అన్వేషించండి

మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మెరిసిపోవాలా? Car Wax vs Ceramic Coating.. మీ వెహికిల్ కు ఏది బెస్ట్

కారు పెయింట్‌ను కాపాడుకోవడానికి వ్యాక్స్, సిరామిక్ కోటింగ్ తరుచుగా వాడుతారు. వీటి మధ్య ఉన్న లాభనష్టాలు, ఖర్చు, మెయింటెనెన్స్ వివరాల గురించి తెలుసుకుందాం

మీ కారు షోరూమ్ నుండి వచ్చినప్పుడు ఎంతలా మెరిసిపోతుందో, కొన్ని నెలలు గడిచేసరికి ఆ మెరుపు క్రమంగా తగ్గుతుంటుంది. ఎండ, దుమ్ము, వర్షం వల్ల పెయింట్ పాడవ్వడం సహజం. మీ కారును ఒక అద్దంలా మెరిపించడానికి, పెయింట్‌కు రక్షణ కల్పించడానికి మార్కెట్లో రెండు ప్రధాన ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సంప్రదాయంగా వచ్చే 'కార్ వ్యాక్స్', రెండోది ఆధునిక టెక్నాలజీతో కూడిన 'సిరామిక్ కోటింగ్'. ఈ రెండింటిలో మీ అవసరానికి, బడ్జెట్‌కు ఏది సెట్ అవుతుందో ఇక్కడ చూద్దాం.

కార్ వ్యాక్స్ (Car Wax) ..
కార్ వ్యాక్స్ అనేది దశాబ్దాలుగా వాడుతున్న పెయింట్ ప్రొటెక్షన్ పద్ధతి. ఇది కారు బాడీపై ఒక పల్చని పొరలా ఏర్పడి దుమ్ము, పక్షుల రెట్టలు, యూవీ కిరణాల నుండి రక్షణ ఇస్తుంది. సహజ సిద్ధమైన కార్నౌబా వ్యాక్స్ లేదా సింథటిక్ పాలిమర్లతో ఇవి తయారవుతాయి. ఇది కారుకు మంచి షైనింగ్ ఇస్తుంది కానీ దీని ప్రభావం కేవలం కొన్ని వారాలు లేదా రెండు నెలలు మాత్రమే ఉంటుంది. తక్కువ ఖర్చులో పని పూర్తి కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఇక దీని లాభాల విషయానికొస్తే, ధర చాలా తక్కువ, ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే  మీరే సొంతంగా అప్లై చేసుకోవడంతోపాటు, పెయింట్‌కు సహజమైన, లోతైన మెరుపును ఇస్తుంది. అయితే ఇందులో కొన్ని న‌ష్టాలున్నాయి. దీని రక్షణ చాలా తక్కువ కాలం ఉంటుంది. అలాగే ప్రతి 4 నుండి 8 వారాలకు ఒకసారి మళ్ళీ పూయాల్సి ఉంటుంది.  స్క్రాచ్‌లు, కెమికల్స్ నుండి పెద్దగా రక్షణ ఇవ్వదని నిపుణులు అంటున్నారు.

సిరామిక్ కోటింగ్ (Ceramic Coating)..
సిరామిక్ కోటింగ్ అనేది ఒక లిక్విడ్ పాలిమర్. ఇది కారు పెయింట్‌తో కెమికల్ బాండ్ ఏర్పరచుకుని ఒక గట్టి పొరలా మారుతుంది. ఇది హైడ్రోఫోబిక్ (Hydrophobic) లక్షణాన్ని కలిగి ఉంటుంది, అంటే నీరు లేదా మురికి కారుపై నిలవకుండా జారిపోతాయి. క్వాలిటీని బట్టి ఇది 1 నుండి 5 ఏళ్ల వరకు మన్నిక ఇస్తుంది. పెయింట్ ఆక్సీకరణం చెందకుండా, చిన్న చిన్న గీతలు పడకుండా ఇది అద్భుతంగా కాపాడుతుంది. దీని వ‌ల‌న క‌లిగే లాభాలేమిటంటే, 5 ఏళ్ల వరకు దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది. అలాగే, యూవీ కిరణాలు, కెమికల్స్ దరిచేరవు. కారును క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇందులోను కొన్ని ప్ర‌తికూలత‌లు ఉన్నాయి. వ్యాక్స్ కంటే దీని ధర చాలా ఎక్కువ. నిపుణుల ద్వారానే కోటింగ్ వేయించుకోవాలి. వాటర్ మార్క్స్ పడకుండా వంద శాతం ఆపలేదు.

మీరు దేన్ని ఎంచుకోవాలి?
మీరు కారును తరచుగా మెయింటెనెన్స్ చేయడానికి ఇష్టపడితే, తక్కువ బడ్జెట్‌లో పని కావాలంటే కార్ వ్యాక్స్ తీసుకోండి. అలా కాకుండా, ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఐదేళ్ల వరకు కారు కొత్తదానిలా ఉండాలనుకుంటే సిరామిక్ కోటింగ్ బెస్ట్ ఆప్షన్. మీ బడ్జెట్, సమయం, కారు పట్ల మీకున్న శ్రద్ధను బట్టి నిర్ణయం తీసుకోండి. ఏది ఎంచుకున్నా సరే, క్రమం తప్పకుండా కారును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దాని అందం రెట్టింపు అవుతుందని విశ్లేష‌కులు అంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు - జూన్‌ సేల్స్‌లో TVS నంబర్ వన్; Bajaj, Ather, Vida జోరు
పెట్రోల్‌ రేట్ల దెబ్బకి జూన్‌లో పెరిగిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు - పోటీ గట్టిగానే ఉంది బాసూ!
జూన్ కార్ల అమ్మకాల్లోనూ మారుతి హవా - టాటా, మహీంద్రా హోరాహోరీ రేస్‌
జూన్‌లో లక్షన్నర కార్లు అమ్మిన మారుతి - దరిదాపుల్లో కూడా లేని ఇతర కంపెనీలు
Ather 450Xలో మూడు కొత్త కలర్ ఆప్షన్లు - మీ టైమ్‌ సేవ్‌ చేసే కొత్త ఛార్జర్‌ కూడా లాంచ్
కొత్త కలర్‌ కాంబినేషన్‌తో Ather 450X ఓవర్‌టోన్‌ సిరీస్‌ - చూపు తిప్పుకోనివ్వని స్టైల్‌!
టాటా సియెర్రా EV వేరియంట్‌లలో పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవే.. మీ అవసరానికి సరిపడే కాంబినేషన్‌ ఏది?
టాటా సియెర్రా EVలో ఏ వేరియంట్‌కు ఎంత బ్యాటరీ? కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget