Tesla: టెస్లాకు మళ్లీ షాక్, పన్ను మినహాయింపుపై కేంద్రం ఏం అందంటే?
టెస్లాకు పన్ను విధింపులు కావాలంటే తయారీ, అసెంబ్లింగ్, సోర్సింగ్ అన్నీ మనదేశంలోనే చేస్తామని హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.
అమెరికా దిగ్గజ కంపెనీ టెస్లాకు మనదేశంలో మరోసారి చుక్కెదురైంది. ‘ఒకవేళ టెస్లా లేదా ఇతర కంపెనీలకు పన్ను మినహాయింపులు కావాలంటే తయారీ, అసెంబ్లింగ్, సోర్సింగ్ అన్నీ మనదేశంలోనే చేస్తామని హామీ ఇవ్వాలి.’ అని ఒక అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పన్ను విధింపులకు లోబడే ఇతర విదేశీ కంపెనీలు మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తున్నాయని ఆర్థిక శాఖకు చెందిన ఈ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పన్ను విధింపులకు లోబడి ఎవరైనా మనదేశంలో వ్యాపారం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎలాన్ మస్క్ పన్ను తగ్గించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు మొదట విదేశాల్లో తయారు చేసిన వాహనాలను తక్కువ ధరకు విక్రయించేందుకు అనుమతిని ఇవ్వాలని కూడా అడిగారు.
ప్రస్తుతం మనదేశంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తున్నారు. ఇవి కంప్లీట్ బిల్ట్ యూనిట్లపై (సీబీయూ) విధించే పన్ను. అంటే పూర్తిగా నిర్మించిన యూనిట్ అన్నమాట. విడిభాగాలు దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తే వాటిపై పన్ను వేరేలా ఉంటుంది.
గతేడాది సెప్టెంబర్‌లో రెడ్ టెస్లా మోడల్ 3 కారును దేశ రాజధానిలోని రోడ్ల రవాణా శాఖ భవనం, హైవేలపై నడుపుతూ టెస్లా అధికారులు కనిపించారు. అదే సమయంలో వారు మనదేశంలోని అధికారులను కలిసి టెస్లా ఇండియా బిజినెస్ ప్లాన్లను వివరించారు.
View this post on Instagram
View this post on Instagram