అన్వేషించండి

2026లో ఎలక్ట్రిక్ కార్ల జాతర: టాటా, టయోటా నుండి విన్‌ఫాస్ట్ వరకు.. మార్కెట్లోకి రానున్న టాప్ 10 ఈవీలు ఇవే!

ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగంలో 2026 ఒక కీలక మైలురాయి కానుంది. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి లగ్జరీ ఎస్‌యూవీల వరకు సరికొత్త ఫీచర్లతో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహన రంగం 2026లో కొత్త పుంతలు తొక్కనుంది. కేవలం రేంజ్ మాత్రమే కాకుండా డిజైన్, టెక్నాలజీ, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ వంటి సరికొత్త ప్లాన్లతో కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సిటీ హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, ఫ్యామిలీ ఎంపీవీల విభాగంలో రాబోతున్న టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)
పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వస్తున్న సియెర్రా ఈవీ 2026 మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ కంటే తక్కువ ధరలో లభిస్తుంది. రెట్రో-మోడరన్ డిజైన్, ఎల్‌ఈడీ లైట్ బార్, క్లోజ్డ్ ఫ్రంట్ ఫాసియాతో చాలా స్టైలిష్‌గా ఉండనుంది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది.

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్
టాటా తన మోస్ట్ అఫర్డబుల్ ఈవీని కొత్త లుక్‌తో తీసుకొస్తోంది. షార్పర్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, కొత్త బంపర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణ. ఇందులో పంచ్ ఈవీలో ఉన్న 30 kWh బ్యాటరీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల సిటీ డ్రైవింగ్‌లో మైలేజ్ మెరుగుపడుతుంది.

విన్‌ఫాస్ట్ ఎంపీవీ 7 (VinFast MPV 7)
వియత్నాం బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఏప్రిల్ 15, 2026న తన ఎంపీవీ 7ను లాంచ్ చేయనుంది. మూడు వరుసల సీటింగ్, ప్రీమియం లెదర్ ఇంటీరియర్, 60.1 kWh బ్యాటరీతో ఇది ఫ్యామిలీస్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది 150 bhp పవర్, 280 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)
టయోటా నుండి వస్తున్న ఈ ఫస్ట్ మాస్ మార్కెట్ ఈవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో 49 kWh (440 కి.మీ రేంజ్), 61 kWh (543 కి.మీ రేంజ్) అనే రెండు బ్యాటరీ ఛాయిస్‌లు లభిస్తాయి. జేబీఎల్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా అవిన్యా (Tata Avinya)
టాటా నుండి వస్తున్న ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్‌యూవీ ఇది. 80 kWh పెద్ద బ్యాటరీతో లాంగ్ రేంజ్ ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. దీని ఫ్యూచరిస్టిక్ డిజైన్, విశాలమైన క్యాబిన్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఇది 2026 చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)
కియా తన అత్యంత చౌకైన ఈవీగా సైరోస్‌ను రూపొందిస్తోంది. బాక్సీ డిజైన్, 12.3 ఇంచ్ డ్యూయల్ స్క్రీన్స్, పనోరమిక్ సన్‌రూఫ్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ. 15-20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

విన్‌ఫాస్ట్ వీఎఫ్3 (VinFast VF3)
బడ్జెట్ ధరలో సిటీ కారు కావాలనుకునే వారి కోసం వీఎఫ్3 వస్తోంది. 18.64 kWh బ్యాటరీతో 215 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. చిన్న సైజులో ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు.

హోండా 0 ఆల్ఫా (Honda 0 Alpha)
హోండా తన నెక్స్ట్ జనరేషన్ ఈవీ టెస్టింగ్ రాజస్థాన్‌లో ప్రారంభించింది. ఇది సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచ‌ర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. 2027లో అఫీషియల్ లాంచ్ కంటే ముందే 2026లో దీనిపై క్లారిటీ రానుంది.

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ (VinFast Limo Green)
ఇది ప్రధానంగా కమర్షియల్, ఫ్లీట్ అవసరాల కోసం వస్తోంది. క్యాబిన్ స్పేస్, తక్కువ నిర్వహణ ఖర్చు దీని మెయిన్ అడ్వాంటేజెస్ గా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మహీంద్రా బిఇ.07 (Mahindra BE.07)
మహీంద్రా కొత్త ఇంగ్లో (INGLO) ప్లాట్‌ఫామ్‌పై ఇది తయారవుతోంది. 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లతో 2027 ఆరంభంలో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

 

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget