అన్వేషించండి

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

‘హ్యూందాయ్’ సంస్థకు చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ కారును కొనాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే దాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. భవిష్యత్తులో ఆ మోడల్ దొరక్కపోవచ్చు.

ఎంట్రీ-లెవెల్‌లో హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవల్సిందే. హ్యాందాయ్ సంస్థ.. అత్యంత ప్రజాధారణ పొందిన ‘శాంత్రో’(Santro) కారును విక్రయాలను నిలిపేయాలని నిర్ణయించుకుందట. ‘ఎకనామిక్ టైమ్స్’ రిపోర్ట్ ప్రకారం.. ‘శాంత్రో’ కారు సేల్స్ తగ్గిపోవడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ‘శాంత్రో’ కార్ల ఉత్పత్తిని ఆపేయడం బెటర్ అని భావిస్తోందట. అయితే, ఈ సంస్థ ‘శాంత్రో’ కార్లను విక్రయాలను ఆపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఈ కార్లను మార్కెట్లో రిలీజ్ చేయలేదు. 

దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ..  ఇంతకుముందు 2014లో ‘శాంత్రో’ కార్ల విక్రయాలను నిలిపేసింది. 2018లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌తో ‘శాంత్రో’ను రంగంలోకి దించింది. ప్రారంభ-స్థాయి హ్యాచ్‌బ్యాక్ అప్పట్లో రూ.3.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండేది. అయితే, ఇప్పుడు హ్యాచ్‌బ్యాక కార్ల ధరలు ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. దీని వలన ‘శాంత్రో’ కారు ధర కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ శాంత్రో’ ప్రారంభ ధర(ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం) రూ.4.9 లక్షల నుంచి మొదలై రూ.6.42 లక్షల వరకు ఉంది. 

2018 నుంచి కార్ల ధరల పెరుగుదలకు సేఫ్టీ రూల్స్, BS6 ఉద్గార(emission) నిబంధనలు ప్రధాన కారణమని తెలుస్తోంది. అలాగే, పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు కూడా భారంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరు నుంచి కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ప్రయాణికుల భద్రత కోసం ఇకపై అన్ని కొత్త కార్లలో ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చాలి. ఈ నిబంధన అమలు చేస్తే.. శాంత్రో కారు ధర మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ బ్యాక్ అమ్మకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో హ్యూందాయ్ సంస్థ.. ‘శాంత్రో’ను అప్‌డేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికికైతే హ్యూందాయ్ శాంత్రో కారు ఇండియాలో విక్రయాలకు అందుబాటులోనే ఉంది. ఆన్‌లైన్ లేదా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కానీ, ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనేది కేవలం ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తెలుస్తుంది. 

View this post on Instagram
 
A post shared by Hyundai India (@hyundaiindia)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Embed widget