అన్వేషించండి

హైదరాబాద్‌, విజయవాడలో హ్యుందాయ్ క్రెటా ఆన్-రోడ్ ధర ఎంత? కార్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంతవుతుంది?

Hyundai Creta EMI Calculator: హ్యుందాయ్‌ క్రెటాను, ఆర్థిక భారం లేకుండా కార్‌ లోన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు మూడు 1.5-లీటర్ ఇంజిన్ వేరియంట్లతో అందుబాటులో ఉంది.

Hyundai Creta Price, Down Payment, Car Loan and EMI Details: హ్యుందాయ్ క్రెటా, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV లలో ఒకటి. ఈ కారును సిటీల్లో నడపడానికి, ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా కొంటున్నారు. స్టైలిష్‌ అప్పీల్‌, మోడ్రన్‌ ఫీచర్లు & పవర్‌ఫుల్‌ ఇంజిన్ కారణంగా ఈ SUV చాలా వేగంగా అమ్ముడవుతోంది. హైదరాబాద్‌, విజయవాడలో హ్యుందాయ్‌ క్రెటా బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 11.11 లక్షలు (Hyundai Creta ex-showroom price, Hyderabad Vijayawada). మీరు ఈ డ్రీమ్‌ కారును ఫైనాన్స్‌లో తీసుకుంటే, ముందుగా కొంత డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత మీ జీతం నుంచి ప్రతినెలా EMI కట్‌ అవుతుంది. నెలకు ఎంత EMI కట్‌ అవుతుంది, ఎన్నేళ్లు కట్‌ అవుతుందో లెక్కలు తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడలో ఆన్-రోడ్ ధర ఎంత? 
హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13 లక్షల 76 వేలు. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13 లక్షల 70 వేలు. మీరు, బెజవాడలో ఈ కారుకు ఫైనాన్స్ తీసుకోవాలంటే, ముందుగా రూ. 2.60 లక్షలు డౌన్‌ పేమెంట్‌ చేయాలి. మిగిలిన 11.10 లక్షలను కార్‌ లోన్‌గా తీసుకోవాలి. బ్యాంక్‌, ఈ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం.

EMI ఆప్షన్స్‌

4 సంవత్సరాల్లో కార్‌ లోన్‌ క్లియర్‌ కావాలంటే ప్రతి నెలా రూ. 27,599 EMI చెల్లించాలి.

5 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ. 23,022 EMI కట్టాలి.

6 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే ప్రతి నెలా రూ. 19,992 EMI జమ చేయాలి. 

7 సంవత్సరాల లోన్‌ టెన్యూర్ ఎంచుకుంటే ప్రతి నెలా రూ. 17,844 EMI కట్‌ అవుతుంది.

మీ జీతం రూ. 70-80 వేలు ఉండి, మీకు ఇతర పెద్ద రుణ బాధ్యతలు లేకపోతే, మీరు 4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఎంచుకోవచ్చన్నది ఆర్థిక నిపుణుల సలహా.  

హ్యుందాయ్ క్రెటా పవర్‌ట్రెయిన్ & ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటా మూడు 1.5-లీటర్ ఇంజిన్ వేరియంట్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. అప్‌డేట్‌ చేసిన క్రెటాలో 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్‌, (IVT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ (DCT) & 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలు ఉన్నాయి.

ఏ కార్లతో ఇది పోటీ పడుతుంది? 
ఇతర లక్షణాల దగ్గరకు వస్తే.. హ్యుందాయ్ క్రెటాలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అప్‌డేటెడ్‌ కార్ టెక్నాలజీతో కనెక్ట్‌ చేశారు. ADAS లెవల్-2, 360 డిగ్రీల కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు & ఇంకా చాలా మోడ్రన్‌ ఫీచర్లు ఉన్నాయి.  మొత్తంగా, హ్యుందాయ్ క్రెటాలో 70 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో Kia Seltos, Maruti Suzuki Grand Vitara & Toyota Urban Cruiser Hyhyder తో పోటీ పడుతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Embed widget