అన్వేషించండి

Hyundai Launches Grand i10 NIOS: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్ వచ్చేసింది - ఫీచర్ల విషయంలో తగ్గేదే లే!

హ్యుందాయ్ ఇండియా తన గ్రాండ్ i10 నియోస్ కారులో స్పెషల్ వైబ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. రూ. 7.09 లక్షల ప్రారంభ ధరతో వచ్చే ఈ కారులో డ్యాష్‌క్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Launches Grand i10 NIOS Vibe Edition News: ఇండియ‌న్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ గ్రాండ్ i10 నియోస్‌లో సరికొత్త 'వైబ్ ఎడిషన్' (Vibe Edition) విడుదల చేసింది. ఇప్పటికే క్రెటా సమ్మర్ ఎడిషన్‌తో కస్టమర్లను ఆకట్టుకున్న హ్యుందాయ్, ఇప్పుడు గ్రాండ్ i10 నియోస్‌ను మరింత స్టైలిష్‌గా మార్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర ఎక్స్‌షోరూమ్ వద్ద రూ. 7.09 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 7.73 లక్షల వరకు ఉంటుంది. స్పోర్టీ లుక్ కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును డిజైన్ చేసిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యకత్ం చేస్తున్నారు. 

మ్యాట్ కలర్ - ఇంటీరియర్ అప్‌డేట్స్..
ఈ వైబ్ ఎడిషన్‌లో 'టైటన్ గ్రే' అనే కొత్త మ్యాట్ పెయింట్ ఆప్షన్‌ను హ్యుందాయ్ పరిచయం చేసింది. ఈ సెగ్మెంట్‌లోని హ్యాచ్‌బ్యాక్ కార్లలో మ్యాట్ కలర్ ఫినిషింగ్ రావడం ఇదే మొదటిసారి అని కంపెనీ చెబుతోంది. కారు లోపల నలుపు రంగు ఇంటీరియర్‌కు ఎరుపు రంగు ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. 15-అంగుళాల బ్లాక్ అలాయ్ వీల్స్, లెదర్ కవర్ ఉన్న స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఈ కారు రాజసాన్ని పెంచుతాయి. వీటితో పాటు ఆటోమేటిక్ ఏసీ, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సెగ్మెంట్ ఫస్ట్ డ్యాష్‌క్యామ్..
ఈ కారులోని హైలైట్ ఫీచర్ డ్యాష్‌క్యామ్ (Dashcam). పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కంపెనీ ఇన్-బిల్ట్‌గా డ్యాష్‌క్యామ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇందులో డ్రైవింగ్, ఎమర్జెన్సీ, ఈవెంట్, వెకేషన్ రికార్డింగ్ వంటి వివిధ మోడ్స్ ఉన్నాయి. ఫోటోలు తీయడమే కాకుండా, ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా వీడియోలను నేరుగా మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న ఆస్టా (Asta) వేరియంట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సదుపాయాలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

సెక్యూరిటీ ఇంజిన్ సామర్థ్యం..
భద్రత విషయంలో హ్యుందాయ్ ఎక్కడా రాజీ పడలేదు. వైబ్ ఎడిషన్‌లోని అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ పరంగా చూస్తే, ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 83 హెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్‌జీ (CNG) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా టియాగో వంటి కార్లకు ఈ గ్రాండ్ i10 నియోస్ గట్టి పోటీనిస్తోందని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఏదేమైనా కొత్త ఎడిషన్ తో నూతన ఆర్థిక సంవత్సరం సేల్స్ లో దూసుకుపోవాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే పలు ప్రత్యేకతలతో కూడిన ఈ కారును లాంచ్ చేసినట్లు నిపుణలు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget