GST కోతల తర్వాత Hyundai Creta కొనడం ఈజీ, ఇప్పుడు ఈ కారు రేటు ఎంత దిగి వచ్చిందంటే?
Hyundai Creta Price Drop: 1500cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లపై GST రేటు 28% నుంచి 40%కి పెంచారు. అయితే, క్రెటాపై పన్ను రేటు 10% తగ్గింది.

Hyundai Creta GST Reduction Price: భారత ప్రభుత్వం జీఎస్టీ నిర్మాణంలో పెద్ద మార్పు చేయడంతో చాలా కార్ల ధరలు అమాంతం తగ్గాయి. ఇప్పుడు చిన్న కార్లు & మధ్య స్థాయి వాహనాలపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. పెద్ద SUV లపై 40 శాతం పన్ను విధించారు, గతంలో ఉన్న సెస్సును కూడా తొలగించారు. హ్యుందాయ్ క్రెటా.. 1500cc కంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన SUV. ఈ కారుకు కూడా GST కోత వర్తిస్తుంది, తద్వారా ధర బాగా తగ్గుతుంది.
క్రెటా లుక్స్
హ్యుందాయ్ క్రెటా కొత్త డిజైన్ (అప్‌డేటెడ్ డిజైన్) మరింత షార్ప్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఫ్రంట్‌లో ఉన్న పరుచుకున్నట్లు ఉన్న గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్ SUVకి అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో బలమైన క్యారెక్టర్ లైన్స్, స్పోర్టీ అలాయ్ వీల్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్‌లో LED టెయిల్‌ల్యాంప్స్ & మస్క్యులర్ బంపర్ డిజైన్ క్రెటాకు ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తున్నాయి.
హ్యుందాయ్ క్రెటాపై ఇప్పుడు ఎంత ఆదా అవుతుంది?
హ్యుందాయ్ క్రెటాపై ఇప్పుడు దాదాపు 50% (28% GST + 22% సెస్) మొత్తం పన్ను చెల్లించాలి. ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త GST రేటు కింద, ఇది 40 శాతం GST పరిధిలోకి వస్తుంది దీనివల్ల మొత్తం పన్ను దాదాపు 10 శాతం తగ్గుతుంది. వాస్తవానికి, 1500cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్లపై GST రేటును 28 శాతం నుంచి 40 శాతంకు పెంచారు, అదే సమయంలో సెస్‌ను పూర్తిగా తొలగించారు. అందుకే, ఇది 40 పరిధిలోకి చేరినా, గతం కంటే 10 శాతం పన్ను తగ్గుతుంది.
ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి రూ. 20.76 లక్షల మధ్య ఉంది. కొత్త GST రేటు అమల్లోకి వచ్చిన తర్వాత, దాని ధర రూ. 10.36 లక్షల నుంచి రూ. 19.37 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్యకు దిగి వస్తుంది. ఈ విధంగా, హ్యుందాయ్ క్రెటా ధర ఏకంగా రూ. 75,000 నుంచి రూ. 1,40,000 వరకు తగ్గే అవకాశం ఉంది.
హ్యుందాయ్ క్రెటా పవర్‌ట్రెయిన్
హ్యుందాయ్ క్రెటా మూడు 1.5 లీటర్ ఇంజన్ వేరియంట్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. అప్‌డేట్ చేసిన క్రెటాలో 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT) & 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఫీచర్లు
ADAS లెవల్-2, 360 డిగ్రీల కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు & ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ కారులో కనిపిస్తాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అప్‌డేట్ అయింది. మొత్తంగా, హ్యుందాయ్ క్రెటా 70 కి పైగా సేఫ్టీ ఫీచర్లతో తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంది.





















