Tata Punch: టాటా పంచ్‌కు ఎంత ఈఎంఐ కట్టాలి? - అలాగే డౌన్‌పేమెంట్ ఎంత పడుతుంది?
Tata Punch Downpayment: టాటా పంచ్ కారును ఈఎంఐలో కొనాలంటే ఎలా? ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? నెల నెలా ఎంత వాయిదా చెల్లించాల్సి ఉంటుంది? వంటి వివరాలన్నీ తెలుసుకుందాం.
Tata Punch On EMI: టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అమ్ముడుపోతున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో చేరింది. ఈ టాటా కారును బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అని పిలవవచ్చు. ఈ కారు ధర ఏడు లక్షల రూపాయల రేంజ్ లో ఉంది. అదే సమయంలో ఈ కారును కొనుగోలు చేయడానికి ఒకేసారి పూర్తిగా చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఈ టాటా కారును కార్ లోన్ తీసుకొని ఇంటికి కూడా తీసుకురావచ్చు. ఆ తర్వాత మీరు ప్రతి నెలా కొన్ని వేల రూపాయలు ఈఎంఐగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
టాటా పంచ్‌కు ఈఎంఐ ఎంత కట్టాలి?
టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.7.3 లక్షలుగా ఉంది. ఈ కారును కొనుగోలు చేసేందుకు బ్యాంకు నుంచి రూ.6.53 లక్షల రుణం లభిస్తుంది. కారు లోన్ మొత్తం మీ క్రెడిట్ స్కోర్ ఎంత బాగా ఉందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ లోన్‌పై విధించే వడ్డీ రేటు ప్రకారం మీరు ప్రతి నెలా బ్యాంకుకు వెళ్లి ఈఎంఐ రూపంలో నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి.
- టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి రూ. 66 వేలు డౌన్ పేమెంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- టాటా పంచ్ కొనుగోలుపై బ్యాంక్ తొమ్మిది శాతం వడ్డీని వసూలు చేసి నాలుగేళ్ల పాటు ఈ లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 14,850 ఈఎంఐ డిపాజిట్ చేయాలి.
- మీరు ఈ రుణాన్ని ఐదేళ్ల కాలవ్యవధితో తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా దాదాపు రూ. 12,400 డిపాజిట్ చేయాలి.
- టాటా పంచ్‌ను కొనుగోలు చేయడానికి ఆరేళ్లపాటు రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.10,800 ఈఎంఐ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- టాటా పంచ్‌ను కొనుగోలు చేసేందుకు ఏడేళ్ల పాటు రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.9,600 ఈఎంఐ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టాటా పంచ్ ధరలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. దీంతో పాటు పంచ్‌పై లభించే రుణ మొత్తం కూడా భిన్నంగా ఉండవచ్చు. కారు రుణంపై వడ్డీ రేటులో తేడా ఉంటే, ఈఎంఐ లెక్కల్లో కూడా తేడా ఉండవచ్చు. కారు లోన్ తీసుకునే ముందు అన్ని రకాల సమాచారాన్ని పొందడం ముఖ్యం.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Legendary SUVs LEVELLED UP with World Class Safety!
— Tata Motors Cars (@TataMotors_Cars) November 11, 2024
Now equipped with ADAS - Level 2.
• Packed with 20 Key Functions including Lane Keep Assist & Lane Centering System 😎
• Stunning new colors to choose from ✨#IndiasSafestVehicles #ADASL2 #SafetyLevelledUp pic.twitter.com/ymRrkiLKfq