అన్వేషించండి

Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూపై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?

Hyundai Venue Discount: హ్యుందాయ్ వెన్యూపై దేశీయ మార్కెట్లో భారీ డిస్కౌంట్ అందించారు.

Discount Offer on Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూని దేశీయ మార్కెట్‌లోని కస్టమర్లు చాలా ఇష్టపడుతున్నారు. దీనికి ఒక కారణం ఏమిటంటే ఇది చాలా మంది కస్టమర్‌ల బడ్జెట్‌లో సరిపోతుంది. దీన్ని మరింత సులభతరం చేస్తూ కంపెనీ ఈ నెలలో ఈ కారుపై తగ్గింపును రూ.30 వేల వరకు అందించింది. హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని రూ. 7.94 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విక్రయిస్తుంది. దీన్ని ఆరు వేరియంట్లలో (E, S, S(O), S Plus, SX, SX(O)) కొనుగోలు చేయవచ్చు.

ఇది డిస్కౌంట్ ఆఫర్
హ్యుందాయ్ వెన్యూపై కంపెనీ రూ. 30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెలలో కారును బుక్ చేసుకోవడం ద్వారా కంపెనీ అందించే ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందించనున్నారు. అయితే ఇవి మోడల్, లొకేషన్, సిటీని బట్టి మారవచ్చు.

హ్యుందాయ్ వెన్యూ ఇంజిన్
ఈ ఎస్‌యూవీ మూడు ఇంజన్ ఎంపికలతో ఇంటికి తీసుకురావచ్చు. ఇందులో మొదటిది 1.2 లీటర్ పెట్రోల్, రెండోది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మూడోది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులోని ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ వరుసగా 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్.

వీటితో పోటీ?
దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ... మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి కార్లతో పోటీ పడుతోంది. ఇతర వాహన తయారీ కంపెనీలు కూడా ఫిబ్రవరిలో తమ కార్లపై గొప్ప తగ్గింపులను అందిస్తున్నారు. ఇందులో అత్యధిక స్టాక్ గత సంవత్సరం నుండి వచ్చిందే. 

మరోవైపు మారుతి సుజుకి ఇటీవలే అరేనా, నెక్సా సిరీస్‌ల డీలర్‌షిప్‌లలో ఉన్న తన కార్ల ధరలను మార్చింది. అప్‌డేట్ చేసిన ధరల గురించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. మారుతి గ్రాండ్ విటారా ధర అప్‌డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ సహా మారుతి గ్రాండ్ విటారా సెలక్ట్ చేసిన వేరియంట్‌ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. అయితే అన్ని ఇతర వేరియంట్‌ల ధరలు రూ.10,000 వరకు పెరిగాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్‌లతో గ్రాండ్ విటారా పోటీ పడనుంది. గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 10.80 లక్షల నుంచి రూ. 20.09 లక్షల మధ్యలో ఉంది. దీన్ని 10 రంగులు, రెండు ఇంజన్ ఆప్షన్లు, నాలుగు వేరియంట్లలో లాంచ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా  ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించిన ఏడీఏఎస్ వేరియంట్‌పై కూడా ప్రస్తుతం పని జరుగుతోంది. మీరు ఈ నెలలో ఈ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే దీనిపై రూ.75,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Viral News: రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Embed widget