Honda Shine Finance Plan: కేవలం రూ.6500 డౌన్ పేమెంట్‌తో స్టైలిష్ షైన్ కొంటే నెలకు EMI ఎంత కట్టాలి?
Honda Shine Down Payment: తెలుగు రాష్ట్రాల్లో హోండా షైన్ డిస్క్ OBD 2B వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 1,06,567. ఈ హోండా బైక్ కొనడానికి, మీరు దాదాపు రూ.లక్ష రుణం పొందవచ్చు.

Buying Honda Shine On Bank Loan And EMI: తెలుగు ప్రజలు ఎక్కువగా కొంటున్న, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల్లో హోండా షైన్ ఒకటి. దీని లుక్స్ చాలా స్టైల్‌గా ఉంటుంది. లుక్స్ పరంగా క్రేజీ యూత్‌ను, మైలేజ్ పరంగా మధ్య తరగతి ప్రజలను ఇది బాగా ఆకర్షిస్తోంది. ఈ బైక్ ధర కూడా తక్కువగా, బడ్జెట్ గీత దాటకుండా ఉంటుంది. ఇన్ని సుగుణాల వల్ల ఈ స్మార్ట్ బైక్‌ను ఎవరూ కాదనలేరు. అయితే, హోండా కంపెనీ, గత కొన్ని నెలలుగా ఈ సుప్రసిద్ధ బైక్ ధరను పెంచుతూ వచ్చింది. గత కొన్ని నెలల్లో హోండా షైన్ బైక్ ధర 1,994 రూపాయలు పెరిగింది. బైక్‌లో అప్‌డేట్స్. ఈ మోటార్ సైకిల్‌లో తాజా OBD-2B నిబంధనలు ప్రవేశపెట్టడం వంటివి ధర పెరుగుదలకు కారణాలు.
హోండా షైన్ కొత్త ధరలు
హోండా షైన్, ప్రస్తుతం, రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది, అవి - డ్రమ్ & డిస్క్. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 1,242 పెరిగింది, ఎక్స్-షోరూమ్ ధర (Honda Shine Drum ex-showroom price) ఇప్పుడు రూ. 84,493 కి చేరుకుంది. దీని డిస్క్ వేరియంట్ ధర రూ. 1,994 పెరిగింది, ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Honda Shine Disc ex-showroom price) రూ. 89,245 కి చేరుకుంది. దీనికి RTO (రిజిస్ట్రేషన్) ఖర్చు 11,143 రూపాయలు, వాహన బీమా 7,356 రూపాయలు, ఇతర ఖర్చులు 995 రూపాయలు, అదనపు వారంటీ 897 రూపాయలు కలిపితే ఆన్-రోడ్ ధర వస్తుంది.
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు నగరాల్లో హోండా షైన్ డిస్క్ - OBD 2B వెర్షన్ ఆన్-రోడ్ ధర (Honda Shine Drum OBD 2B on-road price) 1,06,567 రూపాయలు అవుతుంది. మీ దగ్గర కేవలం 6,567 రూపాయలు ఉంటే చాలు, మిగిలిన లక్ష రూపాయలను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్‌గా పొందవచ్చు. బ్యాంక్/ఫైనాన్స్ కంపెనీ వచ్చే లోన్ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రుణంపై బ్యాంకు కొంత శాతం వడ్డీని వసూలు చేస్తుంది, వడ్డీ రేటు కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. లోన్ మొత్తం, వడ్డీ శాతం, రుణ కాల పరిమితి ప్రకారం ప్రతి నెలా సులభమైన వాయిదాలు (EMI) చెల్లిస్తే చాలు, స్మార్ట్ లుకింగ్ షైన్ మీ సొంతం అవుతుంది.
ఎంత EMIని ఎన్ని సంవత్సరాలు కట్టాలి?
హోండా షైన్ అప్‌డేటెడ్ మోడల్ కొనుగోలు చేయడానికి, మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 6,567 డిపాజిట్ చేస్తే, మిగిలిన లక్ష రూపాయలు లోన్ వస్తుంది.
రెండేళ్ల కాలానికి రుణం తీసుకుంటే, బ్యాంక్ ఈ రుణంపై 9 శాతం వడ్డీని వసూలు చేస్తుందనుకుంటే, ప్రతి నెలా రూ. 4,568 EMI డిపాజిట్ చేయాలి. మీరు ఈ 24 నెలల్లో (రెండేళ్లు) మొత్తం వడ్డీ రూ. 9,643 + అసలు రూ. 1,00,000 కలిపి మొత్తం రూ. 1,09,643 ను బ్యాంక్/ఫైనాన్స్ కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.
మూడేళ్ల కాలానికి రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, మీరు 36 నెలల పాటు ప్రతి నెలా రూ. 3,180 EMI కట్టాలి. మీరు ఈ 36 నెలల్లో (మూడేళ్లు) మొత్తం వడ్డీ రూ. 14,479 + అసలు రూ. 1,00,000 కలిపి మొత్తం రూ. 1,14,479 ను తిరిగి చెల్లిస్తారు.
నాలుగేళ్ల కాలానికి రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, మీరు 48 నెలల పాటు ప్రతి నెలా రూ. 2,489 EMI చెల్లించాలి. మీరు ఈ 48 నెలల్లో (నాలుగేళ్లు) మొత్తం వడ్డీ రూ. 19,448 + అసలు రూ. 1,00,000 కలిపి మొత్తం రూ. 1,19,448 ను తిరిగి చెల్లిస్తారు.
హోండా షైన్ కొనడానికి మూడు సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు 9 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 3,500 EMI చెల్లించాలి. ఈ హోండా మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయడానికి, నాలుగు సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో 48 నెలల పాటు ప్రతి నెలా రూ.2,800 బ్యాంకులో EMIగా డిపాజిట్ చేయాలి.





















