అన్వేషించండి

Citroen Basalt X కొత్తగా లాంచ్ - ₹7.95 లక్షలకే ADAS లాంటి ఫీచర్లు, Max వేరియంట్‌పై రూ.లక్ష తగ్గింపు

Citroen Basalt X Price: సిట్రోయెన్ బసాల్ట్ X రూ. 7.95 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కొత్త Max వేరియంట్‌లో కూల్డ్ సీట్స్, అంబియంట్ లైటింగ్, డిజిటల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు చేర్చారు.

Citroen Basalt X Launch Price Features: సిట్రోయెన్‌, తన కొత్త కూపే SUV Basalt X ని ఇండియాలో లాంచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.95 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం ₹11,000 టోకెన్ అమౌంట్‌తో August 22 నుంచే ప్రీ-బుకింగ్స్‌  ప్రారంభమయ్యాయి. ఈ కొత్త వెర్షన్‌లో ధర తగ్గింపుతో పాటు, ఎక్కువగా కస్టమర్లు కోరుకున్న ఫీచర్లు కూడా యాడ్‌ చేశారు.

ధరలు & వేరియంట్లు (ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ -  ఎక్స్‌-షోరూమ్‌)

2025 బసాల్ట్ X లైనప్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి, అవి - You, Plus, Max

You ట్రిమ్ - రూ. 7.95 లక్షలు

Plus ట్రిమ్ - రూ. 9.42 లక్షల నుంచి రూ. 12.07 లక్షల వరకు

Max ట్రిమ్ - రూ. 11.63 నుంచి రూ. 12.90 లక్షల వరకు

మాక్స్ వేరియంట్‌ ధర గత ఏడాది రూ. 13.87 లక్షల నుంచి తగ్గి ఇప్పుడు రూ. 12.90 లక్షలకు వచ్చింది. అంటే దాదాపు ఒక లక్ష రూపాయలు తక్కువ. డ్యూయల్‌టోన్‌ రూఫ్‌ కోసం రూ. 21,000, 360-డిగ్రీ కెమెరా కోసం రూ. 25,000 ఎక్స్‌ట్రా చెల్లించాలి.

ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్
కారు బయటి భాగంలో పెద్దగా మార్పులు లేవు. అయితే ‘X’ బ్యాడ్జ్‌ టెయిల్‌గేట్‌ పై కొత్తగా కనిపిస్తుంది. ఇది బసాల్ట్‌కి కొత్త ఐడెంటిటీ ఇస్తుంది.

ఇంటీరియర్ & ఫీచర్లు
అసలు హైలైట్ ఇంటీరియర్‌లోనే ఉంది. కొత్త Max వేరియంట్‌లో బ్రాన్జ్ ట్రిమ్, టాన్-బ్లాక్ కలర్ అప్‌హోల్స్‌టరీ, లెదరేట్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్ వాడారు. దీంతో, ఈ కారులోకి ఎక్కి కూర్చోగానే లగ్జరీ కారులో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది.

ఫీచర్లలో కనిపించే పెద్ద మార్పు Cara డిజిటల్ అసిస్టెంట్. ఇది రియల్‌ టైమ్ ఫ్లైట్ స్టేటస్, ట్రాఫిక్ రూట్ ఆప్టిమైజేషన్, వెహికల్ హెల్త్ అప్‌డేట్స్, SOS కాలింగ్, రిమైండర్స్ వంటి ఫీచర్లను ఇస్తుంది. అయితే, ఇది Max ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అదనంగా చేర్చిన ఫీచర్లు:

  • కూల్డ్ సీట్లు 
  • వైట్ ఆంబియంట్ లైటింగ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • కీ లెస్ ఎంట్రీ
  • పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
  • LED ఫాగ్ ల్యాంప్స్
  • ఆటో డిమ్మింగ్ IRVM

ఇంజిన్ & గేర్‌బాక్స్

ఇంజిన్‌లో మార్పులేమీ లేవు. 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 110hp పవర్‌, 148Nm టార్క్ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్స్‌లో 1.2 లీటర్‌ నార్మల్ పెట్రోల్ ఇంజిన్‌ 82hp పవర్‌తో, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది.

సారాంశం చెప్పాలంటే, Citroen Basalt X ఇప్పుడు మరింత అందుబాటు ధర SUV గా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది. కొత్త ఫీచర్లతో పాటు, Max వేరియంట్‌ ధర తగ్గడంతో ఈ బ్రాండ్‌ కార్ల కాంపిటీషన్‌లో బలంగా నిలుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

September 2026 Car Sales: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు
టాటా కార్ల కంటే మహీంద్రా కార్లపైనే జనం మోజు.. గత నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?
రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget