అన్వేషించండి

మండే ఎండలో టెస్ట్ - హ్యుందాయ్ వెన్యూ Vs కియా సోనెట్‌ - ఏసీ కింగ్ ఏది?

కారు ఎక్స్‌పర్ట్స్‌... హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ SUVల ఏసీ పనితీరును 41 డిగ్రీల ఉష్ణోగ్రతలో పరీక్షించారు. క్యాబిన్‌ను ఏ కారు వేగంగా చల్లబరుస్తుందో తెలుసుకోండి.

Hyundai Venue vs Kia Sonet: మన తెలుగు రాష్ట్రాల్లో ఏ కాలంలోనైనా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటడం సాధారణ విషయమే. అలాంటి పరిస్థితుల్లో కారులో ఏసీ పనితీరు ఎంత బాగుంటుందనేది తెలుగు ప్రజలకు కీలక అంశంగా మారుతోంది. ముఖ్యంగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మోడళ్లలో ఏది క్యాబిన్‌ను వేగంగా చల్లబరుస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎక్స్‌పర్టులు ప్రత్యేక పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షలో రెండు వాహనాలను దాదాపు రెండు గంటల పాటు నేరుగా ఎండలో పార్క్ చేశారు. అనంతరం 41.2 డిగ్రీల సెల్సియస్ బాహ్య ఉష్ణోగ్రత వద్ద ఏసీ పనితీరును విశ్లేషించారు. క్యాబిన్ ఉష్ణోగ్రత, వెంట్ నుంచి వచ్చే గాలి చల్లదనం, ముందు & వెనుక సీట్ల వద్ద ఉష్ణోగ్రతలను ప్రత్యేక సెన్సార్ల సహాయంతో కొలిచారు.

హ్యుందాయ్ వెన్యూ ఫలితాలు

పరీక్ష ప్రారంభంలో హ్యుందాయ్ వెన్యూ క్యాబిన్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. కేవలం ఒక నిమిషం పాటు వాహనం నిలిపి ఉంచి ఏసీ ఆన్ చేసిన తర్వాత ముందు సీట్ల భాగంలో ఉష్ణోగ్రత 53.2 డిగ్రీల నుంచి 40.7 డిగ్రీలకు, వెనుక సీట్ల భాగంలో 52.2 డిగ్రీల నుంచి 39.7 డిగ్రీలకు తగ్గింది.

ఐదు నిమిషాల డ్రైవింగ్ తర్వాత ముందు సీట్ల వద్ద ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలకు, వెనుక సీట్ల వద్ద 29.7 డిగ్రీలకు చేరింది. 15 నిమిషాల ప్రయాణం పూర్తయ్యే సరికి క్యాబిన్ మొత్తం సుమారు 30 డిగ్రీల వద్ద స్థిరపడింది.

వెన్యూ ఏసీ వెంట్లు విశాలంగా ఉండటంతో గాలి క్యాబిన్ అంతటా సమర్థవంతంగా వ్యాపించినట్లు పరీక్షలో గుర్తించారు. దీంతో ముందు, వెనుక సీట్ల ప్రయాణికులు సమాన స్థాయిలో చల్లదనాన్ని అనుభవించారు.

కియా సోనెట్ ఫలితాలు

కియా సోనెట్‌లో పరీక్ష ప్రారంభ సమయంలో ముందు, వెనుక సీట్ల వద్ద ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఒక నిమిషం పాటు ఏసీ నడిపిన తర్వాత ముందు సీట్ల భాగంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు, వెనుక సీట్ల భాగంలో 44 డిగ్రీలకు తగ్గింది.

ఐదు నిమిషాల డ్రైవింగ్ తర్వాత ముందు సీట్ల వద్ద ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, వెనుక భాగంలో 32 డిగ్రీలుగా నమోదైంది. 15 నిమిషాల తర్వాత ముందు భాగంలో 31.7 డిగ్రీలు, వెనుక భాగంలో 30.7 డిగ్రీలకు తగ్గింది.

ఈ పరీక్షలో ఉపయోగించిన సోనెట్ X-Line వేరియంట్ మ్యాట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్, పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్‌తో వచ్చింది. సాధారణంగా బ్లాక్ రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. అయినప్పటికీ, నిలువుగా ఉండే ఏసీ వెంట్లు & విస్తృత గాలి పంపిణీ వ్యవస్థ వల్ల క్యాబిన్‌ను సమర్థవంతంగా చల్లబరచగలిగింది.

ఏ SUV గెలిచింది?

రెండు వాహనాలు కూడా తీవ్రమైన ఎండలో మంచి ఏసీ పనితీరును కనబరిచాయి. అయితే పరీక్షలో నమోదైన గణాంకాల ప్రకారం హ్యుందాయ్ వెన్యూ క్యాబిన్‌ను మరింత వేగంగా చల్లబరచగలిగింది. ముఖ్యంగా, ప్రారంభ దశలో ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించడంలో వెన్యూ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది.

కియా సోనెట్ కూడా మంచి ఫలితాలు సాధించినప్పటికీ, క్యాబిన్‌ను చల్లబరచే వేగం విషయంలో వెన్యూ కంటే కొంత వెనుకబడింది. అందువల్ల, వేడి ప్రాంతాల్లో అత్యుత్తమ ఏసీ పనితీరును కోరుకునే కొనుగోలుదారులకు హ్యుందాయ్ వెన్యూ కొంత మెరుగైన ఎంపికగా నిలుస్తుంది.

అయితే, వాస్తవ వినియోగంలో వాతావరణ పరిస్థితులు, పార్కింగ్ ప్రదేశం, క్యాబిన్ రంగులు, ప్రయాణికుల సంఖ్య వంటి అంశాలపై కూడా ఏసీ పనితీరు ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Vehicle Insurance: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్‌ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
వాహన బీమా లేకుండా టోల్ ప్లాజా దాటితే SMS అలర్ట్.. రూ.10,000 వరకు జరిమానా!
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget