైపు చాలా కొత్తగా ఉండనుంది. ఉపరితలం గ్లాస్ బ్లాక్‌తో రూపొందించారు. ఇందులో ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్స్, సైడ్ క్లాడింగ్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఉన్నాయి

2. దీని ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. డ్యాష్‌బోర్డును ఇందులో లేయర్స్ వారీగా విభజించారు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టంను అందించారు. 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు అదనపు ఆకర్షణ.

3. ఇందులో వన్ టచ్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సీట్ మెకానిజం అందించారు. ఇది మూడో వరుసలో అందుబాటులో ఉంది. మీరు ఒక బటన్ ప్రెస్ చేయగానే... సీట్ ఫోల్డ్ అవుతుంది. మూడో వరుసలో స్పేస్ కూడా పెద్దగానే ఉంది. మధ్య వరుసలో స్పేస్ కూడా ఎక్కువ ఉంది. ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఇందులో అందించారు.

4. కియాలో 64 కలర్ యాంబియంట్ లైటింగ్ ఉంది. దీంతోపాటు వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు, స్పీడ్ లిమిటర్ ఉన్న ఆటో క్రూయిజ్ కంట్రోల్, స్పోర్ట్, ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో అందించడం విశేషం.

5. ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందించారు. 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ 138 బీహెచ్‌పీ, 242 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుండటం విశేషం. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి.

Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!

Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget