అన్వేషించండి

Hyundai Creta Loan: నెలకు రూ.50 వేలు సంపాదించే వాళ్లు కూడా హ్యుందాయ్ క్రెటా కొనవచ్చా? కార్‌ లోన్‌, EMI చెక్‌ చేస్కోండి

Hyundai Creta On EMI: హ్యుందాయ్ క్రెటా, తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV లలో ఒకటి. మీరు ఈ ఛార్మింగ్‌ ఫోర్‌వీలర్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈజీ ఫైనాన్స్ ప్లాన్‌ కూడా ఉంది.

Hyundai Creta Price, Down Payment, Car Loan and EMI Details: హ్యుందాయ్ క్రెటా SUV, తెలుగు ప్రజలకు ఇష్టమైన ఫోర్‌వీలర్లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణలో ఈ హ్యుందాయ్ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.50 లక్షల వరకు (Hyundai Creta ex-showroom price, Hyderabad Vijayawada) ఉంటుంది. మీ జీతం రూ. 50 వేలు అయితే మీరు ఈ కారును ఎంచక్కా ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర
మీరు ఈ కారును హైదరాబాద్‌లో కొంటే, ఎక్స్‌-షోరూమ్‌ రేటుతో పాటు రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 1.93 లక్షలు, బీమా కోసం దాదాపు రూ. 60,000, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ. 12,000 చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుని, భాగ్యనగరంలో ఈ బండి దాదాపు రూ. 13.76 లక్షలకు (Hyundai Creta on-road price, Hyderabad) రోడ్డు మీదకు వస్తుంది. 

విజయవాడలో హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకువెళ్లాలంటే, రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 1.89 లక్షలు, బీమా కోసం దాదాపు రూ. 58,000, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ. 12,000 చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుని, దాదాపు రూ. 13.69 లక్షలకు (Hyundai Creta on-road price, Vijayawada) బెజవాడలో ఈ బండి కీ మీ చేతిలోకి వస్తుంది. 

మీరు ఇంత బడ్జెట్‌ పెట్టలేకపోతే, ఒకేసారి చెల్లించడానికి బదులుగా, కారు లోన్‌పై కూడా మీ డ్రీన్‌ కారును కొనుగోలు చేయవచ్చు. తద్వారా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని EMI రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. అంటే, మీ డబ్బును పెద్ద మొత్తంలో కదిలించాల్సిన అవసరం లేకుండానే ఈ కారును సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.

హ్యుందాయ్ క్రెటా కోసం నెలకు ఎంత EMI చెల్లించాలి? 
ఉదాహరణకు, మీరు విజయవాడలో హ్యుందాయ్ క్రెటాను కార్‌ లోన్‌పై కొనాలనుకుంటే, ముందుగా కనీసం రూ. 2.60 లక్షలు డౌన్‌ పేమెంట్‌ చేయాలి. మిగిలిన రూ. 11.09 లక్షలను కార్‌ లోన్‌ తీసుకుని చెల్లించవచ్చు. బ్యాంక్‌, ఈ లోన్‌పై 9% వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుంటే...

7 సంవత్సరాల కోసం కార్‌ లోన్‌ తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 17,844 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి 

6 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 19,992 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి 

5 సంవత్సరాల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 23,022 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి 

4 సంవత్సరాల్లో అప్పు మొత్తం తీర్చేయాలంటే, మీరు ప్రతి నెలా రూ. 27,599 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి 

మీ నెలవారీ జీతం రూ. 50,000 అయితే, ఈ కారు 7 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. మీ జీతం లేదా నెలవారీ ఆదాయం రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే, మీరు ఎక్కువ మొత్తాన్ని కార్‌ లోన్‌ కోసం మళ్లించగలిగితే, 5 లేదా 6 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

మీరు ఎంత ఎక్కువ మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ చేయగలిగితే, మీరు తీసుకునే కారు రుణం అంత తగ్గుతుంది, EMI మొత్తం కూడా తగ్గుతుంది.

హ్యుందాయ్ క్రెటా కొనడానికి కార్‌ లోన్‌ తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. బ్యాంకుల విభిన్న విధానాల కారణంగా లోన్‌ EMI గణాంకాలలో తేడా ఉండవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget